Begin typing your search above and press return to search.

సూపర్ ఫీచర్లతో నథింగ్ ఫోన్ - 2... స్పెషాలిటీస్ ఇవే!

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్ మేకర్ నథింగ్ ఫోన్ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

By:  Sai J   |   17 July 2023 11:52 AM GMT
సూపర్ ఫీచర్లతో నథింగ్ ఫోన్ - 2... స్పెషాలిటీస్ ఇవే!
X

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్ మేకర్ నథింగ్ ఫోన్ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ నథింగ్ ఫోన్ (2) ఫస్ట్ సేల్ జూలై 21న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఈ ఫోన్ కు సంబంధించిన స్పెషాలీటీస్ ఏమిటి, ధర ఎంత, మొదలైన విషయాలపై ఒక లుక్కేద్దాం...!

నథింగ్ ఫోన్ (2) మూడు వేరియంట్‌ లలో 8GB RAM + 128GB స్టోరేజీ, 12GB RAM + 256GB స్టోరేజీ, 12GB RAM + 512GB స్టోరేజీ కలిగి ఉందని తెలుస్తుంది. ఇదే సమయంలో 1080 — 2412 రిజల్యూషన్, 120హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్‌ తో 6.7-అంగుళాల డిస్‌ ప్లే తో వస్తుంది. ఆప్టికల్ ఇన్-డిస్‌ ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ (2) 50MP సోనీ IMX890 సెన్సార్ + 50MP Samsung JN1 సెన్సార్‌ తో పాటు మెరుగైన ట్యూనింగ్, కెమెరా ఫీచర్లతో పాటు డ్యూయల్ కెమెరా సెటప్‌ ను కలిగి ఉండగా... ముందు భాగంలో నథింగ్ ఫోన్ (2) సోనీ IMX615 సెన్సార్ ఆధారంగా 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉందని తెలుస్తుంది.

ఇక ధరల విషయానికొస్తే... 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ. 44,999, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ రూ. 49,999, 12GB RAM + 512GB స్టోరేజ్ రూ. 54,999తో వచ్చింది. అయితే ఫ్లిప్ కార్ట్... యాక్సిస్ బ్యాంక్, హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్ కార్డులపై రూ. 3వేలు డిస్కౌంట్ ఆఫర్ అందించనుందని తెలుస్తుంది.

నథింగ్ ఫోన్ (2) భారత మార్కెట్లో శుక్రవారం, జూలై 21, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌ కార్ట్ ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌ లెట్‌ ల ద్వారా ఓపెన్ సేల్ అందుబాటులో ఉండనుందని తెలుస్తుంది.