Telugu News, Telugu Cinema News, Andhra News, Telangana News, Political News
బేబో కరీనా కపూర్ ఖాన్ అనగానే గ్లామర్, జీరో సైజ్ గుర్తుకొస్తాయి. అమ్మ‌డు మంచి ఫిట్ నెస్ ప్రీక్ కావ‌డంతో? నోరు క‌ట్టేసుకునే నటిగా భావిస్తాం. కానీ క‌రీనాకు రుచులు ఆర‌గించ‌డంలో ఉన్న మక్కువ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపో వాల్సిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కరీనా ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విష‌యాలు వెల్ల‌డిం చింది. ముఖ్యంగా ఇష్టమైన దేశీ వంటకం తినకపోతే రాత్రి పూట నిద్ర కూడా పట్టదని అంటోంది. మ‌రి ఫిట్‌నెస్‌కు అంత ప్రాధాన్యత ఇచ్చే నటి ఇలా భోజన ప్రియురాలిగా మారడం వెనుక ఒక అందమైన జీవనశైలి దాగి ఉంది.
కరీనాకు ఎన్ని ఖరీదైన అంతర్జాతీయ వంటకాలు ముందున్నా? మన ఇంటి రుచుల్లో భాగంగా పప్పు-అన్నం అంటే ప్రాణ‌మంటోంది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా? ప్రపంచంలో ఏ మూల ఉన్నా? రోజు చివర్లో తాను కోరుకునేది మాత్రం కమ్మని దేశీ భోజనమే . ఆ భోజ‌నం క‌డుపు నిండా తినకపోతే నిద్రపోలేను అంటోంది. ఆహారం అనేది కేవలం ఆకలిని తీర్చుకునేది మాత్రమే కాదు. అది మానసిక ప్రశాంతతను ఇచ్చే ఔషధం కూడా. డైటింగ్ పేరుతో కడుపు మార్చుకునే నేటి కాలంలో కరీనా మాటలు ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి.
అయితే ఈ ఫుడ్ లవ్ తినడానికే పరిమితం కాలేదు. వంటగదిలో భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి గడపడం కూడా తనకు అత్యంత ఆనందాన్ని ఇస్తుందంటోంది. సైఫ్ అలీ ఖాన్‌కు వంట చేయడం అంటే చాలా ఇష్టమని ఇంట్లో ఉన్నప్పుడు తానే స్వయంగా రకరకాల వంటకాలు చేసి పెడతారని మురిసిపోయింది. సైఫ్ వంట చేస్తుంటే? తాను పక్కన కూర్చుని ఆయనతో కబుర్లు చెప్పడం సంగీతం వినడం ఎంతో ఇష్టమైన వ్యాపకమని తెలిపింది. దీంతో ఈ జంటకు వంటగది అనేది కేవలం ఆహారం తయారు చేసే చోటు మాత్రమే కాదు. వారి బంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా మారింద‌ని చెప్పొచ్చు.
కరీనా కపూర్ ఫిట్‌నెస్ రహస్యం కూడా ఆమె ఆహారపు అలవాట్లలోనే ఉంది. తాను ఎప్పుడూ క్రాష్ డైటింగ్ నమ్న న‌ని, పూర్వీకులు తిన్న సంప్రదాయ ఆహారమే ఆరోగ్యానికి మేలు చేస్తుందని గట్టిగా నమ్ముతా నంటోంది. నెయ్యి, పప్పు, కూరగాయలు వంటి స్వచ్ఛమైన దేశీ ఆహారం తీసుకోవడం వల్లనే తాను రెండు ప్రసవాల తర్వాత కూడా ఇంత త్వరగా ఫామ్‌లోకి రాగలిగానని చెప్ప‌కొచ్చింది. సరైన పద్ధతిలో, సరైన సమయంలో తింటే ఏ ఆహారమైనా అమృతమేనని క‌రీనా అనుభవం ద్వారా చాటి చెబుతుంది. ఇంటి వంటలో ఉండే ప్రేమ, ఆత్మీయత బయట హోటల్ భోజనంలో దొరకదని అభిప్రాయపడింది. ముఖ్యంగా పండగలు, సెలవు దినాల్లో కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం తమ ఇంటి సంప్రదాయమని అంటోంది. పిల్లలు తైమూర్, జెహ్‌లకు కూడా చిన్నప్పటి నుంచే ఇంటి వంటల విలువను ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేస్తామంటోంది. బ‌య‌ట తినే ఆహారం కంటే ఇంటి భోజ‌న‌మే ఆరోగ్య‌క‌ర‌మైందని చెబుతుంటామంది.
ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశంగా ఐస్లాండ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. వేల ఏళ్లుగా అక్కడ ఒక్క దోమ కూడా కనిపించేది కాదు. కానీ, ప్రకృతిలో వస్తున్న మార్పుల వల్ల ఆ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. ఐస్లాండ్ రాజధాని రేక్జావిక్ సమీపంలో శాస్త్రవేత్తలు దోమలను గుర్తించడంతో ఆ దేశ ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. అడవి జంతువులకు, మనుషులకు ప్రశాంతతనిచ్చే ఆ మంచు ద్వీపంలో దోమలు ఎలా ఎంట్రీ ఇచ్చాయో ఇప్పుడు చూద్దాం..
ఐస్లాండ్‌లో దోమల బోణి:
ఆర్కిటిక్ ప్రాంతంలోని దేశాలన్నింటిలో దోమల హోరు ఎక్కువగా ఉంటుంది, కానీ ఐస్లాండ్‌లో మాత్రం అవి అస్సలు ఉండేవి కావు. అక్కడ ఉండే చల్లని వాతావరణం, మంచు గడ్డకట్టే తీరు దోమలు పెరగడానికి సహకరించేది కాదు. అయితే, తాజాగా 'సైన్స్' జర్నల్‌లో ప్రచురితమైన రిపోర్ట్ ప్రకారం.. ఐస్లాండ్ ఉత్తర ప్రాంతంలో దోమలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇక దోమలు లేని దేశం అనే బిరుదును ఐస్లాండ్ కోల్పోయింది.
వాతావరణ మార్పులే అసలు కారణం:
ప్రపంచం మొత్తం మీద ఆర్కిటిక్ ప్రాంతం నాలుగు రెట్లు వేగంగా వేడెక్కుతోంది. ఎండలు పెరగడం, మంచు త్వరగా కరిగిపోవడం వల్ల దోమలు బతకడానికి కావాల్సిన వాతావరణం అక్కడ తయారవుతోంది. గతంలో దోమలు అక్కడ గుడ్లు పెట్టినా అవి పొదిగేవి కావు, కానీ ఇప్పుడు మారుతున్న వేడి వల్ల అవి హాయిగా వృద్ధి చెందుతున్నాయి. ఇక ఇది కేవలం దోమల సమస్య మాత్రమే కాదు, భూగోళం ఎంత వేగంగా మారిపోతుందో చెప్పడానికి ఒక పెద్ద హెచ్చరిక.
మనుషుల ప్రమేయం కూడా ఉందా?: దోమలు కేవలం గాలిలో ఎగురుతూ అక్కడికి చేరుకోలేదు. పెరుగుతున్న షిప్పింగ్ వ్యాపారం, టూరిజం, వల్ల దోమలు ఓడలు, విమానాల ద్వారా కొత్త ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఇక ఒకప్పుడు ఒంటరిగా, ప్రశాంతంగా ఉన్న ఐస్లాండ్ వంటి దేశాలకు మనుషుల రాకపోకల ద్వారా ఇలాంటి కీటకాలు ప్రయాణిస్తున్నాయి.
జీవవైవిధ్యంపై పడే ప్రభావం:
దోమలు రావడం వల్ల అక్కడి పర్యావరణం మొత్తం తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, ఆర్కిటిక్ పక్షులు కీటకాలు పుట్టే సమయాన్ని బట్టి ఆహారం తింటాయి. ఇప్పుడు ఆ సమయం మారుతుండటంతో పక్షులకు తిండి దొరకడం కష్టమవుతోంది.
దోమలు రావడం అంటే కేవలం ఒక చిన్న కీటకం రావడం కాదు, ప్రకృతి తన సమతుల్యతను కోల్పోతోందని అర్థం. ఐస్లాండ్ ప్రజలకు ఇది ఒక కొత్త రకమైన చికాకు కావచ్చు, కానీ ప్రపంచానికి మాత్రం ఇది గ్లోబల్ వార్మింగ్ ఇస్తున్న స్ట్రాంగ్ వార్నింగ్. ఇప్పటికైనా మనం పర్యావరణం గురించి ఆలోచించకపోతే, ఇలాంటి మార్పులు మరిన్ని చూసే అవకాశం ఉంది.
Rashi Singh is steadily carving her space in Indian cinema with her charming screen presence and confident performances. Known for her expressive acting style and graceful personality, she has become a promising face in Telugu film industry and digital entertainment space. With each project, Rashi continues to impress audiences by blending natural acting with modern glamour, making her a favorite among young viewers.
She has been part of notable recent Telugu projects and emerging film ventures, where she has showcased her versatility in both emotional and light-hearted roles. Along with films, Rashi Singh has also gained attention through web-based appearances and music videos that highlight her stylish appeal and strong on-screen energy. Her growing popularity on social media further reflects her rising fan base and influence among the youth.
In recent times, she has been associated with new-age Telugu cinema projects and upcoming films that aim to present her in more prominent and challenging roles. With a perfect mix of talent and elegance, Rashi Singh is expected to have a strong lineup ahead in South Indian cinema.
As her journey continues, audiences are eagerly waiting to see her in more impactful and breakthrough performances on the big screen.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న `పెద్ది` పై అంచనాలుఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా సినిమాలోని పాత్రల గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వస్తోంది. సీనియర్ నటుడు జగపతి బాబు పోషించిన అప్పాల సూరి పాత్ర సినిమాకు ఆయువుపట్టు అని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఒకే రకమైన విలన్ పాత్రలతో బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఈ సినిమాలో జగ్గుభాయ్ సరికొత్త అనుభూతిని అందించబోతున్నారుట‌.
ఇన్‌సైడ్ టాక్ ప్రకారం సినిమాలో జగపతి బాబు పాత్ర అత్యంత ఎమోషనల్‌గా ఉండబోతోందిట‌. `రంగస్థలం`లో క్రూరమైన ప్రెసిడెంట్‌గా మెప్పించిన ఆయన ఈసారి రామ్ చరణ్‌కు తండ్రిగా ఓ అద్భుతమైన నటనను కనబ రిచారట. మొదటి భాగంలో అప్పాల సూరి క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందని హీరో `పెద్ది` పాత్రను ముందుకు నడిపించే ఇంధనంలా పాత్ర సాగుతుంద‌ని సమాచారం. జగపతి బాబు కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని ఈ పాత్రకు గానూ అవార్డు రావడం ఖాయమని రషెస్ చూసిన వారు ప్రశంసిస్తున్నారు.
సినిమాలోని ఇంటర్వెల్ మలుపు వెనుక కూడా జగపతి బాబు పాత్రే ప్రధాన కారణంగా ఉండబోతోందిట‌. హీరో జీవితానికి ఓ బలమైన లక్ష్యాన్ని ఏర్పరిచే ఎమోషనల్ సీన్ల ద్వారా ప్ర‌ధ‌మార్ధం ముగ‌స్తుంద‌ని అంటున్నారు. ఆ సమయంలో వచ్చే ఫైట్ సీక్వెన్స్‌కు దారితీసే పరిస్థితులు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని తెలుస్తోంది. రామ్ చరణ్, జగపతి బాబు మధ్య వచ్చే తండ్రీకొడుకుల సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని లికులు అందుతున్నాయి. ఈ విష‌యంలో శిష్యుడు ఎంత హృద్యంగా వాటిని చిత్రీక‌రించాడ‌ని గురువు సుకుమార్ కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.
బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెన లో క్లైమాక్స్ తాను ఎంత మాత్రం ఊహించ‌లేద‌ని..ఆ క్లైమాక్స్ చూసే బుచ్చిబాబు గొప్ప ద‌ర్శ‌కుడు అవుతాడ‌ని సుకుమార్ భావించిన‌ట్లు ఓపెన్ గానే చెప్పారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ లాంటి పెద్ద స్టార్ తో సినిమా తీసిన నేప‌థ్యంలో ఎమోష‌నల్ గా ఆ స‌న్నివేశాలు ఊహ‌కంద‌ని విధంగా ఉంటాయ‌ని అంతే న‌మ్మ‌కంతో సుకుమార్ ఉన్నారు. `పెద్ది` విజ‌యం సాధిస్తే ఇండ‌స్ట్రీలో బుచ్చిబాబు స్థానం మారిపోతుంది. టాప్ 5 డైరెక్ట‌ర్ల‌లో బుచ్చిబాబు చేరిపోతాడు. పాన్ ఇండియాలో ఈ సినిమా తెచ్చే గుర్తింపు అత‌డిని బాలీవుడ్ కు సైతం ప్ర‌మోట్ చేస్తుంది.
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో ప్రధాని మోదీ 3.0 ప్రభుత్వం అధికారం చేపట్టి వచ్చే నెలకు రెండేళ్లు పూర్తవనున్నాయి. 2024 మేలో ఎన్నికలు జరగగా, జూన్ లో ఫలితాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్నందున కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికావడం, కీలకమైన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో జోష్ మీద ఉన్న బీజేపీ నేతలు పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారని అంటున్నారు. దీంతో పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేయడంతోపాటు కేంద్ర మంత్రివర్గంలో మార్పు చేర్పులు చేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 16 లేదా ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని కేంద్ర కేబినెట్ ను విస్తరిస్తారని అంటున్నారు. జూన్ మొదటివారంలోగా ప్రభుత్వంలోను, పార్టీలోనూ మార్పులు పూర్తి చేయాలని ప్రధాని మోదీ కృతనిశ్చయంతో ఉన్నారని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధానంగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోడానికి ఎలాగూ విస్తరణ చేయాల్సివుందని, పనిలో పనిగా మరికొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడుతున్నారని చెబుతున్నారు.
2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి వర్గాన్ని విస్తరించాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రధానంగా యువతను కేబినెట్ లో తీసుకుని సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించే విషయమై కసరత్తు జరుగుతోందని అంటున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సమాలోచనలు చేశారని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడంపై చంద్రబాబు సలహా కోరారని చెబుతున్నారు. బెంగాల్ లో అధికారంలోకి వచ్చినందున నెక్ట్స్ టార్గెట్ గా పెట్టుకున్న తెలంగాణలో పార్టీని పరుగులు పెట్టించే ఉద్దేశంతో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్లకు కేంద్ర కేబినెట్ లో చోటివ్వాలని ప్రధాని మోదీ ఆలోచనగా చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో సీనియర్ నేత కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరితోపాటు మరొకరికి కూడా కేబినెట్ లో చోటివ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కిషన్ రెడ్డి దాదాపు 12 ఏళ్లుగా మంత్రిగా కొనసాగుతుండటం, బండి సంజయ్ కుమారుడు వివాదాల్లో చిక్కుకోవడం కూడా చర్చగా మారిందని అంటున్నారు. అదేవిధంగా ఏపీకి చెందిన ఒకరిద్దరికి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే ప్రతిపాదన కూడా ఉందని అంటున్నారు. మరోవైపు ఒక కీలక రాష్ట్రానికి ముస్లిం నేతను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రతిపాదనను బీజేపీ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామాలతో బీజేపీ, దాని మిత్రపక్షాల్లో మంత్రి పదవుల ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నట్లు చెబుతున్నారు.
తమిళనాడులో ఎన్నికల అనంతరం రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా ‘సోఫాల రాజకీయం’ అందరినీ ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రిగా దళపతి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా విపక్ష నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, సీనియర్ నేత వైగోను విజయ్ వ్యక్తిగతంగా కలిశారు. తాజాగా ఏఐడీఎంకే తిరుగుబాటు నేత షణ్ముగంను కలవాలని విజయ్ భావించారు. కాసేపట్లో విజయ్ వెళతారనగా, షణ్ముగం ఇంటికి కొత్త సోఫాతో ఓ వాహనం రావడం తమిళనాడు రాజకీయాలలో విస్తృత చర్చకు దారితీసింది.
తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే అధికారం చేపట్టేందుకు కావాల్సిన బలాన్ని మాత్రం సాధించలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు దళపతి విజయ్ ఇతర పార్టీలను ఆశ్రయించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. దీంతో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం కూడా చేశారు. ఈ నెల 13లోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సివుండగా, ఏఐడీఎంకేలో చీలికతో ఓ వర్గం విజయ్ కి అనూహ్య మద్దతు ప్రకటించింది. దీంతో అసెంబ్లీలో ప్రభుత్వ అనుకూల సభ్యుల బలం 150కి చేరింది.
ఈ నేపథ్యంలో తనకు మద్దతు పలికిన షణ్ముగంను కలవాడానికి ముఖ్యమంత్రి విజయ్ వెళతారనగా, ఆయన ఇంటికి ముందుగా ఓ సోఫా వెళ్లడం నెట్టింట ఆసక్తికర చర్చగా మారింది. గతంలో కూడా వీసీకే మద్దతు కోసం విజయ్ ఆ పార్టీ కార్యాలయానికి వెళతారనగా, కొత్త సోఫాలు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన నెటిజన్లు పుష్ప సినిమాలో ‘సోఫాల’ను గుర్తు చేస్తున్నారు. మద్దతు కోసం విజయ్ ‘పుష్ప’ను ఫాలో అవుతున్నారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ ప్రచారంపై వెంటనే స్పందించిన వీసీకే నేతలు తమ కార్యాలయానికి విజయ్ వస్తున్నారని తెలిసి, మర్యాద కోసం అప్పటికప్పుడు కొత్త సోఫాలు కొనుగోలు చేశామని వివరణ ఇచ్చింది.
దీంతో ఆ ఎపిసోడ్ ముగిసిందని అనుకుంటుండగా, మళ్లీ ఏఐడీఎంకే నేత షణ్ముగం ఇంటి వద్ద మరో కొత్త సోఫా ప్రత్యక్షమవడం గమనార్హం. ప్రస్తుతం ఈ సోఫాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పుష్ప’ సోఫాలా లేక మర్యాద కోసం కొత్తగా కొనుగోలు చేస్తున్న సోఫాలా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా షణ్మగం ఇంటికి వెళ్లిన సోఫా ఎక్కడి నుంచి వచ్చింది అన్న స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. విజయ్ వస్తున్నందున వీసీకే పార్టీ నేతలు మాదిరిగా షణ్ముగం కూడా కొత్తది కొనుగోలు చేశారా? లేక ఇంకెవరైనా గిఫ్ట్ ఇచ్చారా? అన్నది తేలాల్సివుంది. దీనిపై ఏఐడీఎంకే, టీవీకే నేతలు ప్రకటన చేయాల్సివుందని అంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు విజయ్‌ ప్రమాణ స్వీకారం చేశాడు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విజయ్ ప్రజలకు తన పార్టీ నాయకులకు, తన ఫ్యాన్స్ ఇబ్బందులు కలిగించకూడదు అంటూ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన అభిమానులకు ముందస్తుగానే సీరియస్‌ వార్నింగ్‌ ఇవ్వడం ద్వారా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రజల సంక్షేమం కోసం పార్టీని ప్రారంభించినట్లుగా ప్రకటించిన విజయ్‌, వారికి ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా పార్టీ వర్గాల వారు చెబుతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా సీఎం విజయ్‌ పార్టీ అధికారిక ఖాతా ద్వారా నాయకులకు, ఫ్యాన్స్‌కి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు అనడం కంటే వారికి వార్నింగ్‌ ఇచ్చినట్లుగా ఉందని పలువురు తమిళ మీడియా వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.
సీఎం విజయ్‌ పేరుతో...
పార్టీ కార్యకర్తలు, ఫ్యాన్స్‌ వేడుకల పేరుతో రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్లెక్సీలు ఏర్పాటు చేయడం, స్టేజ్‌లు ఏర్పాటు చేసి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్‌ చేయడం వంటివి చేయకూడదు. ప్రజలకు ఏ విధంగానైనా ఇబ్బంది కలిగించే వేడుకలను నిర్వహించకూడదని అందులో పేర్కొన్నారు. అంతే కాకుండా పార్టీ నాయకుడి పేరుతో పెద్ద పెద్ద పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయకూడదని సూచించారు. పార్టీ పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. పుట్టిన రోజు వేడుకలు, ఇతర వేడుకల విషయంలో పార్టీ నాయకత్వం సూచనల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు సాగాల్సిందిగా ప్రకటనలో పేర్కొన్నారు. విజయ్‌ ఈ నిర్ణయంను తీసుకోవడంను చాలా మంది అభినందిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వేడుకలను నిర్వహించకూడదని టీవీకే పార్టీ కేడర్‌ కి ఆదేశాలు ఇవ్వడం మంచి పరిణామం.
జాతీయ స్థాయిలో విజయ్ చర్చ...
పార్టీ ఏర్పాటు చేసిన చాలా తక్కువ సమయంలోనే విజయ్‌ సీఎం పీఠం దక్కించుకోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. ఆయన్ను ఎన్ని శక్తులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు ఆయనకి మద్దతు నిలిచారు. అందుకే ఆయన సీఎం అయ్యారు. తన వెంట నడిచిన కార్యకర్తలకు, తనను నమ్మిన తమిళ ప్రజల కోసం తనదైన మార్క్‌ కొత్త పరిపాలన అందించడంతో పాటు, సాంప్రదాయ రాజకీయం పక్కన పెట్టాలని భావించాడు. అందుకే విజయ్ పార్టీ కార్యకర్తలను విజయోత్సవాలు నిర్వహించకూడదని ఆదేశించడంతో పాటు, పార్టీ పేరు చెప్పి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం వంటివి కూడా చేయకూడదని, ప్రభుత్వ అధికారుల వద్ద పార్టీ నాయకులు తమ పరపతి ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయవద్దని కూడా సొంత పార్టీ కార్యకర్తలకు నాయకులకు విజయ్‌ సూచించారని తెలుస్తోంది.
తమిళనాడు సీఎం విజయ్‌..
సినీ నటుడిగా విజయ్‌ ఎన్నో విజయాలు దక్కించుకున్నాడు. సినిమా ప్రస్థానం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ హీరోగా తొలి హిట్‌ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. విజయ్‌ కి ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌ వల్ల స్టార్‌డం రాలేదు, స్వయంగా కష్టపడి సంపాదించుకున్నాడు. తండ్రి సహకారం ఉన్నప్పటికీ దక్కని సక్సెస్‌ కోసం కష్టపడి మరీ సంపాదించాడు. దేశ వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు తన వైపు తిరిగి చూసే విధంగా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పలు రికార్డ్‌లను బ్రేక్ చేసి మరీ విజయ్‌ ను తమిళ ప్రజలు సీఎంను చేశారు. అందుకే వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు. ఆ కృతజ్ఞత భావంతోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు అన్నింటిని అప్పుడే నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. మాజీ సీఎం స్టాలిన్‌ ను కలవడం అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది.
'నాగిని' సీరియల్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌. సీరియల్స్‌లో ఒకానొక సమయంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా మౌనీ రాయ్‌ నిలిచింది. ఆకట్టుకునే రూపంతో పాటు, చక్కని నటన మౌనీరాయ్‌ ను అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లాయి. అందుకే మౌనీ రాయ్‌ సినిమాల్లోనూ ఆఫర్లు సొంతం చేసుకుంది. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే మౌనీ రాయ్‌ ప్రేమలో పడింది. 2019లో బిజినెస్‌ మెన్‌ సూరజ్ తో మోనీ కి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు దాదాపుగా మూడు ఏళ్ల పాటు ప్రేమలోనే ఉన్నారు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నామని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. పెద్దల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. 2022లో వీరి వివాహం జరిగింది. పెళ్లి అయిన కొన్నాళ్ల పాటు అంతా సవ్యంగా సాగింది. అయితే గత కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు అనే వార్తలు వచ్చాయి.
మౌనీ రాయ్‌ విడాకుల విషయం...
సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకున్న తర్వాత కూడా మౌనీ రాయ్‌ నటిగా కొనసాగింది. ఆమె నటన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా కూడా నంబియార్‌ నుంచి మౌనీ రాయ్ విడి పోతుందనే వార్తలు జోరుగా వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్‌లో ఒకరిని ఒకరు అన్‌ ఫాలో చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను, ఇతర అన్ని పోస్ట్‌లను తొలగించారు. చాలా తక్కువ సమయంలోనే వీరు విడి పోవడం చాలా మందికి బాధ కలిగిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా వీరిద్దరూ చెప్పకనే తాము విడి పోతున్నాం అని చెప్పినట్లు ఉందని, వీరు విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యారనే వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. అయితే వీరి బ్రేకప్‌ కి కారణం ఏంటి అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
దిశా పటానీ సైతం అతడిని అన్‌ఫాలో...
మౌనీ రాయ్‌ కి హీరోయిన్ దిశా పటానీ మంచి ఫ్రెండ్‌ అనే విషయం తెల్సిందే. ఇద్దరి మధ్య స్నేహంకు మించిన అనుబంధం ఉందని బాలీవుడ్‌లో అనుకుంటారు. అలాంటి దిశా పటానీ సైతం ఇన్నాళ్లు మౌనీరాయ్‌ భర్త సూరజ్‌ ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ వచ్చింది. ఇటీవల సూరజ్‌ ను మౌనీరాయ్‌ అన్‌ ఫాలో చేయడం, ఆ వెంటనే దిశా పటానీ సైతం ఆయన్ను ఇన్‌స్టాలో అన్‌ ఫాలో చేయడం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ చాలా వచ్చిందని, దాన్ని కలిపే అవకాశం లేనట్లే అని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. పెళ్లి చేసుకుని కనీసం నాలుగు ఏళ్లు సైతం కలిసి ఉండలేక పోయిన ఈ జంట విడిపోవడానికి కారణం ఏంటి అనేది అందరూ చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు వీరి విడాకుల విషయమై అధికారిక ప్రకటన రాలేదు. కానీ జరుగుతున్న పరిణామాలు అన్ని చూస్తే కచ్చితంగా ఇద్దరూ విడిపోయేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది.
బ్రహ్మాస్త్ర సినిమాలో నటిగా...
బాలీవుడ్‌ మూవీ బ్రహ్మాస్త్రలో మౌనీ రాయ్‌ పోషించిన పాత్రకు మంచి స్పందన దక్కింది. ఆమె నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమా తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చి పెట్టడంతో నటిగా అక్కడ ఇక్కడ అన్నట్లుగా బిజీ అయ్యింది. మౌనీ రాయ్‌ ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించింది. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన విశ్వంభర మూవీ త్వరలో విడుదలకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. విశ్వంభర సినిమా తర్వాత కచ్చితంగా మౌనీ రాయ్ తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భర్త నుంచి దూరం కాబోతున్న నేపథ్యంలో మౌనీరాయ్‌ మరింత బిజీ బిజీగా మారేందుకు గాను ఎక్కువ సినిమాలు కమిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఈమె మరిన్ని ఐటెం సాంగ్స్ చేస్తుందేమో చూడాలి.
కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకటన పెట్రో ధరల పెంపునకు సంబంధించినదా? లేక ఇంకేమైనా ఉంటుందా? అనే చర్చ ఎక్కువగా సాగుతోంది. గల్ఫ్ లో యుద్ధ వాతావరణం ఇంకా సర్దుమణకపోవడం, అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొనడంపై ప్రధాని మోదీ గత రెండు రోజులుగా పొదుపు చర్యలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద నోట్ల రద్దు, లాక్ డౌన్ వంటి సంచలన ప్రకటనలు చేశారు. ఆ రెండు సందర్భాల్లో ప్రధాని ప్రకటన తర్వాత దేశం తీవ్ర ఒడిదుడుకులకు లోనైనట్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా చమురు సంక్షోభం నివారించే విషయంలో కేంద్రం కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో కేబినెట్ సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయమై కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో మరింత ఆందోళన పెరుగుతోందని అంటున్నారు.
గత రెండు రోజులుగా ప్రధాని మోదీ, ఆయన మంత్రి వర్గ సహచరులు పొదుపు చర్యలపై వరుస ప్రకటనలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, వంట నూనెల వాడకాన్ని తగ్గించాలని ప్రజలను కోరుతున్నారు. ఐటీతోపాటు అవకాశం ఉన్న ఇతర రంగాల వారు వర్క్ ఫ్రం హోంకి మారాలని సూచిస్తున్నారు. అదేవిధంగా బంగారం కొనుగోలు ఆలోచనను కనీసం ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని పిలుపునిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆందోళన ఎక్కువవుతోందని అంటున్నారు. ఇదే సమయంలో పెట్రోల్ ధరల పెంపు ఉంటుందని జరుగుతున్న ప్రచారం పరిస్థితిని మరింత వేడెక్కిస్తోందని చెబుతున్నారు.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు బ్యారెల్ 105 డాలర్లు దాటి దూసుకుపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ప్రభుత్వ చమురు రంగ సంస్థలు ప్రతిపాదిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ పై కనీసం రూ.5 పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అదేవిధంగా వంట గ్యాస్ సిలెండర్ ధర రూ.40 నుంచి రూ.50 వరకు పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 15లోగా పెంపు ప్రకటన వస్తుందని జాతీయ మీడియా చెబుతున్న నేపథ్యంలో బుధవారం కేబినెట్ సమావేశం కానుండటం, ఈ సమావేశంలో ధరల పెంపుపై చర్చ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Megastar Chiranjeevi continues to redefine the meaning of aging in reverse, appearing leaner and more energetic than ever. His latest casual appearances show a man who has mastered the art of staying fit through sheer discipline and hard work. Even in his private time, his charisma is undeniable, radiating a youthful glow that has fans and the industry in awe.
He is effortlessly pulling off Gen-Z-inspired trendy outfits, proving that his sense of style is as timeless as his stardom. From contemporary fits to modern aesthetics, he carries every look with a unique swag that only the "Boss" can command.
While his physical transformation is the talk of the town, he is also gearing up for his next major cinematic journey. Chiranjeevi is set to begin filming for his upcoming project with director Bobby Kolli, produced on a grand scale by KVN Productions.
It is important to clarify that his current stylish appearance is strictly his personal casual vibe and not his look for the film. The official character look will be unveiled by the makers at the appropriate time. For now, he remains a symbol of dedication, showing everyone that staying relevant and fit is a lifelong commitment.
Prakriti Pavani continues to make a strong impression as a rising face in the digital and entertainment space, blending elegance with a refreshing on-screen charm. Known for her expressive style, confident presence, and fashion-forward appeal, she has steadily built a loyal fan base across social media and youth-driven platforms.
Her journey reflects the new-age shift where talent extends beyond traditional cinema into web content, music videos, and brand collaborations. Prakriti has been associated with a variety of recent on-screen appearances, including digital projects and short-format storytelling content that highlight her versatility. Alongside her growing popularity in the influencer space, she is also gradually stepping into more structured entertainment opportunities, with industry observers noting her potential for mainstream film and OTT roles.
In recent times, she has been seen in stylish photo shoots, promotional collaborations, and selective screen projects that keep her connected with audiences. Her evolving portfolio suggests a transition toward more prominent cinematic and streaming roles in the near future, making her one of the emerging personalities to watch.
With a strong sense of fashion and a natural camera presence, Prakriti Pavani represents the modern entertainer—dynamic, adaptable, and constantly evolving with the industry’s digital-first direction.
మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులకు ఎంత‌టి ప్రాధాన్య‌త‌నిస్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తిభావంతుడైతే అనుభవంతో ప‌నిలేకుండా అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా ఓ పది సినిమాలు చేసిన అనుభ‌వం అస‌రం లేదు. స‌రైన హిట్ ఒక్క‌టిస్తే చాలు. అత‌డిపై అన్న‌య్య‌కు న‌మ్మ‌కం క‌లిగిందంటే? నో చెప్ప‌కుండా ఛాన్స్ ఇస్తున్నా రు. `విశ్వంభ‌ర` ప్రాజెక్ట్ అలా ప‌ట్టాలెక్కిందే. చిరంజీవి-వ‌శిష్ట కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అనివార్య కార‌ణాల‌తో రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతున్నా? బ‌జ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు.
ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి సినిమా లైన‌ప్ కూడా అంతే స్ట్రాంగ్ గా క‌నిపిస్తుంది. వ‌డ‌పోసి మ‌రీ తెలివైన డైరెక్ట‌ర్ల‌ను వెతికి ప‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `వాల్తేరు వీర‌య్య` త‌ర్వాత చిరు-బాబి కాంబినేష‌న్ లో రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. ఇదీ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పవర్‌ఫుల్ స్క్రిప్ట్ తోనే వ‌స్తున్నారు. మెగాస్టార్‌ను మళ్ళీ వింటేజ్ లుక్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ రెండు సినిమాల తర్వాత చిరంజీవి `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి ప‌ని చేస్తారు. ఈసినిమాలో శ్రీకాంత్ పాత చిరంజీవిని చూపిస్తాడ‌నే ప్ర‌చారం ఇప్ప‌టికే ఠారెత్తిపోతుంది. 30 ఏ ళ్ల క్రితం నాటి చిరంజీవిని చూపించ‌బో తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చిరంజీవి ఓల్డ్ క‌ల్ట్ చిత్రం `రాక్ష‌సుడు` త‌ర‌హాలో ఉంటుంద‌ని వినిపిస్తోంది.
మెగాస్టార్ ఇమేజ్‌కు శ్రీకాంత్ ఓదెల రా స్టైల్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ తోనే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్ మూర్తి చిరంజీవిని కలవడం సరికొత్త చర్చకు దారితీసింది. `ఆపరేషన్ జావా`, `సౌదీ వెళ్ళక్క` వంటి విలక్షణమైన చిత్రాలను తెరకెక్కించిన తరుణ్ మూర్తి చిరంజీవి కోసం ఏదైనా వైవిధ్యమైన కథను సిద్ధం చేశారా? లేక ఏదైనా మలయాళ సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిరంజీవి గతంలో కొన్ని రీమేక్ చిత్రాలతో విజయాలను అందుకున్నా? ఈసారి తరుణ్ మూర్తితో ఓ స్ట్రెయిట్ సినిమానే చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
చిరంజీవిలో ఈ వైవిధ్యం ఆయన మార్కెట్ రేంజ్‌ను మరింత విస్తరించడమే కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి దోహదపడుతుంది. సీనియర్ హీరో అయినా? నేటి తరం దర్శకుల ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలుచుకోవడం చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కళ. ఇవ‌న్నీ కార్య‌రూపం దాల్చితే మెగాస్టార్ మూడేళ్ల పాటు ఖాళీ ఉండ‌రు. కొత్త సినిమాలు ఏవైనా? మూడేళ్ల త‌ర్వాతే చేయాల్సి ఉంటుంది.
డబ్బు సంపాదించడానికి మెరుగైన మార్గంగా చాలా మంది రాజకీయాలను ఎంచుకుంటారు. ఇందుకు తగ్గట్టే గల్లీల్లో రాజకీయం చేసేవారు కూడా తమ పరపతిని వాడుకుని బాగా సంపాదిస్తారనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. ఇక ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవులు అధిష్టించే నేతల ఆస్తులు, అంతస్తులపై పెద్ద అంచనాలే ఉన్నాయి. భారీ భవంతులు, విలాసవంతమైన సౌకర్యాలు, కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయనే భావన ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇందుకు భిన్నంగా సొంత ఇల్లు లేని ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఉన్నారంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిజమే కేరళం రాష్ట్రానికి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్ కోసం ఒక ఆసక్తికర సమాచారం వైరల్ అవుతోంది.
దాదాపు పదేళ్లుగా కేరళం ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో సీఎం విజయన్ తన అధికారిక నివాసమైన ‘క్లిఫ్ హౌస్‘ను ఖాళీ చేసి తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్ సమీపంలో ఒక అద్దె ఇంట్లోకి మారుతున్నారు. పదేళ్ల పాటు సీఎంగా కొనసాగిన విజయన్ అద్దె ఇంటికి మారుతున్నారనే సమాచారం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయిన విజయన్ నిరాంబరతకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు.
సీపీఎం అగ్ర నాయకుల్లో ఒకరైన ముఖ్యమంత్రి విజయన్ క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతున్నారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయనకు సొంతంగా ఇల్లు, కారు వంటి సౌకర్యాలు ఏవీ లేవని అంటున్నారు. ఆయన పేరు మీద ఉన్న ఆస్తుల విలువ కేవలం కొన్ని లక్షల్లోనే ఉండటం గమనార్హం. కన్నూర్ జిల్లాలోని స్వగ్రామంలో కొంత వారసత్వ భూమి మాత్రమే విజయన్ ఆస్తిగా చెబుతున్నారు. ఇక బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదు, షేర్ల విలువ కూడా చాలా పరిమితమేనని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఆయన ఆస్తుల్లో పెద్దగా మార్పు లేకపోవడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
సామాన్యుల కెప్టెన్ విజయన్
పినరయి విజయన్ ప్రస్థానం ఏమీ పూలబాట కాదు. ఒక చేనేత కార్మికుడి కుటుంబంలో జన్మించిన ఆయన, అత్యంత పేదరికాన్ని అనుభవించారు. విద్యార్థి దశ నుండే కమ్యూనిస్ట్ భావజాలం పట్ల ఆకర్షితులై, అట్టడుగు వర్గాల కోసం పోరాడారు. 1975-77లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో జైలు పాలై, పోలీసుల చిత్రహింసలను కూడా భరించారు. ఆ నాటి పోరాట పటిమనే ఆయనను కేరళ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘కెప్టెన్’గా నిలబెట్టిందని చెబుతున్నారు.
ఆడంబరాలకు దూరం
ముఖ్యమంత్రి విజయన్ ఆడంబరాలకు దూరంగా ఉంటారని చెబుతున్నారు. పార్టీ కేడర్, సామాన్య ప్రజలతో మమేకం కావడానికే ఎక్కువ సమయం కేటాయిస్తారని, ప్రజలతో గడపడటమే ఆయనకు ఇష్టమని అభిమానులు చెబుతుంటారు. అవినీతి మరకలు అంటకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం వల్లే ఆయన కేరళం చరిత్రలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారని అంటున్నారు. రాజకీయాల్లో విలువలు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా సామాన్య జీవితాన్ని గడపడం అనేది అరుదైన విషయంగా అభివర్ణిస్తున్నారు.
Fatima Sana Shaikh continues to impress audiences not only with her acting talent but also with her effortless fashion sense. In this latest picture, the actress keeps things simple and elegant with a white fitted top paired with classic denim jeans. The soft natural lighting and minimal styling highlight her graceful appearance, making the look both relatable and fashionable. Her casual yet confident vibe once again proves why she remains a favorite among young movie lovers and fashion followers alike.
On the professional front, Fatima has been choosing diverse and performance-oriented roles that showcase her versatility as an actress. After earning appreciation for her performances in films like Dhak Dhak and Sam Bahadur, she continues to stay busy with exciting projects in Bollywood. Fans are eagerly waiting to see her in upcoming films where she is expected to explore even more challenging and refreshing characters. Known for balancing commercial cinema with content-driven storytelling, Fatima has steadily built a strong reputation in the industry.
Whether it is on-screen performances or off-screen fashion moments, Fatima Sana Shaikh continues to capture attention with her charm, confidence, and natural elegance.
Photo Courtesy : Instagram
ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త రకమైన 'క్యూ' కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా డాలర్ కనిపిస్తే చాలు జోహార్లు అర్పించిన దేశాలన్నీ, ఇప్పుడు ‘మాకు ఈ డాలర్ వద్దు.. బ్రిక్స్ దోస్తీ ముద్దు’ అంటూ ఆ దేశాల కూటమి ముందు క్యూ కడుతున్నాయి. ఐఎంఎఫ్ (IMF) తాజాగా విడుదల చేసిన ఏప్రిల్, 2026 గణాంకాలను చూస్తుంటే, ఇది కేవలం ఒక కూటమిలా కాకుండా.. అమెరికా, యూరప్ దేశాలకు నిద్రలేకుండా చేసే ఒక 'ప్రత్యామ్నాయ ప్రపంచం'లా కనిపిస్తోంది. చైనా భారీ జీడీపీ నుంచి మొదలుకొని, పాలస్తీనా వంటి చిన్న దేశాల వరకు అందరూ ఈ క్లబ్‌లో మెంబర్‌షిప్ కోసం తహతహలాడుతుండటం చూస్తుంటే.. భవిష్యత్తులో వైట్ హౌస్ కంటే 'బ్రిక్స్' ఆఫీసు ముందే రద్దీ ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.
చైనా - ఇండియా: కూటమిలో రెండు భారీ ఇంజిన్లు!
బ్రిక్స్ సభ్య దేశాల జీడీపీ లెక్కలు చూస్తుంటే, చైనా ఏకంగా $20.85 ట్రిలియన్లతో అందనంత ఎత్తులో కూర్చుంది. దానికి పోటీగా భారతదేశం కూడా $4.15 ట్రిలియన్లతో తన సత్తా చాటుతోంది. ఈ రెండు దేశాలు కలిస్తేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా వాటా ఉండేలా ఉంది. బ్రెజిల్, రష్యా కూడా చెరో రెండున్నర ట్రిలియన్లతో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఇక్కడ ఒక వింత ఉంది.. ఒకవైపు రష్యాపై ఇన్ని ఆంక్షలు ఉన్నా, దాని జీడీపీ మాత్రం నిలకడగా ఉండటం పాశ్చాత్య దేశాలకు మింగుడుపడని నిజం. సంక్షేమ పథకాలు, అప్పులతో కుస్తీ పడుతున్న దక్షిణాఫ్రికా, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా ఈ భారీ ఇంజన్ల అండ చూసుకునే ధైర్యంగా అడుగులు వేస్తున్నాయి.
అప్పుల తిప్పలు.. బ్రిక్స్ ఆశలు!
ఈ జాబితాలో ఇండోనేషియా ($1.54 ట్రిలియన్) వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు పూర్తి సభ్యులుగా మారుతుంటే, పాకిస్థాన్ ($410 బిలియన్), శ్రీలంక ($98 బిలియన్) వంటి దేశాలు మాత్రం దరఖాస్తు పట్టుకొని ధీనంగా ఎదురుచూస్తున్నాయి. పాకిస్థాన్ పరిస్థితి చూస్తుంటే.. ‘సభ్యత్వం ఇస్తే ఇయ్యండి కానీ, ముందు ఏవైనా లోన్లు ఉంటే చూడండి’ అని అడిగేలా ఉంది. అప్పుల ఊబిలో ఉన్న దేశాలన్నీ బ్రిక్స్‌ను ఒక 'ఏటీఎం'లా చూస్తుంటే, అసలు సభ్య దేశాలు మాత్రం దీన్ని ఒక 'పొలిటికల్ వెపన్' (రాజకీయ ఆయుధం)లా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇక సౌదీ అరేబియా లాంటి ధనిక దేశాలు కూడా చేరితే, బ్రిక్స్ దగ్గర ఆయిల్ కు, డబ్బుకు అస్సలు కొదవ ఉండదు.
భాగస్వామ్య దేశాల ‘వ్యూహాత్మక’ సందడి
నైజీరియా నుంచి వియత్నాం వరకు దాదాపు 10 దేశాలు భాగస్వామ్య హోదాలో ఉంటూ లోపలికి రావడానికి గేట్ల దగ్గర వేచి చూస్తున్నాయి. వియత్నాం ($527 బిలియన్), మలేషియా ($516 బిలియన్) వంటి ఆగ్నేయాసియా పులులు ఈ కూటమిలో చేరితే, ఇక ఆసియా ఖండం మొత్తం బ్రిక్స్ గుప్పిట్లోకి వెళ్లడం ఖాయం. ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాల జీ-7 (G7) గ్రూపును చూసి భయపడిన ప్రపంచం, ఇప్పుడు బ్రిక్స్ ప్లస్ (బ్రిక్స్+) వైపు ఆశగా చూస్తోంది. ఈ కూటమిలో డేటా లేని క్యూబా, సిరియా వంటి దేశాలు కూడా ఉన్నాయంటే, ఇక్కడ ఆర్థిక స్థితి కంటే 'అమెరికా వ్యతిరేకత' అనే గూడు పుఠాణీనే ఎక్కువగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
చిన్న దేశాల ‘పెద్ద’ కలలు
కేవలం $3.49 బిలియన్ల జీడీపీ ఉన్న సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ నుంచి, అంతర్యుద్ధాలతో అల్లాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ వరకు అందరూ ఈ జాబితాలో ఉన్నారు. వీరందరికీ బ్రిక్స్ లో చేరడం అంటే ఏదో మంత్రదండం దొరికినట్లే అన్నంత ఆశ ఉంది. చైనా ఇచ్చే పెట్టుబడులు, భారత్ ఇచ్చే సాంకేతికత తమ దేశాలను మార్చేస్తాయని వారు నమ్ముతున్నారు. అయితే, ఇంత మంది ఒకే గూటి కింద చేరితే.. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చుతాయా? లేక ఇది కేవలం ఫోటో షూట్లకే పరిమితం అవుతుందా? అన్నది భవిష్యత్తు తేల్చాలి.
మొత్తానికి, బ్రిక్స్ విస్తరణ చూస్తుంటే.. ‘డబ్బు ఉన్నవాడు, అప్పు ఉన్నవాడు, యుద్ధం చేస్తున్నవాడు.. అందరూ కలిశారు. ఇక డాలర్ గారే జాగ్రత్తగా ఉండాలి’ అనిపిస్తోంది. ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం ఈ కూటమి ఇలాగే పెరిగితే, ఇక ప్రపంచం ఢిల్లీ-బీజింగ్ చుట్టూ తిరగడం ఖాయం!
బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా ట్రెండ్‌ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో వ్యక్తిగత విషయాల కారణంగా వార్తల్లో నిలిచిన కరిష్మా కపూర్‌ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో వైరల్‌ అవుతూనే ఉంది. అయిదు పదుల వయసులోనూ కరిష్మా కపూర్‌ ఎంతో మంది హీరోయిన్స్‌ కంటే అందంగా ఉందంటూ ఆమె అభిమానులు కామెంట్‌ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ స్టార్‌ హీరోలకు జోడీగా హీరోయిన్‌గా నటించే సత్తా, అందం కరిష్మా కపూర్ కి ఉందని చాలా మంది భావిస్తూ ఉంటారు. నాలుగు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌లు దక్కించుకున్న ఈమెకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్రం పురస్కారం సైతం దక్కింది. ఒకానొక సమయంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా కూడా కరిష్మా కపూర్ రికార్డ్‌ సాధించింది.
కరిష్మా కపూర్‌ హీరోయిన్‌గా...
ప్రేమ్‌ ఖైదీ సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించిన కరిష్మా కపూర్ చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌లను దక్కించుకుంది. కెరీర్‌ ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ దశాబ్ద కాలం పాటు తన సినీ ప్రస్థానం కొనసాగించింది. 2004లో సినీ కెరీర్‌కి గుడ్‌ బై చెప్పినప్పటికీ అప్పుడప్పుడు టీవీల్లో కనిపించడం, సోషల్‌ మీడియాలో సందడి చేయడం, ఈమె నటించిన సినిమాలు ఎప్పటికప్పుడు టీవీల్లో ప్రసారం కావడం వల్ల కరిష్మా కపూర్ ఇంకా ఇండస్ట్రీలో ఉందనే అభిప్రాయం ఉంది. ఈ మధ్య కాలంలో మళ్లీ ఇండస్ట్రీలో ఈమె సందడి మొదలైంది. కొన్ని సినిమాలు ఈమె నటించడం ద్వారా పూర్తి స్థాయిలో సినిమాలు చేస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఈమె అరుదుగా మాత్రమే ఈమె సినిమాలు చేస్తూ వచ్చింది. అది కూడా గెస్ట్‌ రోల్స్ కావడంతో ఈమె మళ్లీ సినిమాలు చేయాలనే డిమాండ్‌ పెరుగుతోంది.
సమైరా కపూర్‌ హీరోయిన్‌గా...
కరిష్మా కపూర్‌కి సమైరా కపూర్‌ అనే కూతురు ఉంది. ఇద్దరూ అరుదుగా కలిసి కనిపిస్తారు. సోషల్‌ మీడియాలో వీరిద్దరి ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా ఒక కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. తల్లి కూతురు ఇద్దరూ చాలా అందంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అందానికి ఈ ఇద్దరూ అర్థం అన్నట్లుగా ఉన్నారని, 51 ఏళ్ల వయసులో కరిష్మా కపూర్ చాలా అందంగా ఉందని, 21 ఏళ్ల తన కూతురు సమైరా కపూర్‌ కి ఏమాత్రం తగ్గకుండా అందంగా ఉందని కరిష్మా కపూర్‌ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లి కూతురు కలిసి ఒక సినిమాలో నటించాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. నటిగా రీ ఎంట్రీకి కరిష్మా ఆసక్తిగా ఉందనే విషయం బాలీవుడ్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత రెండేళ్లుగా కొత్త సినిమాలు ఏమీ కమిట్‌ కాలేదు, కానీ మంచి కథతో వస్తే కరిష్మా మళ్లీ నటించేందుకు రెడీగా ఉందట.
సోషల్‌ మీడియాలో తల్లి కూతురు ఫోటోలు...
ఇక సమైరా కపూర్‌ విషయానికి వస్తే ఇంకా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే వయసు రాలేదని అంటున్నారు. కరిష్మా కపూర్‌ గతంలో ఒక ఇంటర్వ్యూలో తన కూతురు హీరోయిన్‌గా నటించాలంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పుకొచ్చింది. అయితే నటిగా తనకు ఇవ్వాల్సిన సూచనలు చేస్తానని మాత్రం చెప్పింది. సమైరా ఇప్పటికే ఒక షార్ట్‌ ఫిల్మ్‌ లో నటించి, తన ఫేస్‌ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. సోషల్‌ మీడియా ద్వారా అందమైన ఫోటోలతో సమైరా పరిచయం అయ్యింది. రాబోయే రెండు మూడు ఏళ్లలో సమైరా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఆమెను తమ సినిమాల్లో నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖ యంగ్‌ హీరోలు సైతం ఈమెతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. తల్లి దారిలో హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న సమైరా ఏమేరకు హిట్‌ అయ్యేనో చూడాలి.
“Caught between being your daydream and getting a sunburn myself ”
This serene desert photoshoot of Kavya Kalyanram in a vibrant traditional saree with a jasmine garland beautifully captures her natural elegance and expressive charm.
Kavya Kalyanram, born on July 20, 1998, in Hyderabad, is a talented Telugu actress who began her journey as a child artist in films like Snehamante Idera. She made her lead acting debut with the horror thriller Masooda (2022), where she played Mini and received critical acclaim.
She gained widespread popularity for her heartfelt performance as Sandhya in the critically acclaimed family drama Balagam (2023). Her other notable works include Ustaad (2023) and Swajan.
Kavya has an exciting lineup ahead with the comedy What's Up Naresh (2026) alongside the lead actor. With her strong acting skills, graceful screen presence, and ability to shine in both intense and light-hearted roles, she is steadily emerging as one of the promising young talents in Telugu cinema.
Photos Courtesy: Instagram
బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టిన ‘శంబాల’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. యంగ్ హీరో ఆది సాయికుమార్ షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మరో వినూత్నమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈసారి భయం, ఉత్కంఠకు తోడు అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఒక సరికొత్త హారర్ డ్రామాతో మనముందుకు వస్తున్నారు. తాజాగా విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆ వివరాలేంటో చూద్దాం..
మళ్లీ కలిసిన హిట్ టీమ్:
ఇక ‘శంబాల’ సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు ఇప్పుడు ఆదితో రెండో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇక యుగంధర్ ముని సమర్పణలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది. గత సినిమా ఇచ్చిన బూస్ట్‌తో, ఈసారి మరింత పకడ్బందీగా, విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి టీమ్ మొత్తం రెడీ అయిపోయింది.
పోస్టర్‌తోనే పుట్టించిన ఉత్కంఠ:
ఈ కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఆది సాయికుమార్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తుండగా.. రక్తం కారుతున్న తీరు, చుట్టూ ఉన్న పువ్వులు, పాతకాలం నాటి స్టాంప్ వంటి ఎలిమెంట్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. చూస్తుంటే ఈసారి ఆది మనల్ని ఏదో తెలియని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేలా కనిపిస్తున్నాడు.
భయం.. భక్తి.. ఎమోషన్స్:
ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం హారర్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయట. ఇక ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతున్నామని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. హారర్ ఎలిమెంట్స్‌ని సరికొత్త కోణంలో చూపించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశం.
మ్యూజిక్కే మెయిన్ అస్సెట్:
ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ముఖ్యం. అందుకే వినూత్నమైన మ్యూజిక్ అందించే శ్రీ చరణ్ పాకాలని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఇక ఆయన తన సరికొత్త సౌండ్ డిజైనింగ్‌తో సీటు అంచున కూర్చోబెట్టే బీజీఎం ఇవ్వబోతున్నారట. నిశ్శబ్దంలో కూడా భయాన్ని కలిగించేలా మ్యూజిక్ ఉండబోతోందని మేకర్స్ హింట్ ఇచ్చారు.
ఇక గత ఏడాది వచ్చిన శంబాల మంచి సక్సెస్ అందుకొని ఆదిని మరో మెట్టు ఎక్కించింది. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆది సాయికుమార్‌కు ‘శంబాల’ తర్వాత ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం కానుంది. కొత్త దర్శకుడు అనుభవం ఉన్న టెక్నీషియన్లతో వస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ రానున్నాయి. ఆల్ ది బెస్ట్ ఆది..
This striking photograph of Divi Vadthya showcases her bold confidence and athletic glamour as she poses poolside in a red bikini and floral sarong.
Divi Vadthya (also known as Divya Vadthya), born on March 15, 1996, in Hyderabad, is a popular Indian actress and model primarily working in Telugu cinema. She started with modelling and made her acting debut in the short film Let's Go (2018). She gained early recognition with a small role in Mahesh Babu’s Maharshi (2019).
She has appeared in notable films including A1 Express, Godfather, Pushpa: The Rise, Rudrangi, Lambasingi, and Daaku Maharaaj (2025). She also participated in Bigg Boss Telugu Season 4.
Her upcoming projects include the psychological horror thriller Honey (February 2026) alongside Naveen Chandra, Napoleon Returns (May 2026), Draupathi 2, and other exciting Telugu films like Karmastalam. With her fit physique, expressive acting, and strong screen presence, Divi Vadthya is steadily rising as a versatile supporting and lead actress in Tollywood.
Photos Courtesy: Instagram
This captivating photograph of Natasha Bharadwaj in a white bikini, posing gracefully in the pool with golden hour lighting, perfectly highlights her confidence, poise, and stunning screen presence.
Born on September 17, 1997, in Mumbai, Natasha Bharadwaj is a talented Indian actress and former beauty pageant contestant (Miss Diva 2016 finalist and Miss Talented winner). She made her acting debut with the web series Pawan & Pooja (2020). She rose to prominence with her powerful performance as Dr. Diya Parekh in the acclaimed medical drama series Mumbai Diaries 26/11 (2021).
She has also appeared in Ishq Next Door (2023) and several music videos. Natasha is now stepping into Bollywood with her much-awaited film debut in O'Romeo (2026), directed by Vishal Bhardwaj, where she plays Nargis opposite Shahid Kapoor. With her blend of classical dance background, striking beauty, and strong acting potential, Natasha Bharadwaj is poised for a bright future in Indian entertainment.
Photos Courtesy: Instagram
మన ఊర్లో పెళ్లి అంటే పది ఊర్లకి తెలియాలి.. కానీ అమెరికాలో మన పెళ్లి అంటే పక్క వీధిలో ఉండే అమెరికన్‌కి 'హార్ట్ ఎటాక్' రావాలి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. డల్లాస్ శివారు ప్రాంతాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత కూడా మోగుతున్న మన డీజేల దెబ్బకు.. స్థానిక రాంచ్ నివాసితులు ఇప్పుడు తమ పశువుల కంటే ఎక్కువగా భారతీయుల 'బారాత్'లకే భయపడిపోతున్నారు.
అక్కడక్కడ గుర్రాల మీద పెళ్లికొడుకు ఊరేగింపులు చూసి మురిసిపోయిన అమెరికన్లు, ఇప్పుడు రాత్రి 11 గంటల తర్వాత వినబడుతున్న "బుల్లెట్టు బండి" పాటల హోరుకు.. తమ కౌబాయ్ హ్యాట్లను పక్కన పడేసి పోలీసులకు ఫోన్లు చేస్తున్నారు. "సంప్రదాయం" పేరుతో స్పీకర్లను చించివేస్తున్న మన ఉత్సాహం చూస్తుంటే త్వరలో డల్లాస్ వీధుల్లో పోలీసులు 'నాటు నాటు' స్టెప్పులకు బదులు 'లాఠీ చార్జ్' స్టెప్పులు వేయించేలా ఉన్నారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఆనందం హద్దులు దాటి పొరుగువారి బెడ్ రూమ్ కిటికీలను వణికిస్తుంటే అది సంస్కృతి అనిపించుకుంటుందో లేక 'ధ్వని కాలుష్యం' అనిపించుకుంటుందో నిర్వాహకులే ఆలోచించుకోవాలి!
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం.. ముఖ్యంగా డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్ ప్రాంతం గత దశాబ్ద కాలంలో భారతీయ అమెరికన్లకు ప్రధాన నిలయంగా మారింది. ఇక్కడి భారతీయ సమాజం ఆర్థికంగా సామాజికంగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. అయితే అదే స్థాయిలో పెరుగుతున్న భారతీయ వివాహాలు, ప్రైవేట్ వేడుకలు ప్రస్తుతం స్థానిక నివాసితులకు, ప్రత్యేకించి అమెరికన్ రాంచ్ కమ్యూనిటీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో డల్లాస్ శివారు ప్రాంతాల్లో జరుగుతున్న వేడుకలపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
అసలు సమస్య ఏమిటి?
డల్లాస్ పరిసరాల్లోని వివాహ వేదికలు, ఫామ్ హౌస్‌లు, రాంచ్‌లలో నిర్వహించే వివాహ వేడుకలు భారతీయ సంప్రదాయం ప్రకారం ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఆనందం పరిధి దాటి ఇతరులకు ఇబ్బందిగా మారుతోందని విమర్శలు వస్తున్నాయి. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కూడా భారీ శబ్దంతో కూడిన డీజే సంగీతం వినిపించడం స్థానికులను ఆగ్రహానికి గురి చేస్తోంది. నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా అరుపులు, బాణసంచా కాల్చడం వల్ల ప్రశాంతంగా ఉండాలనుకునే రాంచ్ నివాసితులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పరిమితికి మించి అతిథులు రావడం, రోడ్ల పక్కన అస్తవ్యస్తంగా వాహనాలు నిలపడం వల్ల స్థానిక రవాణాకు ఆటంకం ఏర్పడుతోంది.
చట్టపరమైన చిక్కులు.. పెరుగుతున్న ఆందోళన
ఈ వ్యవహారంపై ఇప్పటికే కొన్ని కౌంటీల్లో నివాసితులు.. రాంచ్ ఓనర్స్ అసోసియేషన్లు ఏకమవుతున్నాయి. స్థానిక పోలీసులకు, సిటీ కౌన్సిల్ అధికారులకు అధికారికంగా ఫిర్యాదులు చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు. అమెరికాలోని చట్టాల ప్రకారం 'నాయిస్ ఆర్డినెన్స్' నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే వేదిక యజమానులతో పాటు ఈవెంట్ నిర్వాహకులపై కూడా భారీగా ఫైన్లు పడే అవకాశం ఉంది. నిరంతరం ఫిర్యాదులు అందే ఈవెంట్ సెంటర్ల లైసెన్స్‌లను అధికారులు రద్దు చేసే ప్రమాదం ఉంది. వేడుక మధ్యలోనే పోలీసులు వచ్చి సంగీతాన్ని నిలిపివేయడం వల్ల శుభకార్యాల్లో అపశ్రుతి చోటు చేసుకునే అవకాశం ఉంది.
భారతీయ సమాజ ప్రతిష్టపై ప్రభావం
డల్లాస్‌లో భారతీయులు అత్యంత విద్యావంతులుగా సంస్కారవంతులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ కొందరి బాధ్యతారాహిత్యం వల్ల మొత్తం భారతీయ కమ్యూనిటీపై ప్రతికూల ముద్ర పడే ప్రమాదం ఉందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "మన సంస్కృతిని, వేడుకలను ప్రదర్శించుకోవడం తప్పు కాదు.. కానీ అది పొరుగువారి శాంతిని హరించకూడదు" అని స్థానిక తెలుగు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
నిర్వాహకులకు సూచనలు
భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే భారతీయ సమాజ పెద్దలు, ఈవెంట్ ప్లానర్లు కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. రాత్రి 10 లేదా 11 గంటల తర్వాత సంగీతాన్ని పూర్తిగా నిలిపివేయడం లేదా ఇండోర్ మాత్రమే పరిమితం చేయడం ఉత్తమం. వేడుక జరిగే ప్రాంతంలోని పొరుగువారికి ముందుగానే సమాచారం ఇచ్చి వారికి ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇవ్వడం మంచి పద్ధతి. వెన్యూ యజమానులు విధించే షరతులను అతిథులు కూడా పాటించేలా నిర్వాహకులు పర్యవేక్షించాలి. పార్కింగ్ , బాణసంచా విషయంలో స్థానిక నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి.
సెలబ్రేషన్స్ అనేవి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోవాలి తప్ప ఇతరులకు చేదు అనుభవాలను మిగల్చకూడదు. అమెరికా వంటి దేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు పొరుగువారి ప్రశాంతతకు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి డల్లాస్ భారతీయులు తమ సంప్రదాయాలను గౌరవిస్తూనే స్థానిక చట్టాలను, ప్రజల ప్రశాంతతను గౌరవించి 'సభ్య సమాజానికి' ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దక్షిణాది వెండితెర రాణి త్రిష కృష్ణన్ ఏం చేసినా ఒక ట్రెండ్ సెట్టే. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష మెరిసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె కట్టుకున్న నీలి రంగు పట్టుచీర, ఆ డిజైనర్ బ్లౌజ్ కోసం ఇప్పుడు మహిళలంతా షాపింగ్ మాల్స్, బోటిక్స్‌కు క్యూ కడుతున్నారు. త్రిష అందం, ఆమె స్టైల్ వెనుక ఉన్న ఆ క్రేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఆకట్టుకున్న 'అక్వా బ్లూ' పట్టుచీర:
చెన్నైలో జరిగిన విజయ్ ప్రమాణస్వీకారం ఈవెంట్‌లో త్రిష ధరించిన టర్కోయిస్-బ్లూ కంచి పట్టుచీర అందరి కళ్లను తిప్పుకోనివ్వలేదు. బంగారు రంగు జరీ బోర్డర్, క్లాసిక్ డిజైన్‌తో ఉన్న ఆ చీరలో ఆమె ఎంతో హుందాగా కనిపించింది.ఇక దీనికి తోడు క్రీమ్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఆమె లుక్‌ని మరింత గ్రాండ్‌గా మార్చేసింది. ఇప్పుడు సామాన్య మహిళల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అలాంటి చీర కోసమే వెతుకుతున్నారు.
బోటిక్స్‌లో త్రిష బ్లౌజ్ హంగామా:
చీర ఎలాగోలా దొరుకుతుంది కానీ, ఆ బ్లౌజ్ డిజైన్ దొరకడమే కష్టమని లేడీస్ ఫీలవుతున్నారు. అందుకే త్రిష ఫోటోలను టైలర్లకు, బోటిక్ యజమానులకు చూపిస్తూ "నాకు సేమ్ ఇలాంటి వర్క్ కావాలి" అని ఆర్డర్లు ఇస్తున్నారు. ఇప్పుడు దీంతో సిటీలోని ఫేమస్ బోటిక్స్,టైలర్ షాప్స్ అన్నీ త్రిష స్టైల్ బ్లౌజ్ డిజైన్లతో కళకళలాడుతున్నాయి. ఇక 'నైరమ్ స్టూడియో' డిజైన్ చేసిన ఆ బ్లౌజ్ ఇప్పుడు ఒక హాట్ ట్రెండ్ అయిపోయింది.
మెరిసిన డైమండ్ జువెలరీ:
కేవలం బట్టలు మాత్రమే కాదు, త్రిష ధరించిన ఆభరణాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ జువెలర్స్ నుంచి వచ్చిన డైమండ్ చోకర్, అందులో మెరుస్తున్న కెంపు రాయి ఆమె ముఖానికి మరింత నిండుదనాన్ని ఇచ్చింది. తలలో మల్లెపూలు పెట్టుకుని పక్కా సౌత్ ఇండియన్ స్టైల్‌లో ఆమె సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేస్తూ "ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వినిపిస్తుంది" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
రెండు దశాబ్దాల క్రేజ్.. తగ్గని జోరు:
1999లో మిస్ చెన్నైగా ప్రయాణం మొదలుపెట్టిన త్రిష, ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతుండటం విశేషం. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా నుంచి మొన్నటి పొన్నియిన్ సెల్వన్, లియో వరకు ఆమె మేజిక్ అలాగే ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర', సూర్యతో 'కరుపు' వంటి భారీ ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీగా ఉంది. సినిమాల్లోనే కాదు, ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ఆమె 'క్వీన్' అని మరోసారి రుజువైంది.
స్టైల్ అంటే కేవలం ఆధునిక దుస్తులు ధరించడం మాత్రమే కాదు, సాంప్రదాయ పట్టుచీరలో కూడా ఎంత అందంగా ఉండవచ్చో త్రిష నిరూపించింది. అందుకే ఆమెను అభిమానులు 'ఎవర్ గ్రీన్ బ్యూటీ' అని పిలుచుకుంటారు.
ఒకప్పుడు హీరోలు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని.. ఆ తర్వాత యూటర్న్ లో భాగంగా విలన్ గా ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఎప్పుడూ చిలిపి పాత్రలు, గ్లామరస్ రోల్స్‌తో అలరించే ఈ భామ, ఇప్పుడు ఏకంగా రామాయణంలో 'శూర్పణఖ'గా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతోంది. నితేష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రంలో రకుల్ చేస్తున్న ఈ ప్రయోగం చూస్తుంటే, ఆమె మరో రమ్యకృష్ణలా పవర్‌ఫుల్ విలనిజం పండించబోతోందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ విశేషాలు మీకోసం..
రామాయణంలో రకుల్ 'నెగటివ్' షాక్:
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ 'రామాయణ'లో రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఖరారైందనే వార్త ఫిల్మ్ నగర్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సినిమాలో రావణాసురుడి సోదరి శూర్పణఖ పాత్రను రకుల్ పోషించబోతుందట. ఎప్పుడూ కమర్షియల్ సినిమాల్లో మెరిసే రకుల్, కథను మలుపు తిప్పే ఇలాంటి క్లిష్టమైన పాత్రను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రమ్యకృష్ణ బాటలో రకుల్ ప్రయోగం:
గతంలో రమ్యకృష్ణ వంటి వారు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలు చేసి తమ నట విశ్వరూపాన్ని చూపించారు. ఇప్పుడు రకుల్ కూడా అదే బాటలో నడుస్తోంది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటనకు ఆస్కారమున్న నెగటివ్ షేడ్స్ కూడా చేయగలనని ఆమె నిరూపించుకోవాలని చూస్తోంది. ఈ పాత్ర కనుక క్లిక్ అయితే, రకుల్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోవడం ఖాయం.
స్టార్ క్యాస్టింగ్ మధ్య శూర్పణఖ:
ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా కనిపించబోతుండగా, ఆయనకు సోదరిగా రకుల్ తన పెర్ఫార్మెన్స్‌తో పోటీ పడనుంది. ఇక యష్, రకుల్ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంటుందోనని అభిమానులు ఇప్పటి నుంచే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ ఆశలన్నీ ఆ పాత్రపైనే:
శూర్పణఖ పాత్ర రామాయణంలో చాలా కీలకమైనది. ఒకరకంగా కథలో ఘర్షణ మొదలయ్యేది ఆమెతోనే. ఈ పాత్రలో రకుల్ సక్సెస్ అయితే, భవిష్యత్తులో ఆమె కోసం మరిన్ని వైవిధ్యమైన, నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు క్యూ కట్టడం గ్యారెంటీ. కేవలం అందంతోనే కాదు, తనలోని నటనతోనూ ఆడియన్స్‌ను భయపెట్టేందుకు రకుల్ సిద్ధమవుతోంది.
స్టార్ హీరోయిన్ స్థాయి నుంచి గ్రే షేడ్ పాత్రకు యూటర్న్ తీసుకోవడం రకుల్ చేస్తున్న పెద్ద రిస్క్ అనే చెప్పాలి. కానీ, ఇలాంటి రిస్క్ తీసుకుంటేనే నటిగా గుర్తింపు వస్తుంది. మరి రామాయణంలో శూర్పణఖగా రకుల్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
ఎంతో అనుభవం ఉన్న నాయకుడిలా సభను నడుపుతున్నారు తమిళనాడు సీఎం విజయ్. సభలో ఛలోక్తులు, సభ్యులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తూనే చిన్న చిన్న కథలను కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగా ‘స్పీకర్ కథ’ ఒక చెప్పి సభలో నవ్వులు పూయించారు. స్పీకర్ పదవి అంటే అది పరమాన్నం కాదు, పక్కాగా 'ప్రమాదం' అనిపిస్తోంది. అసెంబ్లీలో అందరినీ కంట్రోల్ చేస్తూ, గంభీరంగా కనిపించే స్పీకర్ పదవి వెనుక ఇంతటి 'భయంకరమైన' హిస్టరీ ఉందా అని విన్నవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మన నాయకులు ఒక చిన్న పదవి కోసం కొట్టుకు చస్తుంటే, ఒకప్పుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టడానికి మనుషులను బలవంతంగా ఈడ్చుకొచ్చేవారట! విజయ్ ఈ కథను మరీ అంత డీటైల్డ్‌గా ఎందుకు చెప్పారో కానీ, ప్రస్తుతం ఉన్న స్పీకర్లకు మాత్రం ఇది వింటుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
ఇంగ్లాండ్ పార్లమెంట్..
ఈ వింత ఆచారం ఇంగ్లాండ్ పార్లమెంట్ నుంచి పుట్టిందని విజయ్ వివరించారు. రాజుల కాలంలో పార్లమెంట్ తీసుకునే నిర్ణయాలను వెళ్లి రాజుకు చెప్పడం అంటే.. సింహం నోట్లో తల పెట్టడమేనట. ఒకవేళ పార్లమెంట్ నిర్ణయం రాజుకు నచ్చకుంటే ఆ వార్తను పట్టుకొచ్చిన స్పీకర్‌కు 'మరణశిక్షే'! ‘చెప్పేవాడికి బుద్ధి ఉండాలి.. వార్త మోసుకొచ్చిన వాడికి చావు ఉండాలి’ అనే టైపులో రాజులు ఉండేవారట. ఈ భయంతోనే స్పీకర్ పదవి అంటే అప్పట్లో అందరూ ఆమడ దూరం పారిపోయేవారు.
బలవంతంగా కూర్చోబెట్టడమే!
స్పీకర్ పదవి ఇస్తామన్నా ఎవరూ ముందుకు రాకపోవడంతో, బ్రిటీష్ పార్లమెంట్ ఒక వింత పద్ధతికి తెర లేపింది. స్పీకర్‌గా ఒకరిని ఎన్నుకున్నాక, ఆయన ‘నాకొద్దు బాబోయ్’ అని మొత్తుకున్నా సరే.. ఇద్దరు సభ్యులు వెళ్లి ఆయన చేతులు పట్టుకొని, బలవంతంగా ఈడ్చుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టేవారు. అందుకే నేటికీ స్పీకర్‌గా ఎన్నికైన వారిని ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కలిసి గౌరవంగా కుర్చీ వరకు తీసుకెళ్తుంటారు. కానీ, ఆ గౌరవం వెనుక ఉన్న అసలు కారణం.. ఆ రోజుల్లో దాన్ని ఒక 'బలిపీఠం'లా చూడడమేనని విజయ్ సెలవిచ్చారు.
విజయ్ చెప్పిన ఈ కథ వింటుంటే.. ‘నాటి స్పీకర్లకు ప్రాణ భయం ఉంటే, నేటి స్పీకర్లకు మైకుల భయం, పేపర్ల భయం ఉంది’ అనిపిస్తోంది. రాజులు లేకపోయినా, అసెంబ్లీలో ప్రతిపక్షాల గొడవలు రాజుగారి కోపం కంటే తక్కువేమీ కాదు! స్పీకర్ కుర్చీలో కూర్చోవడం అంటే అందరి తిట్లు భరించడమే అని విజయ్ హింట్ ఇస్తున్నారో ఏమో కానీ, ఈ హిస్టరీ పాఠం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘పదవి కోసం పాకులాడే నాయకులు ఈ కథ వింటే.. అప్పుడు స్పీకర్ పదవికి ఇంటర్వ్యూలు కూడా రావు’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
విజయ్ మార్క్ ‘సినిమాటిక్’ హిస్టరీ!
ముఖ్యమంత్రి విజయ్ ఏదైనా చెబితే అది పక్కాగా సినిమా సీన్ లాగే ఉంటుంది. స్పీకర్ పదవి గురించి ఆయన ఇచ్చిన ఈ వివరణ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో కానీ.. ఆ కుర్చీలో కూర్చోబెట్టేటప్పుడు జరిగే ‘బలవంతంగా పీఠంపై కూర్చోబెట్టడం’ వెనుక ఉన్న వేదనను మాత్రం అద్భుతంగా ఆవిష్కరించారు. పదవి అంటే హోదా మాత్రమే కాదు, అది ఒక 'బాధ్యతాయుతమైన ప్రమాదం' అని విజయ్ తనదైన శైలిలో తేల్చేశారు. మొత్తానికి విజయ్ చెప్పిన ఈ కథ విన్నాక.. ‘పదవి వద్దు బాబోయ్.. ప్రాణం ఉంటే చాలు’ అనుకున్న నాటి స్పీకర్ల ధైర్యానికి (లేదా భయానికి) జోహార్లు అర్పించాల్సిందే!
స్పీకర్ పదవిపై సీఎం విజయ్ చెప్పిన కథ.
స్పీకర్ పదవి సంప్రదాయం UK Parliament నుంచి వచ్చిందని తమిళనాడు సీఎం విజయ్ తెలిపారు.
పూర్వం రాజుల కాలంలో పార్లమెంట్ నిర్ణయాలను రాజుకు చెప్పడం ప్రమాదకరంగా ఉండేదని, రాజుకు నచ్చకపోతే శిక్ష పడే అవకాశం ఉండేదని చెప్పారు. అందుకే ఆ బాధ్యతను… pic.twitter.com/vb498fxvFZ
— Tupaki (@tupaki_official)
May 12, 2026
చమురు సంక్షోభం నుంచి బయటపడటానికి కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలను వేడుకుంటున్న ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ వినియోగంపైనా దృష్టి పెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సబ్సిడీని సంపన్న వర్గాల వారికి పూర్తిగా ఎత్తివేసే ఆలోచన చేస్తోందని తాజాగా ప్రచారం జరుగుతోంది. వార్షిక ఆదాయం పది లక్షలు దాటిన వారికి ఇకపై గ్యాస్ సబ్సిడీ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.పది లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ఆన్ లైన్ లో మెసేజులు పంపుతోంది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే ఆటోమెటిక్ గా సబ్సిడీ రద్దు అవుతుందని ఆ మెసేజుల్లో ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ప్రస్తుతం ఆదాయానికి సంబంధం లేకుండా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ అందజేస్తున్నారు. అయితే ప్రభుత్వ సబ్సిడీ పేదలు, అట్టడుగు వర్గాల వారికే పరిమితం చేయాలని, ఆదాయం ఎక్కువగా ఉన్నవారికి సబ్సిడీలు ఇవ్వడంలో అర్థం లేదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సంపన్న వర్గాల వారి వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి సేకరించి గ్యాస్ సరఫరా కంపెనీలకు అందజేసినట్లు చెబుతున్నారు. రూ.10 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారి వివరాలను దగ్గరపెట్టుకుని వారి ఫోన్లకు గ్యాస్ సబ్సిడీ రద్దుపై సమాచారం పంపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాతృభూమి పథకంలో భాగంగా సంపన్న వర్గాలకు గ్యాస్ సబ్సిడీ రద్దు చేస్తున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. ఆదాయ పన్ను రికార్డులను పరిశీలించి తమ వినియోగదారులకు కంపెనీలు నోటీసులు పంపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వేలమందికి ఈ తరహా మెసేజులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా మెసేజ్ అందుకున్న వారు వారం రోజుల్లోగా ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సివుంటుందని చెబుతున్నారు. లేదంటే గ్యాస్ సబ్సిడీని శాశ్వతంగా కోల్పోతారని గ్యాస్ సరఫరా కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.
నిజానికి ఈ నిబంధన 2015లోనే తీసుకువచ్చారని అంటున్నారు. అయితే అప్పట్లో సెల్ఫ్-డిక్లరేషన్ ఇస్తే సరిపోయేదని, కానీ ఇప్పుడు నేరుగా ఆదాయపు పన్ను వివరాలతో పోల్చిచూస్తుండటం వల్ల ఏ ఒక్కరూ తప్పించుకోలేరని వ్యాఖ్యానిస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, ఉజ్వల పథకం కింద గ్యాస్ పొందిన వారికి మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెబుతున్నారు. నిజమైన పేదలకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనం దక్కాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
కఠినమైన వెరిఫికేషన్ ప్రక్రియతో గ్యాస్ కంపెనీలు వినియోగారులకు మెసేజులు పంపుతున్నాయని అంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఇటువంటి మెసేజు పొరపాటున వచ్చిందనో, సైబర్ క్రిమినల్స్ పంపుతున్న మెసేజులు అనో భావిస్తే, క్రాస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. గ్యాస్ సబ్సిడీపై ఏమైనా సందేహాలు ఉంటే టోల్-ఫ్రీ హెల్ప్ లైన్ నెంబరు 1800-2333- 555కి ఫోన్ చేయడమో లేక గ్యాస్ కంపెనీల వెబ్ సైటులో గ్రీవెన్స్ పోర్టల్ లో ఫిర్యాదు చేయొచ్చని సూచిస్తున్నారు. అదే సమయంలో గ్యాస్ డెలవరీ నిబంధనలను సైతం కఠినతరం చేసినట్లు కంపెనీలు ప్రకటించాయి. ఇకపై డెలవరీ అథెంటికేషన్ కోడ్ సిస్టమ్ ను తప్పనిసరి చేశాయి. డెలవరీ చేయడానికి వచ్చిన వ్యక్తికి కస్టమర్లు తమ గ్యాస్ ధృవీకరణ కోడ్ కచ్చితంగా చెప్పాలని స్పష్టం చేశాయి.
భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, భార్య అలిగి పుట్టింటికి వెళ్లడం మన సినిమాల్లోనూ, గల్లీల్లోనూ చూస్తూనే ఉంటాం. అయితే, ఇలా పుట్టింటికి వెళ్లడాన్ని సాకుగా చూపి ‘నా భార్య నన్ను వదిలేసింది.. నాకు విడాకులు ఇచ్చేయండి’ అని కోర్టుల చుట్టూ తిరిగే భర్తలకు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ‘పిల్లలు పుట్టిన తర్వాత భార్య తన తల్లిదండ్రుల దగ్గర ఉండడం నేరం కాదు.. అది మిమ్మల్ని వదిలేసినట్టు కూడా కాదు’ అని చెప్పింది. భార్యా, భర్తల మధ్య జరిగిన గొడవలో వెలువడిన ఈ తీర్పు, విడాకుల కోసం ‘షార్ట్‌కట్’ వెతికే భర్తల ఆశలపై నీళ్లు చల్లింది. పెళ్లిలో ‘నీ కోసం ఏమైనా చేస్తా’ అన్న భర్త, తీరా పెళ్లయ్యాక భార్య పుట్టింటికి వెళ్తే దాన్ని ‘కుట్ర’గా చూడడంపై కోర్టు చురకలు అంటించింది.
విడాకుల పంతంతో పాండి!
ఈ కేసులో భర్త వాదన చాలా విచిత్రంగా ఉంది. తన భార్య గర్భంతో పుట్టింటికి వెళ్లి అక్కడే ఉండిపోయిందని, తన బాధ్యతలను విస్మరించిందని, కాబట్టి ఇది 'డెసర్షన్' (Desertion) కిందకు వస్తుందని ఆయన కోర్టులో వాదించారు. అంటే, భార్య పుట్టింటికి వెళ్లిందంటే భర్తను శాశ్వతంగా వదిలేసినట్టే అన్నమాట! ఈయన లాజిక్ ప్రకారం చూస్తే, డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లే ప్రతి భార్య విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్టే. భార్యను తన ఇంటికి రప్పించుకోవడానికి ప్రయత్నించడం మానేసి, నేరుగా విడాకుల కోసం కోర్టుకు రావడం ముత్తుపాండి 'అత్యుత్సాహాన్ని' చూపిస్తోంది.
పుట్టిల్లు పరాయి ఇల్లు కాదు! కోర్టు క్లాస్
ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు అద్భుతమైన పాయింట్ లేవనెత్తింది. ఒక మహిళ బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చినప్పుడు.. జన్మనిచ్చిన తర్వాత శారీరకంగా, మానసికమైన మద్దతు కోసం తన తల్లిదండ్రులపై ఆధారపడడం సహజమని స్పష్టం చేసింది. దీన్ని ‘భర్తను వదిలేయడం’ అని పిలవడం మూర్ఖత్వమే అవుతుందని అభిప్రాయపడింది. భార్య పుట్టింట్లో ఉండడం అనేది ‘తాత్కాలికమైన ఏర్పాటు’ మాత్రమే తప్ప, అది భర్తతో బంధాన్ని తెంచుకోవడం కాదని జడ్జి క్లాస్ పీకారు. ‘భార్యను జాగ్రత్తగా చూసుకోవడం చేతకాక, ఆమె తన పుట్టింటికి వెళ్తే దాన్ని వంకగా పెట్టుకుని విడాకులు అడగటం ఏంటి?’ అని కోర్టు వేసిన ప్రశ్నలకు ముత్తుపాండి వద్ద సమాధానం లేదు.
బెడిసికొట్టిన స్కెచ్!
చాలా మంది భర్తలు విడాకులు పొందడానికి ‘క్రూరత్వం’ లేదా ‘వదిలి వెళ్లిపోవడం’ అనే కారణాలను వాడుకుంటారు. ఈ కేసులో భర్త కూడా భార్య తనను కావాలనే ఇబ్బంది పెడుతోందని, పుట్టింటికి వెళ్లి తన వైవాహిక జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. కానీ కోర్టు మాత్రం.. ‘ఆమె పుట్టింటికి వెళ్లడానికి బలమైన కారణాలున్నాయి, అక్కడ ఉండడం వల్ల భర్తకు ఆమెపై ఉన్న హక్కులు ఏమీ పోవు’ అని తేల్చింది. అంటే, భార్య పుట్టింటికి వెళ్లడం అనేది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ, ఆరోగ్యానికి సంబంధించిన విషయం తప్ప, అది విడాకులకు గ్రౌండ్ కాదని పేర్కొంది.
భర్తలకు ఒక హెచ్చరిక..
ఈ తీర్పు చూసిన తర్వాత చాలా మంది భర్తల్లో ఒక రకమైన నిరుత్సాహం నెలకొనవచ్చు. ‘ఇంటికి రాకపోతే విడాకులు ఇచ్చేస్తా’ అని బెదిరించే కాలం పోయింది. భార్య తన పుట్టింటి వద్ద ఉండడం వల్ల భర్తకు కలిగే ‘ఇగో’ సమస్యలకు కోర్టులు మందు వేయవు. సామాజిక బాధ్యతలను, కుటుంబ బంధాలను విస్మరించి కేవలం సాంకేతిక కారణాలతో విడాకులు పొందాలనుకుంటే, మద్రాస్ హైకోర్టు లాంటి తీర్పులే ఎదురవుతాయి. ఒక వ్యక్తి స్కెచ్ లో ఉన్న లొసుగును కోర్టు ఎండగట్టడం ద్వారా, సదరు భార్య లాంటి ఎంతో మంది మహిళలకు ఒక రక్షణ కవచం దొరికినట్లయింది.
మొత్తానికి, కోర్టు ‘ఫ్యామిలీ లైఫ్’ మీద ఒక లాంగ్ క్లాస్ తీసుకుంది. పుట్టింటికి వెళ్లిన భార్యను ప్రేమతో తెచ్చుకోవాలి కానీ, లీగల్ నోటీసులతో కాదని ఈ తీర్పు మరోసారి గుర్తు చేసింది!
This warm and elegant photograph of Nyra Banerjee captures her graceful smile and timeless beauty beautifully.
Nyra Banerjee (born Nyrraa M Banerji on May 14, 1987) is a talented Indian actress and model who has worked across Hindi, Telugu, Tamil, Malayalam, and Kannada cinema. She began her career with modelling and television appearances before making her feature film debut in the Telugu movie Aa Okkadu (2009).
She made her Bollywood debut with Kamaal Dhamaal Malamaal (2012) and gained attention with films like One Night Stand (2016), Temper (2015), Aambala (2015), Tiger (2017), and Barun Rai and the House on the Cliff (2021). She has also appeared in several web series and reality shows.
Her recent and ongoing projects include the Netflix series Khakee: The Bengal Chapter (2025–2026) and the pan-India comedy film One Two Cha Cha Chaa (2026) alongside Ashutosh Rana.
With her expressive acting, striking screen presence, and pan-Indian appeal, Nyra Banerjee continues to balance mainstream cinema and digital content with grace.
Photos Courtesy: Instagram
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరగాల్సింది పోయి, ఒక రకమైన ఆందోళన మొదలైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ జూన్ 4న థియేటర్లలోకి రావాల్సి ఉంది. సరిగ్గా మూడు వారాల సమయం కూడా లేని ఈ తరుణంలో, సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ అనుసరిస్తున్న తీరుపై ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే 'గేమ్ చేంజర్' టైమ్ లో జరిగిన పొరపాట్లకు అప్సెట్ అయిన ఫ్యాన్స్, ఇప్పుడు ‘పెద్ది’ విషయంలో కూడా అదే ఆలస్యం ఎదురవుతుండటంతో ఏమాత్రం సహించడం లేదు. ప్రమోషన్ల జాప్యంపై సోషల్ మీడియాలో ఒక అభిమాని రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ లేఖలో సదరు అభిమాని తన ఆవేదనను చాలా తీవ్రంగా వ్యక్తం చేశారు. ప్రమోషన్ షెడ్యూల్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోతానంటూ ఎమోషనల్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.
సినిమాపై ఉన్న ప్రేమ, అప్‌డేట్స్ కోసం పడుతున్న తపన ఏ స్థాయికి చేరుకుందో ఈ లేఖను చూస్తే అర్థమవుతోంది. మేకర్స్ చూపిస్తున్న నిర్లక్ష్యం తమకు మానసిక వేదనగా మారుతోందని, వెంటనే ప్రమోషన్ ప్లాన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఒక భారీ సినిమాకు ఉండాల్సిన హైప్ క్రియేట్ చేయడంలో మొదటి రోజు నుంచీ పక్కా ప్లానింగ్ ఉండాలి. ముఖ్యంగా రామ్ చరణ్ వంటి స్టార్ హీరో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయాలని ఫ్యాన్స్ ఆశిస్తారు.
కానీ టీమ్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో, ఆ ప్రభావం సినిమా ఓపెనింగ్స్ మీద పడుతుందేమోనని వారు భయపడుతున్నారు. ఒకవైపు ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్‌లో ఈవెంట్ వంటి వార్తలు చక్కర్లు కొడుతున్నా, వాటికి సంబంధించి అధికారికంగా ఏ ఒక్క ప్రకటన రాకపోవడం అభిమానుల ఆవేశాన్ని రెట్టింపు చేస్తోంది. మేకర్స్ అనుసరిస్తున్న ఈ నిశ్శబ్దం ఫ్యాన్స్‌కు పెద్ద టార్చర్‌లా అనిపిస్తోంది.
ప్రతి సినిమాకు అభిమానులే అసలైన ప్రమోషన్ పిల్లర్స్. చిన్న పోస్టర్స్ వచ్చినా సోషల్ మీడియాలో బజ్ పెంచుతుంటారు. కానీ ఈ సారి ఆలస్యం వలన ఆ ఆవేశం ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునే స్థాయికి వెళ్లడం మాత్రం మంచి విషయం కాదు. ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే టీమ్ వర్క్ ఎంత ముఖ్యమో, అభిమానులను ఉత్సాహపరిచే ప్రమోషన్లు కూడా అంతే ముఖ్యం. ‘పెద్ది’ టీమ్ ఇకనైనా స్పందించి, అభిమానుల మనోభావాలను గౌరవిస్తూ ఒక పక్కా ప్రమోషన్ షెడ్యూల్ ఇస్తే ఈ గందరగోళానికి చెక్ పడుతుంది.
ఇక ‘పెద్ది’ మేకర్స్ ఈ అభిమానుల ఆవేశాన్ని అర్థం చేసుకుంటారా లేదా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. మే 18న ట్రైలర్ లాంచ్ ఉంటుందని ప్రచారం జరుగుతున్నా, దానికి తగ్గ సౌండ్ లేదు. ఇప్పటికైనా రామ్ చరణ్ స్వయంగా జోక్యం చేసుకుని, తన కోసం ప్రాణాలైనా ఇస్తామంటున్న అభిమానుల్లో ఉత్సాహం నింపేలా ప్రమోషన్లను పట్టాలెక్కించాల్సిన అవసరం ఉంది. మరి 20 రోజుల ఈ కౌంట్‌డౌన్‌లో ‘పెద్ది’ టీమ్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.
This beautiful photograph of Nabha Natesh draped in a classic white saree with a floral blouse radiates elegance, poise, and traditional charm.
Nabha Natesh (born December 11, 1995) is a popular Indian actress and model who primarily works in Telugu cinema, with notable appearances in Kannada films. She made her acting debut with the Kannada blockbuster Vajrakaya (2015) opposite Shiva Rajkumar. Her Telugu debut came with Nannu Dochukunduvate (2018) opposite Sudheer Babu.
She shot to fame with her breakthrough performance as Chandni in the super-hit iSmart Shankar (2019) alongside Pawan Kalyan, earning her the tag “iSmart Beauty.” Her filmography includes Disco Raja (2020), Solo Brathuke So Better (2020), Maestro (2021), and Darling (2024).
Nabha has exciting projects ahead, including the pan-Indian film Swayambhu (2026) opposite Nikhil Siddhartha and the much-awaited mythological-action drama Nagabandham (2026), where she plays Parvathi in a multi-lingual release. With her blend of beauty, talent, and versatility, Nabha Natesh continues to be a prominent name in South Indian cinema.
Photos Courtesy: Instagram
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్యూటీ సీరత్ కపూర్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. రీసెంట్ గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా సీరత్ షేర్ చేసిన ప్రైవేట్ జెట్ ఫోటోలు, వాటిపై వచ్చిన కామెంట్లు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్ కు సీరత్ ఇచ్చిన ఘాటు సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల అల్లు అర్జున్ తన 44వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా సీరత్ కపూర్ సోషల్ మీడియాలో బన్నీతో కలిసి ప్రైవేట్ జెట్‌ లో దిగిన కొన్ని అ న్‌సీన్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. "హ్యాపీ బర్త్‌ డే బన్నీ.. మీరు మీ కళను, సంబంధాలను ఎంతో సహజంగా, హుందాగా బ్యాలెన్స్ చేస్తారు. తెరపై, తెర వెనుక మరిన్ని విజయాలు అందుకోవాలి" అంటూ ఆమె పోస్ట్ చేసింది.
చివర్లో లవ్ సింబల్ కూడా యాడ్ చేసింది. అయితే సీరత్ కపూర్ పోస్ట్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ కొందరు నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. తాజాగా సీరత్ తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో మరో ఫోటో షేర్ చేయగా, ఓ నెటిజన్ లిమిట్స్ క్రాస్ చేసి అల్లు అర్జున్ ప్రాపర్టీ అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ పై ఇప్పుడు సీరత్ ఫుల్ ఫైర్ అయ్యి గట్టి క్లాస్ పీకారు.
"చివర్లో హార్ట్ ఎమోజీ పెట్టినంత మాత్రాన మీరు చెప్పిన మాటలు గౌరవప్రదంగా మారిపోవు సార్. ఒక మహిళ ఎప్పటికీ ఎవరి ఆస్తి కాదు. ఆమెకు తనకంటూ వ్యక్తిత్వం, కలలు, స్వరం ఉంటాయి. గౌరవించడం నేర్చుకోండి. కానీ ఇలా ప్రాపర్టీ రైట్స్ ఉన్నట్లు మాట్లాడొద్దు" అంటూ ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అయితే సీరత్ ఇచ్చిన సమాధానానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
మహిళలను వస్తువుల్లా చూడటం సరైంది కాదని, వ్యక్తిగత గౌరవం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆమె చెప్పిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. పలువురు నెటిజన్లు కూడా సరైన సమాధానం ఇచ్చారని, ఇలాంటి కామెంట్లకు ఇదే కరెక్ట్ కౌంటర్ అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ వివాదంపై స్పందిస్తున్నారు. కేవలం ఫ్రెండ్లీ పోస్టును తప్పుగా అర్థం చేసుకుని అనవసరమైన రూమర్లు క్రియేట్ చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో కూడా వీరిద్దరి మధ్య ఉన్నది మంచి స్నేహమే తప్ప మరేదీ కాదని టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా బన్నీ- సీరత్ కలిసి కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే సీరత్ కపూర్ 2014లో వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టైగర్, రాజు గారి గది 2, కృష్ణ అండ్ హిజ్ లీల, భామాకలాపం 2, మనమే వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె పలు కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పొలిటికల్ జర్నీలపై డైరెక్టర్ కమ్ యాక్టర్, ఆర్జే బాలాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో తెరకెక్కిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మాట్లాడిన బాలాజీ.. పవన్, విజయ్‌ ల విజయాల వెనుక ఉన్న అసలు రీజన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని తెలిపారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన వీరభద్రుడు చిత్రం మే 14న విడుదలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా విశేషాలతో పాటు రాజకీయ నాయకుల పొలిటికల్ సక్సెస్ లపై కూడా ఆర్జే బాలాజీ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా విజయ్, పవన్ కళ్యాణ్‌ లను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. "విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు చాలామంది నమ్మలేదు. విమర్శించారు. నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ ఆయన మాత్రం తన లక్ష్యాన్ని వదల్లేదు. తనపై తనకు ఉన్న నమ్మకంతో ముందుకు సాగారు. అదే నమ్మకం ప్రజల్లోకి వెళ్లి, ఇవాళ ఆయనను తమిళనాడు ముఖ్యమంత్రిగా నిలబెట్టింది" అని అన్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఆంధ్రప్రదేశ్‌ లో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఎన్నో విమర్శలు వచ్చాయి. రాజకీయంగా నిలబడలేరని అనేవారు కూడా ఉన్నారు. కానీ ఆయన తన ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ప్రజలు ఆయనను నమ్మారు. అందుకే ఆయనకు విజయం దక్కింది" అని చెప్పారు.
మనల్ని మనం నమ్ముకోవడం ఎంత ముఖ్యమో పవన్, విజయ్‌ ల రాజకీయ ప్రయాణాలు నిరూపించాయని బాలాజీ అభిప్రాయపడ్డారు. "మన మీద మనకు 100 శాతం నమ్మకం ఉంటే, అది ఒక శక్తిగా మారుతుంది. అదే ఇతరులకు కూడా చేరుతుంది. విజయ్, పవన్ ఇద్దరి ప్రయాణాల్లో అదే కనిపించింది" అని పేర్కొన్నారు. ఇక తన సినీ ప్రయాణాన్ని కూడా ఈ ఉదాహరణలతో కలిపి వివరించారు.
"నేను వీరభద్రుడు సినిమా చేస్తున్నప్పుడు కూడా చాలామంది ప్రశ్నించారు. సూర్య లాంటి స్టార్ హీరో.. మణిరత్నం, సుధా కొంగర వంటి దర్శకులతో పనిచేసిన తర్వాత నాతో సినిమా చేయడమేంటని అడిగారు. కానీ సూర్య సర్‌ కు నా మీద నమ్మకం ఉంది. అలాగే నా విజన్‌పై నాకు క్లారిటీ ఉంది" అని తెలిపారు. ఎదురుదెబ్బలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా, మనల్ని మనం నమ్ముకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా విజయం సాధించవచ్చని బాలాజీ చెప్పారు.
ఆర్జేగా కెరీర్ ప్రారంభించి నటుడిగా, ఇప్పుడు దర్శకుడిగా ఎదిగిన తన ప్రయాణం కూడా అదే విషయాన్ని చెబుతోందన్నారు. అలా ఈవెంట్‌ లో బాలాజీ చేసిన వ్యాఖ్యల్లో రాజకీయాల కంటే ఎక్కువగా సెల్ఫ్ బిలీఫ్ గురించి సందేశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, విజయ్‌ ను తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్నాయి. సినీ, రాజకీయ రంగాల్లో విమర్శలు సహజమే అయినా.. నమ్మకం, పట్టుదల ఉంటే టార్గెట్ ను చేరుకోవచ్చని బాలాజీ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.
తమిళనాడు శాసన సభలో విజయ్ మొదటి స్పీచ్ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన వేష భాషలు, అందులోని భావాలపై తమిళనాడు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షాలు కూడా బయటకు కాకున్నా లోలోపల సంతోషంగా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే విజయ్ ప్రసంగంలో ‘సమానం’ అన్న పదం పలు సార్లు రావడమే ఇందుకు నిదర్శనం.
రాజకీయాల్లో సాధారణంగా ‘మెజారిటీ’ అనేదే ఒక పెద్ద బూచీ. వంద సీట్లు ఉన్న పార్టీ నాయకుడి గొంతు సభలో వినబడుతుంది, ఒక్క సీటు ఉన్న పార్టీ నాయకుడి గొంతు నొక్కబడుతుంది. కానీ, తమిళనాడు రాజకీయ తెరపైకి కొత్తగా వచ్చిన 'దళపతి' విజయ్ మాత్రం తన టీవీకే మార్కు ప్రజాస్వామ్యానికి సరికొత్త నిర్వచనం ఇస్తున్నారు. ‘బలం ఉన్నవాడిదే మాట కాదు.. భావం ఉన్నవాడిదే బాట’ అన్నట్లుగా ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు చిన్న పార్టీల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అందరూ తలో దారి చూసుకుంటున్న వేళ, ‘ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరే.. మాకు అందరూ సమానమే’ అని చెప్పడం వినడానికి బాగానే ఉన్నా, ఇది నిజంగానే 'మంచి'ని స్వీకరించడమా లేక 'మద్దతు'ను కూడగట్టడమా అన్నది ఇప్పుడు అసలైన పాయింట్!
అసెంబ్లీలో అగ్రతాంబూలం..
తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటులో మద్దతిచ్చిన కాంగ్రెస్, ఇతర చిన్న పార్టీలను ఉద్దేశిస్తూ విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘మీ పార్టీకి ఒక్క అభ్యర్థి ఉన్నా సరే, మీ అభిప్రాయానికి టీవీకే అభిప్రాయంతో సమానంగా విలువ ఉంటుంది’ అని విజయ్ ప్రకటించారు. అంటే, భవిష్యత్తులో అసెంబ్లీలో 108 మంది టీవీకే ఎమ్మెల్యేలు ఒకవైపు, ఒక్కడంటే ఒక్కడున్న చిన్న పార్టీ ఎమ్మెల్యే మరోవైపు ఉన్నా.. త్రాసులో ఇద్దరి తూకం సమానమన్నమాట! ఇది విన్న సీనియర్ రాజకీయ నేతలు ‘మరీ ఇంతటి ఉదారత్వమా?’ అని ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమాలో హీరో అందరినీ సమానంగా చూసినట్లు, రియల్ పాలిటిక్స్‌లో కూడా అందరికీ 'ఈక్వల్ సీటు' ఇస్తానని విజయ్ హామీ ఇస్తున్నారు.
మంచికి వెల్కమ్..
సూచనల విషయంలో విజయ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ‘మంచి సూచనలు స్వీకరించబడతాయి, చెడు సూచనలు తిరస్కరించబడతాయి’ అని తేల్చేశారు. అయితే, ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. ఏది మంచి? ఏది చెడు? అనేది డిసైడ్ ఎవరు చేస్తారు. ఖచ్చితంగా అది విజయ్ వద్దే ఉంటుంది. అంటే, చిన్న పార్టీలు ఇచ్చే సలహా టీవీకే సిద్ధాంతాలకు సరిపోతే అది 'మంచి', లేకపోతే అది 'చెడు' అన్నమాట. ‘నీ అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ నీకుంది.. అది వినాలా వద్దా అని నిర్ణయించే అధికారం నాకుంది’ అనే ఈ సాఫ్ట్ డిక్టేటర్‌షిప్ వెనుక ఒక సినిమాటిక్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఆ ఒక్క అభ్యర్థి పార్టీకి.. జాక్‌పాట్ తగిలినట్టేనా?
ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న పార్టీలు సాధారణంగా పెద్ద పార్టీల నీడలో బతికేస్తుంటాయి. కానీ విజయ్ మాత్రం వారికి ‘టీవీకేతో సమాన విలువ’ అని ఆఫర్ ఇవ్వడంతో, ఆ ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు తనను తాను ఒక ‘కింగ్ మేకర్’ లా ఫీలవుతున్నాడు. అసెంబ్లీలో తన వాయిస్ కి కూడా విజయ్ వాయిస్ అంత వెయిట్ ఉంటుందని తెలియడంతో, ఆ ఒక్క అభ్యర్థి పార్టీలు ఇప్పుడు తమ మేనిఫెస్టోలను మళ్లీ తిరగరాసుకునే పనిలో పడ్డాయి. ఒకే ఒక అభ్యర్థి ఉన్నా సరే, పది లక్షల ఓట్లు తెచ్చుకున్న పార్టీతో సమానంగా ట్రీట్ చేస్తామనడం, రాజకీయాల్లో ఒక వింతైన 'సోషలిజం' అని చెప్పాలి.
వ్యూహాత్మక వినయం..
విజయ్ ఈ స్థాయిలో తగ్గి ఉండడం వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉందనేది విశ్లేషకుల మాట. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరుణంలో, ఎవరినీ నొప్పించకుండా అందరినీ కలుపుకుపోవడం ద్వారా తన ఇమేజ్ ను 'ప్రజాస్వామ్యవాది'గా మార్చుకోవాలని ఆయన చూస్తున్నారు. ‘నేను హీరోని, నా మాటే వినాలి’ అని కాకుండా ‘మనం అందరం కలిసి నడుద్దాం’ అని చెప్పడం ద్వారా చిన్న చిన్న శక్తులను కూడా తన వైపు తిప్పుకుంటున్నారు. అయితే, ఈ 'సమాన విలువ' అనేది అసెంబ్లీలో బిల్లుల ఆమోదం దగ్గర కూడా అలాగే ఉంటుందా? కాలమే నిర్ణయించాలి.
మొత్తానికి, విజయ్ ఈ 'సమానత్వ' రాజకీయం చూస్తుంటే.. ‘స్క్రీన్ మీద హీరో అందరినీ రక్షించినట్లు, అసెంబ్లీలో అందరినీ గౌరవించేస్తారన్నమాట" అనిపిస్తోంది. ఒక్క అభ్యర్థి ఉన్నా సరే రాజభోగం కల్పిస్తామంటున్న ఈ ఆఫర్ చూసి, ఇతర రాష్ట్రాల్లోని చిన్న పార్టీలు కూడా తమిళనాడుకు షిఫ్ట్ అయిపోతాయేమో!
టాలీవుడ్ ప్రేక్షకులకు 'హనీ ఈజ్ బెస్ట్' అంటూ దగ్గరైన మెహ్రీన్ పిర్జాదా, ఇప్పుడు రియల్ లైఫ్ ప్రిన్సెస్ లా మెరిసిపోతోంది. ఇటీవల అర్ష్ ఔలఖ్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించిన మరికొన్ని అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆమె ధరించిన వెరైటీ వెడ్డింగ్ డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అసలు ఆ డ్రెస్ స్పెషాలిటీ ఏంటో, ఆ వేడుక విశేషాలేంటో మీ కోసం..
మెహ్రీన్ వెడ్డింగ్ పార్టీ.. 'ఎ నైట్ రిటన్ ఇన్ ది స్టార్స్:
మెహ్రీన్ తన వివాహ వేడుక తర్వాత జరిగిన గ్రాండ్ పార్టీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ "నక్షత్రాల్లో రాసిపెట్టిన రాత్రి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తన భర్త అర్ష్‌తో కలిసి దిగిన ఈ ఫోటోల్లో మెహ్రీన్ చందమామలా మెరిసిపోతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన లొకేషన్లలో ఏప్రిల్ 26న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.
మెరిసిన హనీ పాప:
మెహ్రీన్ ధరించిన ఈ డ్రెస్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఇది ఒక పాకిస్థానీ డిజైనర్ 'షెహ్లా చటూర్' రూపొందించిన కస్టమ్ మేడ్ కౌచర్. షాంపేన్ కలర్ లో ఉన్న ఈ లెహంగా మీద చాలా రిచ్ గా ఎంబ్రాయిడరీ చేశారు. పైన చిన్న జాకెట్ లాంటి కేప్, దానికి మ్యాచింగ్‌గా ఉన్న లెహంగా ఆమెకు ఒక రాకుమారి లుక్‌ని ఇచ్చింది. ఈ డ్రెస్ డిజైన్ కోసం ప్రత్యేకంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించారట.
టాలీవుడ్ సెన్సేషన్ టు బ్యూటిఫుల్ బ్రైడ్:
నాని సినిమా 'కృష్ణగాడి వీరప్రేమ గాధ'తో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాల్లో ఆమె నటనకు ఫిదా అవ్వని వారు ఉండరు. ముఖ్యంగా 'హనీ ఈజ్ బెస్ట్' అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు పెళ్ళికూతురిగా మరింత కొత్త అందాన్ని సంతరించుకుంది.
వైరల్ అవుతున్న ఫోటో షూట్:
పెళ్లి తర్వాత మెహ్రీన్ షేర్ చేసిన పిక్స్ నిమిషాల్లోనే ఇంటర్నెట్‌ను చుట్టేశాయి. తన భర్తతో కలిసి ఉన్న రొమాంటిక్ అండ్ క్లాసిక్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. "సో బ్యూటిఫుల్ హనీ" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో మెహ్రీన్ ధరించిన నగలు, ఆ మేకప్ అంతా ఒక పర్ఫెక్ట్ రాయల్ వెడ్డింగ్‌ను గుర్తుచేస్తున్నాయి.
మెహ్రీన్ పిర్జాదా కొత్త జీవితం నూతన వెలుగులతో నిండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాల్లో తన నటనతో అలరించిన హనీ పాప, ఇప్పుడు గృహిణిగా కూడా తన స్టైల్ అండ్ గ్రేస్‌ను కొనసాగిస్తోంది. ఇక ఈ పెళ్లి ఫోటోలు చూస్తుంటే, మెహ్రీన్ తన జీవితంలోని అత్యంత అందమైన క్షణాలను ఎంజాయ్ చేస్తోందని అర్థమవుతోంది.
Pankhuri Gidwani: Raw and Unfiltered Goddess Energy Photo- @ferdauseh thankyou
This powerful photograph of Pankhuri Gidwani exudes confidence, elegance, and fierce charisma as she poses against a textured wall.
Pankhuri Gidwani, born on October 2, 1997, in Lucknow, is a talented Indian actress, model, and influencer. She was crowned Femina Miss Grand India 2016 and 2nd Runner-up at Femina Miss India. She made her acting debut in Hindi cinema with Ujda Chaman (2019) as Reema.
She gained wider recognition with her lead role as Chitra in the Telugu romantic film Love Mouli (2024) opposite Navdeep, marking her successful South Indian debut. Her other notable works include Gulabi Revdi (2021), Ishq-e-Nadaan, and OTT series like Leaked! and Amar Vishwas.
Pankhuri continues to expand her horizons with upcoming projects including Tu Meri Main Tera Main Tera Tu Meri (2025) and several other films and digital projects in 2026. With her striking beauty, strong screen presence, and dedication, Pankhuri Gidwani is steadily rising as a versatile force in Indian cinema and entertainment.
Photos Courtesy: Instagram
Actress Mehreen Pirzada is receiving a lot of love on social media after sharing beautiful new photos with her husband Arsh Aulakh. The actress posted a romantic picture on Instagram along with a heartfelt caption that quickly caught the attention of fans. The post has now become one of the most talked-about celebrity updates online.
In the photo, Mehreen looked graceful in a heavily designed light-colored lehenga with detailed embroidery work. She stood beside Arsh Aulakh, who wore a stylish dark traditional outfit. The picture had a warm and soft look, giving it a magical feel. The background with bookshelves and glowing lights added even more beauty to the moment.
Sharing the picture, Mehreen wrote, “A night written in the stars” along with sparkle and heart emojis. She also used the hashtag “ArshDiMehr.” In her caption, the actress thanked designer Shehla Chatoor and Shehla Chatoor Private for making her look like “a princess straight out of a tale.” She also mentioned stylist Rao Ali Khan, outfit brand Sawan Gandhi Official, makeup artist Faces by Chaitali Sengupta, hairstylist Arya Ruchii and photography team Light Chamber.
The actress recently married Arsh Aulakh in a private wedding ceremony held in Himachal Pradesh on April 26, 2026. The couple shared their first wedding pictures online, and many celebrities and fans congratulated them. Their wedding photos became viral within a short time because of their elegant fashion choices and lovely chemistry.
According to reports, Mehreen wore a blush-pink lehenga during the wedding ceremony. She completed her bridal look with a layered necklace, matching earrings and a maang tikka. Her makeup was soft and natural, while her hair was left open under a beautiful veil. Arsh also matched her look in a blush-pink traditional outfit.
After the wedding announcement, many people became curious about Arsh Aulakh. Fans noticed that his Instagram account is private. His bio reportedly says, “Cars and Travel, Sports and Netflix, Living the Dream....” Even though very little information about him is available publicly, fans are happy to see Mehreen starting a new chapter in her life.
On the work front, Mehreen continues to stay busy with films. She is getting ready to make her Kannada debut with Nee Sigoovaregu. She made her Hindi film debut with Phillauri alongside Diljit Dosanjh and Anushka Sharma. She is also known for Telugu films like F2: Fun and Frustration, Jawaan, Pantham and Kavacham.
Photos Courtesy: Instagram
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 3వ తేదీన నిర్వహించిన ప్రవేశ పరీక్ష నీట్ - 2026ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో ఏటా మే నెలలో వచ్చే మొదటి ఆదివారం నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది మే 3న పరీక్ష జరగగా, అంతకు రెండు రోజుల ముందు రాజస్థాన్ లో పేపర్ లీకైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. దీంతో లక్షల మంది విద్యార్థులు ఉసూరుమంటున్నారు. ఈ ఏడాది సుమారు 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలు రాశారు. చాలా మంది విద్యార్థులు రెండేళ్లకు పైగా నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. పరీక్ష పూర్తవడంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్.టీ.ఏ ప్రకటించడం సంచలనంగా మారింది.
ఈ ఏడాది మే 3న నీట్ పరీక్ష జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్న పత్రం రాజస్థాన్ లో లీకైనట్లు కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా, పేపర్ లీకు నిజమేనని తేలింది. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్ష వ్యవస్థపై నమ్మకం పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కొత్తగా పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఫీజులు కూడా చెల్లించాల్సిన పనిలేదని ఎన్టీఏ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
పరీక్ష తేదీలు ఖరారైన తర్వాత ఆన్ లైన్ లో అడ్మిట్ కార్డులు అందుబాటులోకి ఉంచుతామని వివరించింది. కాగా, ప్రశ్నపత్రం లీకేజీపై దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్రం సీబీఐకి బాధ్యతలు అప్పగించింది. పరీక్షకు రెండు రోజుల ముందు రాజస్థాన్ లో ‘గెస్ పేపర్’ పేరిట క్వశ్చన్ పేపర్ ను రూ.2 నుంచి 5 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. కొందరు విద్యార్థుల నుంచి రూ.20 వేల నుంచి 50 వేలు వసూలు చేశారని రాజస్థాన్ పోలీసుల విచారణలో వెల్లడైందని అంటున్నారు. కెమెస్ట్రీ విభాగంలో 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ప్రాక్టీసు పేపరును పోలీసులు కనుగొన్నారు.
అదేవిధంగా కేరళలోని ఓ వైద్య కళాశాలకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి నుంచి ప్రాక్టీసు పేపర్ రాజస్థాన్ లోని సికార్ లో శిక్షణ తీసుకుంటున్న స్నేహితుడికి వెళ్లిందని, చేతి రాతతో ఉన్న ఆ పేపరు నీట్ ప్రశ్నపత్రంలో సుమారు 600 మార్కులకు సరిపోయేలా కనిపిస్తోందని పోలీసులు గుర్తించారు. కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా ఇచ్చిన ఆఫ్షన్ము క్రమం కూడా మారకపోవడంపై లీకేజీ అనుమానాలు ఎక్కువయ్యాయి. కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలు వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్రశ్నపత్రం వైరల్ అవడంతో పరీక్ష రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
‘ఏడాది పాటు బంగారం కొనొద్దు.. పెట్రోల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలను వాడండి.. విదేశీ పర్యటనలు వద్దు.. ఖర్చులు తగ్గించండి.. యూరియా వాడకం తగ్గించి.. సేంద్రియ సేద్యం చేయండి..’ అంటూ ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ లో చెప్పారు. మోడీ చెప్పినవి అన్నీ బాగానే ఉన్నా.. ప్రతిపక్షం మాత్రం రాద్దాంతం మొదలు పెట్టింది. ఇంధన నిల్వలు అయిపోయాయి.. అందుకే మోడీ మాట్లాడుతున్నారు.. సరిపోయేంత యూరియా దిగుమతిలో కేంద్రం విఫలమైంది. అందుకే సేంద్రియ సాగు చేయమంటున్నాడు. అంటూ ప్రచారం మొదలు పెట్టాయి. కానీ ప్రజలకు తెలుసు మోడీ ఈ సూచనలు ఎందుకు చేశారో..
ఒక దేశ ప్రధాని సామాన్య ప్రజలనుద్దేశించి బంగారం కొనవద్దని లేదా విదేశీ ప్రయాణాలు తగ్గించుకోమని కోరడం వెనుక ఎంతటి లోతైన ఆర్థిక వ్యూహం ఉందో మనీ కంట్రోల్ అంచనాలు చూస్తుంటే అర్థం అవుతోంది. వ్యక్తి గతంగా మనకు ఇవి చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసికట్టుగా ఈ నియమాలను పాటిస్తే దేశ ఖజానాకు ఏకంగా రూ. 4.27 లక్షల కోట్ల ($45 బిలియన్లు) లాభం చేకూరుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది మన దేశ రక్షణ బడ్జెట్‌లో సగానికి పైగా సమానం కావడం విశేషం. భారత ఆర్థిక వ్యవస్థను దృఢంగా మార్చడానికి, డాలర్ నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ ఇటీవల ప్రజలకు కొన్ని ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు. ఈ మార్పుల వల్ల దేశానికి కలిగే ప్రయోజనాలను ప్రముఖ ఆర్థిక సంస్థలు ఈ క్రింది విధంగా లెక్కించాయి:
చమురు, బంగారం తగ్గిస్తే భారీగా ఆదా
భారతదేశం తన విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా ఖర్చు చేసేది ఈ రెండు రంగాల పైనే. మనం వాడే పెట్రోల్, డీజిల్‌ను కేవలం 10% తగ్గించినా ఏడాదికి సుమారు $13.5 బిలియన్లు ఆదా అవుతాయి. భారతీయులు బంగారం కొనుగోళ్లను ఒక 10% తగ్గించుకుంటే $7.2 బిలియన్లు మిగులుతాయి. ప్రస్తుతం ఆర్బీఐ తన నిల్వలను పెంచుకుంటూ ప్రజలను నియంత్రించమన్నది అందుకే.
విదేశీ ప్రయాణాలు, వంట నూనెలు
మన విలాసాలు, ఆహార అలవాట్లలో చిన్న మార్పులు దేశానికి పెద్ద మొత్తంలో నిధులను తెచ్చిపెడతాయి. భారతీయులు విదేశీ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేసి దేశీయ పర్యాటక రంగం వైపు మొగ్గు చూపితే ఏకంగా $15.8 బిలియన్లు దేశంలోనే ఉండిపోతాయి. పామాయిల్ వంటి వంట నూనెల దిగుమతులను 10% తగ్గించుకుంటే $1.95 బిలియన్లు పోగవుతాయి.
వ్యవసాయ రంగంలో మార్పులు
రసాయన ఎరువుల దిగుమతిపై ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని 50% మేర తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్తే $7.3 బిలియన్లు ఆదా అవుతాయని అంచనా.
మొత్తంగా ఈ అన్ని రంగాల్లో మనం చేసే చిన్న త్యాగం వల్ల రూ. 4.27 లక్షల కోట్లు ఆదా అవుతాయి. ఈ భారీ నిధులను ప్రభుత్వం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. అంటే, మనం బంగారం కొనకుండా ఉండటం లేదా విదేశీ పర్యటనలు తగ్గించుకోవడం ద్వారా పరోక్షంగా దేశ నిర్మాణంలో భాగస్వాములవుతున్నామన్నమాట.
టాలీవుడ్‌ లో ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి, ప్రేక్షకుల అభిరుచులు, టికెట్ ధరలు, సినిమా క్వాలిటీపై పెద్ద చర్చ ఎత్తున నడుస్తోంది. భారీ బడ్జెట్లతో, స్టార్ హీరోలతో తెరకెక్కుతున్న సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆందోళన కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ గా మారాయి.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో రాహుల్ రామకృష్ణ చేసిన వరుస పోస్టులు నేరుగా టాలీవుడ్ పనితీరుపైనే ప్రశ్నలు లేవనెత్తాయి. "ఖాళీగా ఉన్న థియేటర్లు మనం చేస్తున్న పని ఎంత దారుణంగా ఉందో చెప్పే నిజాయితీ తీర్పు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి కేవలం ఓటీటీలు కారణం కాదని, అసలు సమస్య కంటెంట్ క్వాలిటీలో ఉందని ఆయన పరోక్షంగా చెప్పారు.
ప్రస్తుతం ప్రేక్షకుల టేస్ట్ పూర్తిగా మారిపోయిందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు స్టార్ హీరోలు, భారీ సెట్లు, హైప్ ఉంటే చాలు సినిమా ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, ప్రేక్షకులు కేవలం మంచి కథ, స్ట్రాంగ్ ఎమోషన్స్, కొత్త అనుభూతి ఇచ్చే సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన సూచించారు. అందుకే ఇటీవల కొన్ని చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తుండగా, భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తున్నాయని ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు.
ఇక థియేటర్లకు రావడం సాధారణ ప్రేక్షకుడికి ఎంత కష్టంగా మారిందో కూడా రాహుల్ తన పోస్టులో ప్రస్తావించారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఛార్జీలు, థియేటర్లలో అధిక స్నాక్స్ ధరలు, టికెట్ రేట్లు—అన్నీ కలిపి సినిమా చూడటం ఖరీదైన వ్యవహారంగా మారిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి థియేటర్‌కు రావాలంటే సినిమా నిజంగా ప్రత్యేక అనుభూతిని ఇవ్వాలని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్‌ లో లేదా ఓటీటీలో చూడలేని విజువల్ ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌ లో ఉండాలని పేర్కొన్నారు.
ఆ తర్వాత దర్శక నిర్మాతలపై కూడా రాహుల్ పరోక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రేక్షకులను తక్కువ అంచనా వేయొద్దని, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ సినిమా మేకింగ్‌ పై అవగాహన పెరిగిందని చెప్పారు. డిజిటలైజేషన్ కారణంగా కెమెరా వర్క్, స్క్రీన్‌ ప్లే, టెక్నికల్ అంశాలపై సాధారణ ప్రేక్షకులకు అవగాహన వచ్చిందని గుర్తు చేశారు. కాబట్టి ప్రేక్షకుడిని మోసం చేసే ప్రయత్నం చేయకుండా, క్వాలిటీ కంటెంట్ పై దృష్టి పెట్టాలని సూచించారు.
టికెట్ ధరల విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుడి జేబుకు భారమయ్యే రేట్లు పెట్టి, అదే సమయంలో కంటెంట్ పరంగా నిరాశ పరిస్తే థియేటర్లకు జనాలు రావడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రేక్షకులను గౌరవించేలా సినిమాలు ఉండాలని, వారిని అవమానిస్తూ అభిమానాన్ని ఆశించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.
ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు చూసిన తర్వాత తాను వ్యాఖ్యలు చేశానని రాహుల్ రామకృష్ణ వెల్లడించారు. ఎప్పుడూ తన అభిప్రాయాలను మొహమాటం లేకుండా చెప్పే ఆయన, ఈసారి కూడా టాలీవుడ్‌ లో ఉన్న అసలు సమస్యలపై నేరుగా మాట్లాడారని సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై దర్శక నిర్మాతలు, ప్రముఖులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా టాలీవుడ్ ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ ప్రస్తుతం తన లేటెస్ట్ యాక్షన్ కామెడీ మూవీ అతిరడి ప్రమోషన్స్‌ తో బిజీగా ఉన్నారు. మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే తాజాగా టోవినోకు ఎదురైన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఎప్‌ స్టీన్ ఫైల్స్‌ లో మీ పేరు ఉందా? అంటూ అడిగిన ప్రశ్నపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
నిజానికి.. టోవినో థామస్ మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. మిన్నల్ మురళి, మాయానది, వైరస్, లూసిఫర్, ఫోరెన్సిక్, 2018 వంటి చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో డబ్ అయిన సినిమాల ద్వారా కూడా ఆయనకు ఇక్కడ ఫ్యాన్ బేస్ పెరిగింది. ఇటీవల వచ్చిన పళ్లి చట్టంబి చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఇప్పుడు టోవినో అప్ కమింగ్ మూవీ అతిరడి ప్రమోషన్స్ లో వరల్డ్ పాలిటిక్స్ తో పాటు పలు విషయాలపై చర్చ కొనసాగింది. అదే సమయంలో అమెరికాలో మరోసారి హాట్ టాపిక్‌ గా మారిన ఎప్‌ స్టీన్ ఫైల్స్‌ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఆ క్రమంలోనే టోవినోను ఉద్దేశించి ఆ జాబితాలో మీ పేరు ఉందా? అంటూ ప్రశ్న అడిగినట్టు సోషల్ మీడియాలో వీడియో క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.
ఆ ప్రశ్నకు టోవినో థామస్ పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తోంది. అయితే పక్కనే ఉన్న దర్శకుడు బాసిల్ నవ్విన తీరు కూడా కొంతమందికి ఇబ్బందిగా అనిపించింది. ఒక నటుడిని ఇలా ఆధారాలు లేకుండా వివాదాస్పద అంశంతో కలిపి ప్రశ్నించడం సరైనది కాదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రమోషన్స్ కోసం సినిమాకు సంబంధం లేని అంశాలను లాగడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు కొంతమంది మాత్రం ఇది సరదాగా అడిగిన ప్రశ్న కావచ్చని, దాన్ని అతిగా తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఒక ఇంటర్నేషనల్ సె* క్స్ ట్రాఫికింగ్ కేసుతో సంబంధం ఉన్న ఎప్‌ స్టీన్ ఫైల్స్ వంటి సెన్సిటివ్ ఇష్యూను ఇండియన్ యాక్టర్ తో లింక్ చేస్తూ ప్రశ్నించడం సరైంది కాదనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. అయితే అమెరికాకు చెందిన ఎప్ స్టీన్ పై వచ్చిన సె* క్స్ ట్రాఫికింగ్ ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇటీవల ఆ కేసుకు సంబంధించిన పలు పత్రాలు, ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో మళ్లీ ఆ అంశం అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వ్యాపారవేత్తలు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖుల పేర్లు చర్చలోకి రావడం మరింత ఆసక్తి రేకెత్తించింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి లిస్ట్, ప్రతి వార్త నిజమనే గ్యారెంటీ లేదని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో సెలబ్రిటీలకు పిచ్చి ప్రశ్నలు వేయడం, వాటిని వైరల్ చేయడం వల్ల వారి ఇమేజ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
BR is one of the most insensitive interviewers and he must quit immediately coz wtf is this pic.twitter.com/RfS7NjMED5
May 10, 2026
సనాతనం ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గతంలో కోర్టు నుంచి మొట్టికాయలు తిన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మళ్లీ అదే రకమైన ప్రకటనతో దుమారం రేపారు. అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక సందర్భంగా మాట్లాడిన ఉదయనిధి సనాతన ధర్మాం రూపు మాపాలని పిలుపునిచ్చారు. 2023లో జాతీయ స్థాయిలో పెను వివాదానికి దారితీసిన ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అనే తన పాత ప్రకటనను ఆయన అసెంబ్లీ సాక్షిగా మళ్లీ పునరుద్ఘాటించడం విశేషంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి విజయ్ సభలో ఉండగానే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి జరుగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధాన ప్రతిపక్ష నేతగా మాట్లాడిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై తన పాత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే తన పాత మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తుండగా, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎదురుగా కూర్చుని ఉన్నారు. గతంలో ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. పలు న్యాయపరమైన చిక్కులు సైతం ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఫ్లోర్ పై అదే అంశాన్ని లేవనెత్తడంతో చర్చకు తావిచ్చారని అంటున్నారు.
ఎన్నికల్లో డీఎంకే ఓడిపోవడానికి గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా ఓ కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వల్లే హిందూ ఓటర్లకు డీఎంకే దూరమైనట్లు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓడినా ఉదయనిధిలో ఎలాంటి మార్పు రాకపోవడం పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోందని చెబుతున్నారు. మనుషుల మధ్య దూరాన్ని పెంచే సనాతన ధర్మాన్ని అంతం చేయాలంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయన పిలుపునివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉదయనిధి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి విజయ్ ఎలా స్పందిస్తారని అంతా ఎదురుచూశారు.
ఇక ఉదయనిధి స్టాలిన్ ప్రసంగం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడారు. అయితే చాలా తెలివిగా ఆయన ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించారని అంటున్నారు. "రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకరి నమ్మకాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వం అన్ని మతాలను, నమ్మకాలను సమానంగా గౌరవిస్తుంది" అని ముఖ్యమంత్రి విజయ్ స్పష్టం చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై మౌనంగా ఉండకుండా, చాలా హుందాగా స్పందిస్తూ విభజన రాజకీయాలు కంటే తమకు ప్రజా సంక్షేమమే ముఖ్యమని సీఎం స్పష్టత ఇచ్చారని అంటున్నారు.
ఉదయనిధి స్టాలిన్ “సనాతనాన్ని నిర్మూలించాలి” అని వ్యాఖ్యానిస్తుండగా సీఎం విజయ్ మౌనంగా గమనించారు. సనాతన ధర్మాన్ని విశ్వసించే వారి మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎప్పుడైనా స్పందిస్తారా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.… pic.twitter.com/EAkeTJXGRP
— Tupaki (@tupaki_official)
May 12, 2026
సోషల్ మీడియా అంతగా లేని జమానాలో ఒక నాయకుడికి ఫాలోవర్స్ అంటే కాన్వాయ్.. నాయకుడు ఇంటి ముందు జనం.. ఇలా ఉండేవారు. కానీ సోషల్ మీడియా విస్తరించిన తర్వాత సీన్ మారింది. నాయకుడికి ఆదరణ అంటే అది ఫాలోవర్స్ పెరగడం.. అదే నాయకుడికి ఆదరణ తగ్గింది అంటే ఫాలోవర్స్ తగ్గడం.. ఒక్కొక్కసారి దీన్ని కూడా కొలమానంగా తీసుకోలేం. నాయకుడు తీసుకునే నిర్ణయాలపై అభిమానులు, నెటిజన్లు క్షణాల్లో వారి తీర్పును మార్చుకుంటారు. ఇటీవలి కాలంలో రాఘవ్ చడ్ఢా విషయంలో ఇదే జరిగింది. రాఘవ్ చడ్ఢా ఆప్ లో కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉండేవారు. ఆయన బీజేపీలో చేరడంతో ఒక్క రోజులోనే ఫాలోవర్స్ తగ్గారు. అదే విధంగా ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విజయ్ కి 48 గంటల్లోనే 10 లక్షలకు పైగా ఫాలోవర్స్ పెరిగారు.
ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అనడానికి ఈ సోషల్ మీడియా గణాంకాలు ఒక నిదర్శనం. గతంలో ద్రవిడ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన దిగ్గజాల వారసులను కూడా పక్కన పెట్టి, కేవలం 48 గంటల్లోనే 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లను సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ డైలీ అప్‌డేట్స్ తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ఈ డిజిటల్ జోష్ చూస్తుంటే అర్థమవుతోంది.
తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. అభిమానులు కేవలం విజయ్ వ్యక్తిగత ఖాతాలనే కాకుండా, ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకోవడానికి సీఎంఓ (సీఎంవో) పేజీలను కూడా పెద్ద ఎత్తున ఫాలో చేస్తున్నారు.
ఇన్‌స్టాలో అనూహ్య వృద్ధి
తమిళనాడు సీఎంఓ ఇన్‌స్టా పేజీ గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఫాలోవర్లను సంపాదించుకుంది. గతంలో ఈ పేజీకి కేవలం 4.4 లక్షల (4.4 L) మంది ఫాలోవర్లు మాత్రమే ఉండేవారు. 48 గంటల మ్యాజిక్ జరిగింది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఈ సంఖ్య 1.4 మిలియన్లకు (14 లక్షలు) చేరుకుంది. కేవలం రెండు రోజుల్లోనే సుమారు 10 లక్షల మంది రికార్డ్ స్థాయిలో కొత్త ఫాలోవర్స్ ఈ పేజీని ఫాలో అవ్వడం విశేషం.
'X'లో దూకుడు
ప్రభుత్వ అధికారిక ప్రకటనలకు వేదికైన 'X (ఎక్స్)' లో కూడా అదే జోరు కనిపించింది. ఈ ప్లాట్ ఫారంపై కూడా దాదాపు పది లక్షల మంది కొత్త ఫాలోవర్లు యాడ్ కావడంతో, సీఎంఓ పేజీ ఫాలోవర్ల సంఖ్య 2 మిలియన్లను (20 లక్షలు) దాటింది. జగదీష్ పళనిస్వామి నేతృత్వంలోని 'ది రూట్' సంస్థ ఐదేళ్లుగా నిర్మించిన డిజిటల్ సామ్రాజ్యం ఇప్పుడు ప్రభుత్వ పేజీల బలోపేతానికి ఎంతో ఉపయోగపడింది.
ఈ క్రేజ్‌కు ప్రధాన కారణాలు..
సోషల్ మీడియాలో విజయ్ ఇలాంటి సంచలనాలు సృష్టించడానికి కొన్ని కీలక అంశాలు దోహదపడుతున్నాయి. సీఎం హోదాలో విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు (ఉదాహరణకు 717 మద్యం షాపుల మూసివేత) ప్రజలకు వెంటనే చేరుతుండటం. కోట్లాది రూపాయల పారితోషికాన్ని వదిలి, రూ. 2 లక్షల వేతనంతో ముఖ్యమంత్రిగా పని చేస్తున్న ఆయన పట్ల ప్రజల్లో ఏర్పడిన సానుకూలత. దళపతిగా సినీ తెరపై అలరించిన విజయ్, ఇప్పుడు నిజ జీవితంలోనూ తనదైన ముద్ర వేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఒక నాయకుడికి ప్రజల్లో ఉన్న ఆదరణను కొలవడానికి నేటి రోజుల్లో సోషల్ మీడియా ఒక కొలమానంగా మారింది. విజయ్ ముఖ్యమంత్రి అయిన రెండు రోజుల్లోనే ఈ స్థాయిలో డిజిటల్ సపోర్ట్ లభించడం ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రయాణానికి గొప్ప శుభపరిణామం.
తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్‌ స్టార్‌ విజయ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఊహించని రేంజ్‌లో సీట్లను దక్కించుకోవడంతో ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇటీవలే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి హీరోయిన్‌ త్రిష వార్తల్లో నిలుస్తున్నారు. విజయ్‌ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నాడనే వార్తలు వచ్చిన వెంటనే త్రిష పేరు మరింత ప్రచారం జరిగింది. విజయ్‌, త్రిష వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి. ఏకంగా త్రిష, విజయ్‌ ప్రస్తుతం సహజీవనం సాగిస్తున్నారనే వార్తలు వచ్చాయి. రాజకీయంగా విజయ్‌ను దెబ్బ తీసేందుకు త్రిష పేరును సైతం కొందరు రాజకీయ నాయకులు తీసుకు వచ్చారు. దాంతో త్రిష పేరు గత కొన్ని నెలలుగా ప్రముఖంగా చర్చనీయాంశం అవుతుంది.
సీఎం విజయ్‌ ప్రేయసి త్రిష...
సీఎంగా విజయ్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమిళనాడుకు త్రిష కాబోయే అమ్మ అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. విజయ్‌ రెండు చోట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన విషయం తెల్సిందే. ఒక చోట విజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నాడు. ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందనే వార్తలు వచ్చాయి. అంతే కాకుండా త్రిష ను తన మంత్రి వర్గంలోకి తీసుకుని, ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు ఇస్తాడనే వార్తలు కూడా వచ్చాయి. దాంతో త్రిష సినిమాలకు గుడ్‌ బై చెబుతుందా అనే చర్చ జరిగింది. కానీ త్రిష సినిమాలకు గుడ్‌ బై చెప్పబోవడం లేదని తేలిపోయింది. ఇన్నాళ్లు రాజకీయ వార్తలతో త్రిష వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఒక సినిమాకు సంబంధించిన వార్తతో త్రిష వార్తల్లో నిలవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ మల్టీస్టారర్‌ మూవీ...
1979 తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ లు కలిసి నటించబోతున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా కోసం త్రిష ను దర్శకుడు నెల్సన్‌ సంప్రదించాడనే వార్తలు వస్తున్నాయి. త్రిష సైతం కథను విని గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా కథ లో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇద్దరు హీరోలకు త్రిష జోడీగా కనిపించబోవడం లేదని, కానీ సినిమాలో ఆమె పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుందని మాత్రం అంటున్నారు. ఈ మధ్య కాలంలో త్రిష చేయని పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తమిళనాట ఈ వార్తలు ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్నాయి.
నెల్సన్ దిలీప్‌ దర్శకత్వంలో...
రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ల మూవీని మొదట లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్లాన్‌ చేశారు. కానీ లోకేష్ కనగరాజ్‌ వరుస సినిమాలతో నిరాశ పరిచిన నేపథ్యంలో ఆయనను దర్శకత్వ బాధ్యతల నుంచి తొలగించారని తెలుస్తోంది. ఆ తర్వాత మరో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించాయి. చివరకు రజనీకాంత్‌ తో జైలర్‌ సినిమాను తీసి సూపర్‌ హిట్‌ కొట్టి, ఇప్పుడు జైలర్‌ 2 ను చేస్తున్న దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కు ఈ భారీ మల్టీస్టారర్‌ సినిమా నిర్మాణ బాధ్యతను అప్పగించారని తెలుస్తోంది. ఈ సినిమాకు కమల్‌ హాసన్ ఒక నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి మంచి స్పందన వచ్చింది. వచ్చే ఏడాది ఈ బిగ్గెస్ట్‌ భారీ మల్టీ స్టారర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్‌ ప్రారంభం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో త్రిష స్పెషల్‌ రోల్‌ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి.
This elegant and confident photograph of Pragya Nayan in a sharp blue power suit highlights her bold fashion sense and captivating screen presence.
Pragya Nayan (born Pragya Nayan Sinha on August 17, 1998) is a talented Indian actress and model who primarily works in Telugu cinema. She made her acting debut in 2018 with the Kannada film Escape. She made her Telugu debut with Samhara (bilingual) and gained wider attention with films like Suraapanam (2022).
She received notable recognition for her role in the crime thriller Chakravyuham: The Trap (2023). Her other releases include Badmash Gallaki Bumper Offer (2023), Janam (2023), We Love Bad Boys (2024), and the action film Kalinga (2024).
Pragya has several exciting upcoming projects including Mission C1000 (2026), Ugly Story (2026), Mad Square (2025), and Samaram (2026). With her glamorous appeal, dedication, and growing filmography, Pragya Nayan is steadily establishing herself as a promising actress in the South Indian film industry.
Photos Courtesy: Instagram
ఇండ‌స్ట్రీలో పారితోషికాల మ‌ధ్య వ్య‌త్యాసం అన్న‌ది నిరంత‌రం తెర‌పైకి వ‌చ్చే అంశ‌మే. ఒక‌రికి ఎక్కువ‌? మ‌రోక‌రికి త‌క్కువ అన్నది ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశంగానే ఉంటుంది. ఈ విష‌యంలో ఏ ప‌రిశ్ర‌మ మిన‌హాయింపు కాదు. తాజాగా నేషనల్ అవార్డ్ విన్నర్ కృతి సనన్ లింగ వివక్ష , పారితోషికాల వ్యత్యాసం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్ద కాలంగా పరిశ్రమలో కొన‌సాగుతున్నా? ఇప్పటికీ మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న చిన్నచూపు పట్ల కృతి ఆవేదనను వ్యక్తం చేసారు. ముఖ్యంగా బడ్జెట్ విషయానికి వస్తే మొదటగా హీరోయిన్లనే టార్గెట్ చేస్తారనే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
సినిమా నిర్మాణ వ్యయం పెరిగినప్పుడు లేదా బడ్జెట్‌లో కోత విధించాల్సి వచ్చినప్పుడు నిర్మాతలు మొదటగా చర్చలు జరిపేది హీరోయిన్ల పారితోషికాల పైనే అన్నారు. హీరోలకు బడ్జెట్‌లో సింహభాగం కేటాయించినా? వారి పారితోషికం విషయంలో రాజీ పడని మేకర్స్ హీరోయిన్లకు ఇచ్చే మొత్తాన్ని తగ్గించడానికి మాత్రం వెనుకాడరని అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. ఇది కేవలం పారితోషికానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని పరిశ్రమలో బలంగా పాతుకుపోయిన పితృస్వామ్య ధోరణికి నిదర్శనమని అభి ప్రాయపడ్డారు.
సెట్‌లో వాతావరణం గురించి కూడా కృతి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హీరో షూటింగ్ సెట్‌లోకి రాకముందే హీరోయిన్ రెడీగా ఉండాలనే నియమం ఇండస్ట్రీలో ఉందన్నారు. సెట్ లో హీరోయిన్ మాత్ర‌మే ఎదురు చూడాలి. ఆమె ఆల‌స్య‌మ‌వ్వ‌డానికి లేదు. అదే హీరో అయితే? ఎంత ఆల‌స్యంగా వ‌చ్చినా? ప‌ర్వాలేదు. వాళ్ల‌ను అడిగే వాళ్లు ఎవ‌రూ ఉండ‌రు. సెట్ లో ఈ సంస్కృతి మారాల‌న్నారు. నటీనటుల మధ్య గౌరవం సమానంగా ఉండాలని ఒకరు మరొకరి కోసం వేచి ఉండటంలో ఉన్న వివక్ష తొల‌గిపోవాల‌న్నారు.
కెరీర్ ఆరంభంలో ఎదురైన కొన్ని అనుభవాలను కూడా కృతి గుర్తు చేసుకున్నారు. తనతో సమాన స్థాయిలో ఉన్న ఒక హీరోకు మెరుగైన కార్ సౌకర్యం కల్పించగా తనకు మాత్రం తక్కువ స్థాయి సౌకర్యాలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ సమస్య కారు గురించి కాదని ఇచ్చే గౌరవం , ప్రాధాన్యత అని అభిప్రాయ‌ప‌డ్డారు. నటీమణులు ఎంతటి విజయాన్ని అందుకున్నా? జాతీయ అవార్డులు గెలుచుకున్నా కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో వివక్షకు గురికావడం బాధాకరమని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తోందని కృతి సనన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కంటెంట్ ఆధారిత చిత్రాలు , మహిళా ప్రధాన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుండటంతో నిర్మాతల ఆలోచనా దృక్పథంలో మార్పు వస్తుందని నమ్ముతున్నారు. `క్రూ` వంటి చిత్రాల విజయం మహిళా నటీమణులకు కూడా భారీ బడ్జెట్, మార్కెట్ ఉందని నిరూపించిందని ఉదహరించారు. భవిష్యత్తులో కథానా యికలకు సమాన హోదా సమాన వేతనం లభించే దిశగా అడుగులు పడాలని కృతిస‌న‌న్ ఆశా భావం వ్య‌క్తం చేసారు.
బంగారం పేరు చెబితేనే మధ్యతరగతి భర్తల జేబులు గజగజ వణుకుతుంటాయి. కానీ, తాజాగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో సీన్ మొత్తం రివర్స్ అయింది. "ఏడాది పాటు బంగారం కొనకండి" అని పీఎం చెప్పిన మాటలు, భారతీయ భర్తలకు అమృతంలా వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం మోదీ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు, ఇప్పుడు సామాన్య గృహస్తులకు ఒక వరంగా మారింది. సోషల్ మీడియాలో దీనిపై పేలుతున్న సెటైర్లు, మీమ్స్ ఇప్పట్లో ఆగేలా లేవు. ఆ వివరాలు చూద్దాం .
మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి?:
హైదరాబాద్ వేదికగా ఇటీవల ప్రధాని మోదీ ఒక సంచలన విజ్ఞప్తి చేశారు. పశ్చిమ ఆసియాలో యుద్ధాల వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, రూపాయి విలువ పడిపోకుండా ఉండాలంటే బంగారం దిగుమతులు తగ్గించాలని ఆయన కోరారు. ఏడాది పాటు బంగారం కొనడం ఆపేసి, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకుంటే దేశ సంపద ఆదా అవుతుందని ఆయన సూచించారు. ఇది వినడానికి ఆర్థిక సూత్రంలా ఉన్నా, భర్తలకు మాత్రం ఇది 'గోల్డెన్ న్యూస్' లా అనిపిస్తోంది.
భర్తలకు దేవుడిలా కనిపించిన ప్రధాని:
సాధారణంగా ఏ పండగ వచ్చినా, పెళ్లి రోజు వచ్చినా భార్యల నుంచి వచ్చే మొదటి డిమాండ్ 'బంగారం'. అప్పులు చేసైనా సరే నగలు చేయించలేక సతమతమయ్యే భర్తలకు, ఇప్పుడు మోదీ రూపంలో ఒక స్ట్రాంగ్ రీజన్ దొరికింది. 'నేను కొననని అనడం లేదు, దేశం కోసం మన ప్రధాని వద్దన్నారు.. మనం దేశభక్తులం కదా..' అంటూ భార్యలకు సర్దిచెప్పే అద్భుతమైన అవకాశం రావడంతో హస్బెండ్స్ అంతా లోలోపల ఎగిరి గంతేస్తున్నారు.
వైరల్ అవుతున్న 'టీవీ' సీన్లు:
సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక భర్త తన భార్యను పట్టుబట్టి మరీ టీవీ ముందుకు తీసుకెళ్లి, మోదీ గారు 'బంగారం కొనకండి' అని చెబుతున్న క్లిప్పింగ్‌ను పదే పదే చూపిస్తున్నాడు. 'చూశావా.. దేశం కోసం మనం ఈ త్యాగం చేయాల్సిందే, ఇప్పటి నుంచి ఏడాది పాటు నన్ను బంగారం అడగొద్దు' అని ఆయన చెప్పిన డైలాగులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. జేబుకు పడే చిల్లు తప్పిందని నెట్టింట కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
ట్రెండింగ్‌లో 'హ్యాపీ హస్బెండ్స్' రీల్స్:
ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో రకరకాల సెటైరికల్ రీల్స్ రాజ్యమేలుతున్నాయి. 'మోదీ గారు మా కష్టాలు గుర్తించారు', 'భర్తల పక్షపాతి ప్రధాని' అంటూ నెటిజన్లు ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. విదేశీ విహారయాత్రలు కూడా వద్దన్నారు కాబట్టి, ఈ ఏడాది పెళ్లి రోజులకు కేవలం 'పానీపూరీ'తో సరిపెట్టేయచ్చని కొందరు జోకులు పేల్చుతున్నారు. రూపాయి విలువ కాపాడటం ఏమో కానీ, భర్తల బ్యాంక్ బ్యాలెన్స్‌కు మాత్రం మోదీ గారు రక్షణ కవచంలా మారారని సెటైర్లు వేస్తున్నారు.
ప్రధాని మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం దేశ ఆర్థిక భద్రత. కానీ అది కాస్తా భర్తలకు వినోదాన్ని, భార్యలకు నిరాశను మిగిల్చింది. ఏది ఏమైనా, "దేశం కోసం బంగారం కొనడం ఆపేద్దాం" అనే నినాదం ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఇక ఈ ఏడాది పాటు నగల షాపుల కంటే భర్తల మొహాల్లోనే ఎక్కువ మెరుపు కనిపిస్తుందనడంలో సందేహం లేదు.
— Kiran (@KiranChauhanIND)
May 12, 2026
లాక్ డౌన్ అంటే అంతా హడలిపోతారు. 2020లో కోవిడ్ పుణ్యమాని యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. మహమ్మారి ప్రభావంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సివచ్చింది. అలాంటి సమయంలో ఐటీ రంగం మాత్రం యథావిధిగా పనిచేసింది. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే విధానం మొదలైంది. ఆ తర్వాత కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కొనసాగించినా, చాలా కంపెనీలు మాత్రం ఉద్యోగుల పని సామర్థ్యం పెంచే ఉద్దేశంతో ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చిచెప్పాయి. దీంతో ఇప్పుడు 90 శాతం కంపెనీలు మళ్లీ ఆఫీసు డ్యూటీలే వేస్తున్నాయి. అయితే తాజాగా చమురు సంక్షోభంతో దాదాపు అన్ని ఐటీ కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రం హోం విధానానికి మళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయని అంటున్నారు.
చమురు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్క సంస్థ వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేయాలని ప్రధాని మోదీ తాజాగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పొదుపుగా వాడాలని, మెట్రో సేవలు ఎక్కువగా వినియోగించుకోవాలని, కార్ పూలింగ్ కు ప్రాధాన్యమివ్వాలని, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని సూచించారు. కొవిడ్ సమయంలో అలవాటు పడిన వర్క్ ఫ్రం హోమ్, వర్చవల్ మీటింగులు, వీడియో కాన్ఫరెన్సింగ్ లను మళ్లీ విస్తృతంగా అమలు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
దీంతో ఐటీ రంగం మొదటగా స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గంచడమే లక్ష్యంగా ఐటీ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు నాస్కామ్ ప్రకటించింది. నిరంతరం మారుతున్న భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని నాస్కామ్ ఆ ప్రకటనలో వెల్లడించింది. చాలా కంపెనీలు క్యాంపస్ లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నాయని స్పష్టం చేసింది. అవసరం లేని విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా కొన్ని సౌకర్యాలను పరిమితం చేస్తున్నట్లు వివరించింది.
రిమోట్ లేదా హైబ్రిడ్ విధానాలతో ఉద్యోగుల రోజువారీ ప్రయాణాలను తగ్గించి, తద్వారా ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు నాస్కామ్ ప్రకటించింది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే హైదరాబాద్, పుణే, బెంగళూరు, చెన్నై నగరాల్లో వ్యక్తిగత వాహనాల వినియోగం వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం ఎక్కువగా జరుగుతోందని అంటున్నారు. దీంతో అవకాశం ఉన్న ప్రతిచోటా వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేయాలని ఐటీ ఉద్యోగుల సంఘమైన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు కేంద్రం అధికారిక అడ్వజయిరీ జారీ చేయాలని ఆ లేఖలో కోరింది.
మరోవైపు ఇంధన వ్యయం పెరుగుతుండటం వల్ల కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం విధానానికి మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. భారీ క్యాంపస్ లు నిర్వహించే కంపెనీలు విద్యుత్, డీజిల్ జనరేటర్ వినియోగం, ఉద్యోగుల ట్రాన్స్ పోర్టు ఖర్చులను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా తిరిగి వర్క్ ఫ్రం హోం ప్రవేశపెట్టే ఆలోచనల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్రం కూడా వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించేలా నిబంధనలు తీసుకువచ్చే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఐటీ ఉద్యోగులు మళ్లీ ఇంటి వద్ద పని చేసుకునే పరిస్థితి వస్తోందని అంటున్నారు.
సోషల్‌ మీడియాలో నటీనటుల గురించి పుకార్లు, ఆరోపణలు, విమర్శలు అనేవి కామన్‌గా వినిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వాటి పరిధి హద్దులు దాటుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. నటీనటుల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసే విధంగా విమర్శలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సెలబ్రిటీల జీవితాల గురించి కామెంట్‌ చేయడం ద్వారా పాపులారిటీ వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది విమర్శలు చేస్తున్న విషయం ఈ మద్య కాలంలో చాలా కామన్‌ విషయం అయ్యింది. యంగ్‌ స్టార్స్‌ పై మాత్రమే కాకుండా సీనియర్స్ పైనా అసభ్యకర కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ సీనియర్ నటి నీలిమా అజీమ్‌ పై విషం కక్కుతూ ఉన్నారు. ఆమె మూడు పెళ్లిల విషయాన్ని చాలా మంది ట్రోల్‌ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
షాహిద్‌ కపూర్‌ తల్లి నీలిమా అజీమ్‌...
బాలీవుడ్‌ స్టార్‌ నటుడు షాహిద్‌ కపూర్ తల్లి అయిన నీలిమా అజీమ్‌ మూడు పెళ్లిల గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం హద్దులు దాటింది. ఆమె కేవలం డబ్బు కోసం ముగ్గురిని వివాహం చేసుకుందని, ఆమె పెళ్లి చేసుకున్న ప్రతిసారి డబ్బు ప్రధానంగానే బంధం ఏర్పడిందనే విమర్శలు వస్తున్నాయి. బంధాలు బంధుత్వం కంటే కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నీలిమా అజీమ్‌ మూడు సార్లు వివాహం చేసుకుందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి సోషల్‌ మీడియాలో మరిన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తన గురించి చాలా కాలంగా వినిపిస్తున్న విమర్శలకు నీలిమా అజీమ్‌ స్పందించారు. ఇప్పటికే చాలా దారుణంగా తన గురించి ప్రచారం చేస్తున్నారు, ఇప్పటికి అయినా స్పందించాలని తాను అనుకుంటున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేసింది.
సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు...
నీలిమా అజీమ్ మాట్లాడుతూ... తన పెళ్లి విషయమై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి షాక్ అయ్యాను. ఇప్పటి వరకు తాను పెళ్లి చేసుకున్న ముగ్గురు సైతం నిరాడంబరమైన జీవితాన్ని సాగించే వారు. వారి యొక్క గొప్పతనం చూసి పెళ్లి చేసుకున్నాను. వారి ఆస్తి గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదు. నేను బౌతిక సంపద గురించి ఎప్పుడూ చూడలేదు. నా జీవితం కోసం పెట్టుబడి పెట్టే వారి కోసం నేను చూడలేదు. నేను నటిగా బాగానే సంపాదించాను. ఒకరి సంపాదనపై జీవితాన్ని సాగించాల్సిన అవసరం నాకు లేదు. నా జీవితం, నా సినీ జీవితం తెలిసిన వారు ఏ ఒక్కరూ డబ్బు కోసం నేను పెళ్లిలు చేసుకోను అనుకోరు. కానీ మీడియాలో కొందరు పూర్తిగా నా గురించి తెలియక పోవడం వల్ల ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. నా కెరీర్‌ లో సాధించిన విజయాలను గురించి కాకుండా నా వ్యక్తిగత విషయాల గురించి కొందరు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇషాన్ ఖట్టర్ తల్లి...
నీలిమా అజీమ్‌ మొదట పంకజ్ కపూర్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ షాహిద్‌ కపూర్‌ జన్మించారు. వ్యక్తిగత కారణాల వల్ల నీలిమా, పంకజ్ విడాకులు తీసుకున్నారు. పంకజ్‌ కపూర్‌తో విడిపోయిన తర్వాత కొన్నాళ్ల వరకు నీలిమా సింగిల్‌గానే జీవితాన్ని సాగించింది. కొన్నాళ్ల తర్వాత రాజేష్‌ ఖట్టర్‌తో ప్రేమలో పడింది. అతడిని వివాహం చేసుకుంది. నీలిమా, రాజేష్ ఖట్టర్‌ తనయుడు ఇషాన్ ఖట్టర్‌. ఇతడు బాలీవుడ్‌ హీరో అనే విషయం తెల్సిందే. రాజేష్ ఖట్టర్‌తోనూ కొన్ని విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నీలిమా చివరకు ఉస్తాద్‌ రజా అలీ ఖాన్‌ ను వివాహం చేసుకుంది. 2004లో రజా అలీని వివాహం చేసుకున్న నీలిమా అతడి నుంచి 2009లో విడి పోయింది. ప్రస్తుతం ఆమె సింగిల్‌గానే ఉంటున్నారు. 67 ఏళ్ల నీలిమా మళ్లీ పెళ్లి చేసుకుంటారు అనే టాక్‌ ఉంది. ఆ వార్తలపై మాత్రం తాజా ఇంటర్వ్యూలో స్పందించలేదు.
ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమ ఓ చారిత్రాత్మక మార్పుకు సాక్షిగా నిలుస్తోంది. దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన దళపతి విజయ్ రాజకీయ పార్టీ తమిళ వెట్రి కళగం స్థాపనతో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ఇటీవ‌లే జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచి ముఖ్య‌మంత్రి పీఠంపై కుర్చున్నారు. ఇక‌పై విజ‌య్ జీవితం ప్ర‌జా సేవ‌కేన‌ని తేలిపోయింది. ఆయ‌న మ‌ళ్లీ మ్యాక‌ప్ వేసుకోవ‌డం అన్న‌ది దాదాపు అసాధ్య‌మే. అయితే రజనీకాంత్ తర్వాత మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న ఏకైక హీరోగా విజయ్ స్థానాన్ని భర్తీ చేసే తదుపరి దళపతి ఎవరు అనేది ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
సాధారణంగా విజయ్‌కు గట్టి పోటీ ఇచ్చే హీరో అజిత్ కుమార్. ఇద్ద‌రి మధ్య ఉండే `తల-దళపతి` పోరు కోలీవుడ్ బాక్సాఫీస్‌కు ప్రధాన ఆదాయ వనరు. అయితే అజిత్ ప్రస్తుతం తన దృష్టిని సినిమాల కంటే ఎక్కువగా కార్ రేసింగ్ , వరల్డ్ టూర్ల పైనే పెడుతున్నారు. ఆయన ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా గగనంగా మారుతున్న తరుణంలో విజయ్ వదిలి వెళ్తున్న భారీ కమర్షియల్ మార్కెట్‌ను అజిత్ ఒంటిచేత్తో నడిపిస్తారా? అనేది అనుమానంగానే ఉంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు నటన పరంగా అసాధారణ ప్రతిభ ఉన్న సూర్య, విక్రమ్, ధనుష్ వంటి హీరోలు రేసులో ఉన్నారు.
ధనుష్ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తూ గ్లోబల్ గుర్తింపు పొందుతున్నారు. విక్రమ్ ప్రయోగాత్మక చిత్రాలతో ఎప్పుడూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. అయితే విజయ్ సాధించిన మాస్ అప్పీల్, ఓపెనింగ్ డే కలెక్షన్ల రేంజ్ అందుకోవడం ప్ర‌తీసారి సవాలుగానే మారుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమను ఇప్పటికీ సీనియర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్లే ముందుండి నడిపిస్తున్నారు. `జైలర్`, `విక్రమ్`వంటి విజ‌యాల‌తో తాము ఇంకా బాక్సాఫీస్ కింగ్‌లమే అని నిరూపించుకున్నారు. కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే యువ తరం హీరోల్లో శివకార్తికేయన్ వంటి వారు విజయ్ బాటలో నడుస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువవుతున్నారు.
విజయ్ వదిలిన స్థానాన్ని కేవలం ఒక హీరో మాత్రమే భర్తీ చేయడం సాధ్యం కాదని అది పలువురు హీరోల మధ్య పంపిణీ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ ఇమేజ్ అనేది సినిమాలకే పరిమితం కాలేదు. ఆయనకున్న అభిమాన సంఘాలు ఒక సైన్యంలా పని చేస్తాయి. అలాంటి బలమైన పునాది కలిగిన స్టార్ ఇమేజ్‌ను సంపాదించడం ఏ హీరోకైనా దశాబ్దాల సమయం పడుతుంది. తమిళనాట సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు. అది రాజకీయాలకు కూడా సోపానం. అందుకే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ఏర్పడే ఖాళీని పూడ్చడానికి నిర్మాతలు సైతం కొత్త వ్యూహాలను రచించాల్సి వస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలకు గ్యారెంటీ ఇచ్చే స్టార్ కోసం కోలీవుడ్ వెతుకులాట మొదలైంది.
This vibrant photograph of Pujita Ponnada in a striking green bikini captures her confident and radiant personality beautifully.
Pujita Ponnada, born on October 5, 1991, in Visakhapatnam, Andhra Pradesh, is a popular Indian actress and model who primarily works in Telugu and Tamil cinema. She began her career with modelling and short films before making her feature film debut with Darsakudu (2017).
She gained widespread recognition with her impressive supporting role as Rangammatalli in the blockbuster Rangasthalam (2018) opposite Ram Charan. Her other notable films include Kalki (2019), Aakasa Veedhullo (2022) as a female lead, Jolly O Gymkhana (2024), and Konjam Kadhal Konjam Modhal (2025).
Pujita has several exciting projects lined up, including Desingu Raja 2 (2025) as Chandralekha, Hari Hara Veera Mallu (2025) alongside Pawan Kalyan, Padaiyaanda Maaveeraa (2025), and Yogi Da (2026). With her natural acting skills, elegant screen presence, and dedication, Pujita Ponnada continues to shine in South Indian cinema.
Photos Courtesy: Instagram
This fierce and glamorous photograph of Alaya F perfectly embodies her confident persona and hard-earned success.
मेहनत का फल The dream team:
Photos by @amannagoshe
Styled by @sheefajgilani
Make up by @reshmaamerchant
Hair by @sandeepchaupal_hair
Videos by @thehunkybear
Styling assisted by @amisha.thakkarr
Born Aalia Furniturewalla on November 28, 1997, Alaya F is the daughter of actress Pooja Bedi and granddaughter of Kabir Bedi. She made her acting debut in 2020 with the comedy-drama Jawaani Jaaneman opposite Saif Ali Khan, winning the Filmfare Award for Best Female Debut.
She proved her versatility with the psychological thriller Freddy (2022) opposite Kartik Aaryan, Almost Pyaar with DJ Mohabbat (2023), U-Turn (2023), Bade Miyan Chote Miyan (2024), and the inspiring biopic Srikanth (2024) alongside Rajkummar Rao.
Alaya has several exciting projects lined up, including the high-profile thriller series Storm (produced by Hrithik Roshan). With her dedication, bold choices, and striking screen presence, she continues to carve a powerful niche in Bollywood.
Photos Courtesy: Instagram
This stunning image of Rakul Preet Singh perfectly captures her elegance and confidence.
“I looked at the camera and suddenly this happened ”
#PatiPatniAurWohDo in cinemas on 15th May
Born on October 10, 1990, in New Delhi, Rakul Preet Singh is a versatile actress who predominantly works in Telugu, Hindi, and Tamil films. She started as a model and made her acting debut with the Kannada film Gilli (2009). Her breakthrough came in Telugu cinema with films like Venkatadri Express (2013) and Loukyam (2014), earning her multiple Filmfare Award nominations.
She made her Bollywood debut with Yaariyan (2014) and has since delivered memorable performances in De De Pyaar De (2019), Chhatriwali (2023), Ayalaan (2024), Mere Husband Ki Biwi (2025), and De De Pyaar De 2 (2025).
Rakul continues to shine with her upcoming projects including the much-awaited comedy Pati Patni Aur Woh Do releasing on 15th May 2026, Indian 3, and the epic Ramayana (as Surpanakha) in 2026. With her charm, fitness, and acting prowess, Rakul Preet Singh remains one of the most loved and bankable actresses in Indian cinema.
Photos Courtesy: Instagram
కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం గందరగోళం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంపికపై తేల్చుకోలేకపోతోంది. మెజార్టీ శాసనసభ్యుల అభిప్రాయాలు తెలుసుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకోవడంలో హైకమాండ్ నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం దాటినా సీఎం ఎంపికపై తుది నిర్ణయం తీసుకోకపోవడం, ఇంకా అభిప్రాయ సేకరణ అంటూ కాలయాపన చేయడంపై క్షేత్రస్థాయి కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి ధోరణి వల్లే పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెంచలేకపోతున్నామని ఇతర రాష్ట్రాల నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
గత నెలలో జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 4న ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 63 సీట్లలో విజయం సాధించింది. ఆ పార్టీ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమి 102 చోట్ల గెలిచి తిరుగులేని మెజార్టీ సొంతం చేసుకుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 చోట్ల మాత్రమే గెలిచింది. ఇంత స్పష్టమైన మెజార్టీ సాధించినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఒక నిర్ణయానికి రాలేకపోతోందని అంటున్నారు.
కేరళం సీఎం పదవికి కాంగ్రెస్ లో ముగ్గురు నేతలు పోటీపడుతుండగా, ప్రధానంగా గత అసెంబ్లీలో విపక్ష నేతగా పనిచేసిన వీడీ సతీషన్, పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మధ్యే పోటీ నెలకొందని చెబుతున్నారు. గత ఐదేళ్లు విపక్ష నేతగా పార్టీని బలోపేతం చేయడంతోపాటు గత ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెంచి, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో సీనియర్ నేత వీడి సతీషన్ పట్టు సాధించారని అంటున్నారు. కూటమిలోని ఇతర మిత్రపక్షాలు సైతం సతీషన్ అభ్యర్థిత్వంపైనే మొగ్గుచూపుతున్నాయని అంటున్నారు. అయితే అధిష్టానం మాత్రం తనకు బాగా సన్నిహితుడైన పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వైపు మొగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం ఎంపికపై ప్రతిష్ఠంభన నెలకొందని అంటున్నారు.
కేరళంతోపాటు ఎన్నికలు జరిగిన మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే, కేరళంలో మాత్రం ఇంకా శాసనసభాపక్ష సమావేశమే నిర్వహించకపోవడం కాంగ్రెస్ పరిస్థితిని అద్దం పడుతోందని అంటున్నారు. హైకమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సమస్య ఉండదని నేతలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల మనోభీష్టానికి భిన్నంగా అధిష్టానం ఆలోచనలు ఉండటంతోనే ప్రకటన చేయడంలో ఆలస్యం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇక క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. అధిష్టానం తీరు వల్ల ఎన్నికల్లో గెలిచినా, ప్రజల ముందు ఓడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఛాన్స్ రావాలే గానీ ప్ర‌పంచంలో ఏ భాష‌లోనైనా న‌టించ‌డానికి భార‌తీయ న‌టీమ‌ణులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అవ‌కాశం వ‌స్తే వెళ్ల‌డానికి హీరోలు ఆలోచిస్తారేమో గానీ హీరోయిన్లు మాత్రం క‌ళ్లు మూసుకుని బోర్డ‌ర్ దాటేస్తుంటారు.
ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఆలియా భట్ వంటి అగ్ర కథానాయికలు హాలీవుడ్ తెరపై మెరిసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో గ్లామర్ బ్యూటీ దిశా పటానికి చేరుతుంది. తన విలక్షణమైన నటనతో అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ప్రేక్షకులను అలరించిన అమ్మ‌డు ఇప్పుడు హాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ద‌మవుతోంది.
అమ్మ‌డు తన అంతర్జాతీయ ప్రయాణాన్ని`ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్` అనే భారీ ప్రాజెక్టుతో ప్రారంభింస్తుంది. ఇదొక‌ హై-యాక్షన్ , సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం. సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దిశా హాలీవుడ్ చిత్రంలో మాత్రం నటనకు, యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం అమ్మ‌డు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంద‌ని తెలిసింది. భారతీయ నటి హాలీవుడ్ వరకు వెళ్లడం అనేది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.
ఇలాంటి అచీవ్ మెంట్స్ భారతీయ సినిమా ఎదుగుదలకు నిదర్శనం. గతంలో ప్రియాంక చోప్రా `క్వాంటికో, `బేవాచ్` చిత్రాలతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సంగ‌తి తెలిసిందే. అటుపై దీపికా ప‌దుకొణే `ట్రిపుల్ ఎక్స్` సిరీస్‌తో హాలీవుడ్ లో అల‌రించారు. ఆలియా భట్ సైతం `హార్ట్ ఆఫ్ స్టోన్` మూవీతో హాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. దిశా పాట్నీ కూడా అదే బాటలో పయనిస్తూ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని ఆశిస్తుంది. దిశా పాట్నీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతర్జాతీయ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్‌గా మారనుంది.
సొగ‌స‌రి ఫిట్‌నెస్ వీడియోలు ,మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. `ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్` సినిమాలో ఆమె స్వయంగా కొన్ని రిస్కీ స్టంట్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ తన నటనను నిరూపించుకోవడమే కాక‌ భారతీయ నటీమణులు ఏ విధమైన కఠినమైన పాత్రలనైనా పోషించగలరని ప్రపంచానికి చాటి చెప్పడమే తన లక్ష్యమని ఓ సందర్భంలోనూ ఓపెన్ అయింది. ప్రస్తుతం భారతీయ నటీమణులకు హాలీవుడ్‌లో మంచి అవకాశాలొస్తున్నాయి. కథలో చిన్న భాగంలా కాకుండా,కీలకమైన పాత్రలను దక్కించుకుంటున్నారు.
దిశా పాట్నీ ఎంపిక చేసుకున్న సైన్స్ ఫిక్షన్ జోనర్ కెరీర్‌కు ఓ కొత్త దిశను ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్ర విజయంతో అమ్మ‌డికి అంతర్జాతీయ వేదికపై మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌కు అనుగుణంగా దిశ‌ తన బాడీ లాంగ్వేజ్‌ను, నటనను ఎలా మలుచుకుంటుందో? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం అమ్మ‌డు బాలీవుడ్ లో కూడా కొన్ని ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే.
ప్రపంచాన్ని మరో కొత్త వైరస్ భయం వణికిస్తోంది. 'ఎంవీ హోండియస్' అనే క్రూయిజ్ షిప్‌లో మొదలైన హాంటావైరస్ కలకలం ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటుతోంది. ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోగా, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అసలు ఈ వైరస్ ఎంత ప్రమాదకరం? ఎలుకల ద్వారా ఇది ఎలా వ్యాపిస్తుంది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
క్రూయిజ్ షిప్‌లో మొదలై:
2026 ఏప్రిల్‌లో అర్జెంటీనా నుంచి బయలుదేరిన 'ఎంవీ హోండియస్' అనే ఓడలో ఈ వైరస్ మొదటిసారి బయటపడింది. అక్కడ మొదలైన ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. ఇక ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఓ ఫ్రెంచ్ మహిళకు, అమెరికన్ వ్యక్తికి కూడా పాజిటివ్ రావడంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి.
ఇది మనుషుల నుంచి వ్యాపిస్తుందా?:
అదృష్టవశాత్తూ, హాంటావైరస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంత త్వరగా సోకదు. మనం మామూలుగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా లేదా ఒకరినొకరు తాకినా ఇది వ్యాపించదు. ఇక సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకారం, ఇది ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. అంటే వైరస్ ఉన్న ఎలుకల విసర్జితాలు గాలిలో కలిసినప్పుడు, ఆ గాలిని మనం పీల్చడం వల్ల ఈ ప్రమాదం పొంచి ఉంటుంది.
ఎలుకలే అసలైన విలన్లు
ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఎలుకలే. ఎలుకల మూత్రం, మల విసర్జితాలు లేదా అవి గూడు కట్టుకునే పదార్థాలను మనం శుభ్రం చేస్తున్నప్పుడు, అందులోని చిన్న చిన్న వైరస్ కణాలు గాలిలోకి చేరతాయి. అరుదుగా ఎలుకలు కరిచినా లేదా అవి తిరిగిన చోట మనం తాకి ఆ చేతులతో నోరు, ముక్కు ముట్టుకున్నా ఇన్ఫెక్షన్ సోకే ఛాన్స్ ఉంది. ఇక అందుకే ఇంట్లో, గ్యారేజీలు శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఈ వైరస్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది?:
హాంటావైరస్ ప్రపంచవ్యాప్తంగా ఉంది, కానీ ప్రాంతాన్ని బట్టి దీని ప్రభావం మారుతుంది. అమెరికా దేశాల్లో ఇది ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. ఇక యూరప్, ఆసియా దేశాల్లో అయితే కిడ్నీలకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. ఇక ముఖ్యంగా పొలాలు, పాత కొట్లు,దట్టమైన అడవులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారు ఈ వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.
లక్షణాలు ఎలా ఉంటాయి?:
వైరస్ సోకిన వారం నుంచి ఎనిమిది వారాల లోపు లక్షణాలు బయటపడతాయి. మొదట్లో జ్వరం, అలసట, ఒళ్లు నొప్పులు వంటి సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. కానీ 4 నుంచి 10 రోజుల తర్వాత పరిస్థితి విషమిస్తుంది. ఇక ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం ఈ స్టేజ్ చాలా ప్రమాదకరమైనది, మరణాల రేటు కూడా ఎక్కువే.
ఇక వైరస్ సోకిన తర్వాత భయపడటం కంటే రాకుండా చూసుకోవడమే మేలు. మన ఇల్లు, పరిసరాల్లో ఎలుకలు ఉండకుండా చూసుకోవడం, పాత సామాన్లను శుభ్రం చేసేటప్పుడు మాస్క్ ధరించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనల్ని కాపాడతాయి. ఇక ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మర్చిపోవద్దు. జాగ్రత్త అవసరం.
వీఎఫ్‌ఎక్స్‌ టెక్నాలజీ పెద్దగా అందుబాటులోకి రాని సమయంలోనే దర్శకుడు కోడిరామకృష్ణ అద్భుతమైన విజువల్ వండర్‌లను ఆవిష్కరించిన విషయం తెల్సిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు గ్రాఫిక్స్ సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసేవి. బాలీవుడ్‌ సినిమాల్లో సైతం చూడని గ్రాఫిక్స్‌ను దర్శకుడు కోడిరామకృష్ణ తన సినిమాల్లో చూపించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎవర్‌ గ్రీన్‌ సినిమాల్లో 'దేవిపుత్రుడు' సినిమా ఒకటి. ఈ సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ అప్పుడు సినిమా కోసం వాడిన టెక్నాలజీ, సినిమాలో చూపించిన విషయాల కారణంగా మంచి పేరు తెచ్చుకుంది. దేవి పుత్రుడు సినిమా ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైన సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలోని మ్యూజిక్‌, లవ్‌ సీన్స్‌, పాపతో ఉన్న సీన్స్, నీటిలో ఉండే సీన్స్‌, ద్వారక ఇలా ప్రతీది సినిమాకు చాలా స్పెషల్‌గా నిలిచింది.
నిర్మాత ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ...
ఇండియన్‌ సినీ చరిత్రలోనే అలాంటి సబ్జెక్ట్‌ను తీసుకుని వచ్చిన సినిమాలు అప్పటి వరకు లేక పోవడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమా క్లైమాక్స్‌ తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా ఆరంభం నుంచి సాఫీగా సాగింది. ఒక మంచి ఫీల్‌తో సాగే సినిమాకు క్లైమాక్స్ పెద్ద స్పీడ్‌ బ్రేకర్‌గా ఉంటుంది. ఆ క్లైమాక్స్‌ కారణంగా సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్‌గా నిలిచింది అని చాలా మంది విశ్లేషకులు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. తాజాగా మరోసారి ఆ విషయమై నిర్మాత ఎంఎస్‌ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తన సినిమాల్లో దేవిపుత్రుడు చాలా స్పెషల్‌ అని ఆయన అంటూ ఉంటాడు. నిర్మాతగా ఆ సినిమా భారీ నష్టం మిగిల్చినప్పటికీ ఒక సంతృప్తిని ఇచ్చిందని అంటారు. తాజాగా ఎంఎస్‌ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవిపుత్రుడు సినిమా ఫ్లాప్‌ కు సంబంధించిన కారణంను చెప్పుకొచ్చాడు.
వెంకటేష్ దేవిపుత్రుడు సినిమా...
ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ... దేవిపుత్రుడు సినిమా స్క్రిప్ట్‌ అంతా రెడీ అయిన తర్వాత వెంకటేష్‌ గారి వద్దకు వెళ్లాము. ఆయన స్క్రిప్ట్‌ అంతా విన్న తర్వాత చివరి 45 నిమిషాలు కొంచెం తేడాగా ఉంది, మార్చిన తర్వాత షూటింగ్‌కి వెళ్దాం అన్నారు. క్లైమాక్స్‌ ను మార్చేందుకు కోడి రామకృష్ణ గారితో తాను చాలా చర్చలు జరిపాం. పలువురు రచయితలను సంప్రదించాం. కానీ ఏ క్లైమాక్స్ సెట్‌ కావడం లేదు. దాంతో మొదట అనుకున్న క్లైమాక్స్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ కథకు తగ్గ క్లైమాక్స్‌ను రెడీ చేయలేక పోయాం. ఆ విషయాన్న వెంకటేష్ గారికి చెప్పి ఒప్పించి షూటింగ్‌ మొదలు పెట్టాం. వెంకటేష్ గారు పూర్తిగా ఇష్టం లేకుండానే షూటింగ్‌కి వచ్చారు. ఆయన భావించినట్లుగానే చివరి 45 నిమిషాల విషయంలోనే తేడా కొట్టింది. ఆయన చెప్పినట్లుగా కాస్త సమయం తీసుకుని క్లైమాక్స్ మార్చి ఉంటే బాగుండేదని ఆ తర్వాత అనిపించిందని అన్నాడు.
దేవిపుత్రుడు సినిమా బాక్సాఫీస్‌...
కోడి రామకృష్ణ సైతం క్లైమాక్స్ విషయంలో చాలా స్ట్రగుల్‌ అయ్యారు. కానీ చివరకు ఆయన మొదట రాసుకున్న క్లైమాక్స్‌ కే వెళ్లాల్సి వచ్చింది. దేవిపుత్రుడు సినిమాలో నటీనటులు ఎంపిక విషయమై ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు క్లైమాక్స్ విషయంలోనే తప్పు చేశాడు అంటూ చాలా మంది ఇప్పటికీ కామెంట్‌ చేశారు. సినిమా గ్రాఫిక్స్ కోసం ఆయన పడ్డ కష్టం గురించి కూడా గతంలో నిర్మాత మాట్లాడుతూ నిద్ర లేని రాత్రులు గడిపినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడు తీస్తున్న సినిమాల రేంజ్‌లో దేవిపుత్రుడు సినిమాకు ఆడే సత్తా ఉందని, క్లైమాక్స్ కారణంగానే సినిమా పోయింది అనేది విశ్లేషకుల మాట. అప్పుడు వెంకటేష్ అన్నట్లుగా కాస్త క్లైమాక్స్‌ ను మార్చి ఉంటే తప్పకుండా కమర్షియల్‌గా బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల జాబితాలో నిలిచేది. సినిమాకు డివైడ్ టాక్‌ వచ్చినప్పటికీ 60 సెంటర్స్‌లో 50 రోజులు, 3 సెంటర్స్‌ లో 100 రోజులు నడిచింది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు రూ.5 కోట్ల వసూళ్లు నమోదు అయినట్లు సమాచారం.
Actress Tabu is having a successful year in her career. Her recent film Bhooth Bungalow became a huge box office hit by crossing 200 crores worldwide. Along with this success, she is also getting ready for an exciting Telugu movie titled "Slumdog: 33 Temple Road". Recently, Tabu grabbed everyone’s attention after appearing on the cover of "Harper’s Bazaar India" magazine in three completely different looks.
In the magazine interview, Tabu shared her thoughts about life, freedom, and staying true to herself. She explained that she never tried to follow what society expected from her. Instead, she always listened to her own heart and made choices that gave her peace and happiness. According to her, real freedom comes when a person is comfortable with their own decisions.
One of the biggest highlights of the photoshoot was Tabu’s stylish appearance. In one look, she wore a denim jacket with a long black skirt that gave a bold and artistic feel. In another look, she appeared in a simple ivory gown that showed elegance and grace. She also wore a bright coral-colored dress in front of a red background, which looked powerful and eye-catching. Every picture showed her confidence and natural charm.
During the interview, Tabu also spoke about how people often label women unfairly. She said many people called her "reclusive" over the years, but she never agreed with that description. Tabu explained that just because she does not attend every party or constantly stay in the public eye does not mean she is distant from people. She believes society creates labels for women who choose a different lifestyle.
The actress also talked openly about ageing. She said people worry more about a woman’s age than the woman herself. According to Tabu, ageing is a natural process and there is nothing to hide or fear about it. She believes confidence, experience, and self-understanding become stronger with time.
Photos Courtesy: Instagram
This confident and stylish photograph of Ketika Sharma highlights her glamorous appeal and charismatic persona as she poses in a chic crop top and jeans.
Ketika Sharma (born December 24, 1995, in New Delhi) is a talented Indian actress, model, and influencer who primarily works in Telugu cinema. She gained early popularity through Dubsmash videos and music promos before transitioning to acting.
She made her acting debut with the Telugu romantic film Romantic (2021) opposite Akash Puri. Her notable performances include Lakshya (2021), Ranga Ranga Vaibhavanga (2022) opposite Panja Vaisshnav Tej, and the blockbuster Bro (2023) alongside Pawan Kalyan and Sai Dharam Tej, which became her highest-grossing release. She also made her Hindi film debut with Vijay 69 (2024).
Her ongoing and upcoming projects include the romantic comedy #Single (2025) as Purva, Robinhood (2025) with Nithiin (special appearance), Meesaya Murukku 2 (2026) in Tamil cinema, and Bhartha Mahasayulaku Wignyapthi (2026).
With her striking looks, dance skills, and growing versatility, Ketika Sharma is steadily establishing herself as a promising star in South Indian films.
Photos Courtesy: Instagram
తమిళనాడు రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్గత విభేదిలతో విపక్ష అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంతో విభేదిస్తూ సీనియర్ నేత షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామంతో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ బలం 150కి చేరుకుంది. ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయాలతో అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయిందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ సీనియర్ నేత షణ్ముగం ప్రకటన చేశారు.
నిజానికి అన్నాడీఎంకేలో సంక్షోభంపై సోమవారమే మీడియాలో కథనాలు వచ్చాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా మాజీ సీఎం పళనిస్వామిని ఎన్నుకునే విషయంలో సీనియర్ నేతలు ఎస్పీ వేణుమణి, షణ్ముగం విభేదించారు. ఆ ఇద్దరి నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకోనున్నట్లు సంకేతాలిచ్చారు. పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా చేయాలంటూ కేవలం 17 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయగా, మిగిలిన 30 మంది వేణుమణికి మద్దతు ప్రకటించారు. వేణుమణిని తమ శాసనసభ పక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ అధికారులకు లేఖలు సమర్పించారు. షణ్ముగం ను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకున్నట్లు ఆ లేఖలో తెలిపారు.
ఇక మంగళవారం పార్టీలో పళనిస్వామి వర్గం నుంచి తాము విడిపోతున్నట్లు బహిరంగంగా సీనియర్ నేత షణ్ముగం చేసిన ప్రకటనతో కలకలం రేగింది. అంతేకాకుండా తమ వర్గం ఎమ్మెల్యేలు ఎన్డీఏ నుంచి కూడా బయటకు వస్తున్నట్లు వెల్లడించారు. పదేళ్లుగా పార్టీ వరుస ఓటములకు ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కారణమని ఆయన ఆరోపించారు. పార్టీ పదవి నుంచి పళనిస్వామి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈపీఎస్ చేతుల్లో నుంచి పార్టీని తాము కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
కాగా, ఏఐడీఎంకేలో చీలికను ముందు నుంచి ఊహించిందేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో టీవీకే గెలిచినా, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ రాకపోవడంతో ముందుగా మద్దతు ప్రకటించాలని అన్నాడీఎంకేలో మెజార్టీ ఎమ్మెల్యేలు భావించినట్లు చెబుతున్నారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం చిరకాల ప్రత్యర్థి డీఎంకే మద్దతు తీసుకుని అధికారం చేపట్టాలని భావించిందని అంటున్నారు. డీఎంకేతో చిరకాల వైరం పక్కన పెట్టాలని భావించడం, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి క్లీన్ ఇమేజ్ ఉన్న విజయ్ ని తొక్కిపెట్టాలని నిర్ణయించడంపై మెజార్టీ ఎమ్మెల్యేలు విభేదించినట్లు చెబుతున్నారు. ఈ కారణంగానే మాజీ సీఎం ఈపీఎస్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ పక్షాన నిలవాలని వారంతా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇక అన్నాడీఎంకే పరిణామాలతో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి పూర్తి స్థిరత్వం వచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
హాలీవుడ్ కమెడియన్ కం నటుడు కెవిన్ హార్ట్ జీవితంలో మర్చిపోవాలనుకున్న ఓ పాత సంఘటన మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఇటీవల జరిగిన నెట్‌ఫ్లిక్స్ టామ్ బ్రాడీ రోస్ట్ షోలో ఫుట్‌బాల్ స్టార్ టామ్ బ్రాడీపై జోకులు వేస్తున్న క్రమంలో కెవిన్ హార్ట్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన 2017 వివాదాన్ని సహచర కళాకారులు ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో పాత ఉదంతం మ‌రోసారి చర్చనీ యాంశమైంది. సెలబ్రిటీల జీవితంలో గతం ఎప్పుడూ వారిని వెంటాడుతూనే ఉంటుందని ఈ ఘటన మ‌రోసారి నిరూపించింది. 2017లో ఏం జరిగిందనే విష‌యంలోకి వెళ్తే..
కెవిన్ హార్ట్ తన భార్య ఎనికో పారిష్ ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న సమయంలో లాస్ వేగాస్‌లో ఓ మహిళతో అక్ర‌మ‌ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో హార్ట్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ సమయంలో ఎవరో ? తనను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తన తప్పుకు క్షమాపణలు చెబుతున్నానని బహిరంగంగా ఓ వీడియో కూడా విడుదల చేశాడు. ఆ వివాదం అప్పట్లో హాలీవుడ్ మీడియాలో పెను సంచలనం సృష్టించింది. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు భార్య - పిల్లలకు తాను చేసిన అన్యాయానికి గానూ ఎంతో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
`నేను నా జీవితంలో తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం ఇదే` అని తరువాతి కాలంలో తన డాక్యు మెంటరీలో కూడా అంగీకరించారు. అయితే ఆయన భార్య ఎనికో పారిష్ ఆ కష్టకాలంలో ఆయనను క్షమించి, తమ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. తాజాగా ఏడేళ్ల తర్వాత ఓ కామెడీ షోలో భాగంగా ఆ చేదు జ్ఞాపకాన్ని మళ్లీ తవ్వి తీయడం కెవిన్ హార్ట్ అభిమానులకు రుచించడం లేదు. కామెడీ పేరుతో ఒకరి వ్యక్తిగత బలహీనతలను, కుటుంబాన్ని బాధించే విషయాలను ప్రస్తావించడం ఎంత వరకు సమంజసం అనే చర్చ మొదలైంది.
అయితే రోస్ట్ షోల స్వభావమే అంత కాబట్టి హార్ట్ కూడా ఆ జోకులను నవ్వుతూనే స్వీకరించాల్సి వచ్చింది. కానీ ఇంటర్నెట్ యుగంలో పాత తప్పులు ఎప్పటికీ మరుగున పడవని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. కెవిన్ హార్ట్ ఈ వివాదం నుండి బయటపడి తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తన తప్పులను పాఠాలుగా మార్చుకునీ కామెడీలో కూడా నిజాయితీని ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత. అయినా ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై మళ్లీ ఆ సంఘటన ప్రస్తావనకు రావడం ఆయన వ్యక్తిగత ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ప్రేక్ష‌కులు మ‌ర్చిపోయిన విష‌యాన్ని మ‌ళ్లీ తానే గుర్తు చేసి అక్షింత‌లు వేయించుకోవ‌డం అస‌ర‌మా? అంటూ నెటి జ‌న‌లు కామెంట్లు పెడుతున్నారు.
సెలబ్రిటీలు చేసే చిన్న తప్పు కూడా దశాబ్దాల పాటు వారి వెంటే ఉంటుందనడానికి ఇదొక ఉదాహరణ. అలా కెవిన్ హార్ట్ 2017 వివాదం ఆయన జీవితంలో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. కాలం గడిచినా? ఆయన సాధించిన విజయాలు ఎన్ని ఉన్నా? ఆ ఒక్క పొరపాటు మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది. ఇది ఒక సెలబ్రిటీ వార్త మాత్రమే కాదు. బాధ్యతాయుతమైన జీవితం ప్రాముఖ్యతను గుర్తుచేసే ఓ పాఠం కూడా.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌ తో పాటు విదేశాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్రబృందం.. ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్‌ ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
కొద్ది రోజుల విరామం తర్వాత మే 12 నుంచి షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆ షెడ్యూల్‌ లో మహేశ్‌ బాబు, ప్రియాంక చోప్రాతోపాటు మెయిన్ క్యాస్టింగ్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. మరోవైపు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసే పనుల్లో కూడా మూవీ టీం బిజీగా ఉంది. ఇటీవల మెక్సికోలో జరిగిన ఓ ఈవెంట్‌ లో వారణాసి స్పెషల్ మేకింగ్ వీడియోను ప్రదర్శించగా.. త్వరలో ఫ్రాన్స్‌ లో ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టాక్.
అయితే ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్‌ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. నగరంలో తీవ్రమైన వేసవి నీటి సమస్య కారణంగా షూటింగ్ ఆలస్యమైందని ప్రచారం జరిగింది. భారీ సెట్స్, యాక్షన్ సన్నివేశాల కోసం మూవీ యూనిట్ దాదాపు 150 వాటర్ ట్యాంకర్లను కోరినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సిటీలో వాటర్ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వాటర్ బోర్డు అంతమేర సప్లై చేయలేమని తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
వేసవి కాలంలో హైదరాబాద్‌ లోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత నెలకొంటోంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల అవసరాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది. దీంతో వారణాసి షూటింగ్‌ కు తాత్కాలిక బ్రేక్ పడిందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుండటంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేక షూటింగ్ ప్లాన్‌ లో మార్పులు చేశారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే కొత్త షెడ్యూల్‌ ముందుగా అనుకున్న భారీ సన్నివేశాలనే తెరకెక్కిస్తారా? లేక తక్కువ నీటి అవసరం ఉన్న ఎపిసోడ్స్ షూట్ చేస్తారా? అన్న విషయంపై ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు. మూవీ టీం మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్‌ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఇక రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలకు మోడ్రన్ అడ్వెంచర్ టచ్ యాడ్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా తిరిగే ఓ సాహసికుడి కథగా వారణాసి రూపొందిస్తున్నట్లు సమాచారం. సినిమాలో మహేశ్‌ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా.. ప్రియాంక చోప్రా మందాకిని పాత్ర పోషిస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కుతున్న ఆ గ్లోబల్ ప్రాజెక్ట్‌ ను నిర్మాతలు కేఎల్‌ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరల్డ్ రేంజ్ విజువల్ వండర్‌ గా రూపొందుతున్న వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.