విలేజ్ లో వంట.. ప్రపంచంలోనే నాలుగో స్థానం!
యూట్యూబ్ ఛానల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా వచ్చిన తర్వాత వీటి వినియోగం మరింత ఎక్కువగా పెరిగిపోయింది.
By: Madhu Reddy | 1 Dec 2025 6:00 PM ISTయూట్యూబ్ ఛానల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా వచ్చిన తర్వాత వీటి వినియోగం మరింత ఎక్కువగా పెరిగిపోయింది. పిల్లలను మొదలుకొని పెద్దల వరకు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ.. తమకు నచ్చిన ఏదో ఒక విషయాన్ని ఎంచుకొని.. ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.. కొంతమంది సమాజానికి ఉపయోగపడే సందేశాలను ఇస్తే.. మరి కొంతమంది కామెడీ వీడియోలు చేస్తూ పాపులారిటీ అందుకుంటున్నారు. ఇంకొంతమంది రుచికరమైన వంటకాలను తయారు చేస్తూ ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అరుదైన గౌరవాలను అందుకుంటున్నారు. అంతేకాదు ఇలా ఎన్నో రకాల వీడియోలను అప్లోడ్ చేస్తూ తమకంటూ ఒక ఆదాయాన్ని అందుకుంటున్నారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో మిగతా వీడియోలతో పోల్చుకుంటే కుకింగ్ వీడియోలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పల్లెటూర్లలో రుచికరమైన వంటలను తయారు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మంచి ఆదరణ కూడా పొందుతున్నారు. ఈ క్రమంలోనే విలేజ్లో రుచికరమైన వంటలను అందరికీ పరిచయం చేస్తూ.. ఆ వంటల ద్వారా ఏకంగా కోట్లల్లో సబ్స్క్రైబర్లను పొంది ప్రపంచంలోనే నాలుగవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు. మరి వారు ఎవరు అనే విషయం ఇప్పుడు చూద్దాం..
విలేజ్ లో వంటల వీడియోలతో ఏకంగా మూడు కోట్ల మంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది ప్రముఖ యూట్యూబ్ ఛానల్ "విలేజ్ కుకింగ్" యూట్యూబ్ ఛానల్. తమిళనాడులోని పుదుకోట్టై జిల్లా చిన్న వీరమంగళం గ్రామానికి చెందిన సుబ్రమణియన్, అయ్యనార్, పెరియ తంబి, ముత్తు మాణిక్యం, మురుగేశన్, తమిళ్ సెల్వన్ ఇలా వీరంతా కలిసి 2018లో ఈ విలేజ్ కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఇక్కడ పెద్ద ఎత్తున వంటలు చేస్తూ తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేవారు.
నెమ్మదిగా ఆదరణ పెరుగుతున్న క్రమంలో 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఛానల్ సభ్యులతో కలిసి వంట చేసిన వీడియో వైరల్ గా మారి.. ఏకంగా వీరికి కోటి మంది సబ్స్క్రైబర్లను అందించింది. అయితే ఈ సబ్స్క్రైబర్ల విలువ ఇప్పుడు ఏకంగా మూడు కోట్లు దాటింది. దీంతో యూట్యూబ్లో అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగి ఉన్న చానల్స్ జాబితాలోకి చేరిపోయింది. అంతేకాదు అత్యుత్తమ ఫుడ్ వీడియోలను అప్లోడ్ చేసే ఛానల్ జాబితాలో చేరి.. ప్రపంచవ్యాప్తంగా నాలుగవ స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.
ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ఇండియా యూట్యూబ్ ఛానల్ కి ఈ అరుదైన గౌరవం లభించడం నిజంగా ప్రశంసనీయం అని చెప్పవచ్చు. ఇక పలువురు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహకులు, సబ్స్క్రైబర్లు ఈ ఛానల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా రుచికరమైన వంట వీడియోలతో ప్రపంచస్థాయి గుర్తింపును సొంతం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు అని చెప్పవచ్చు.
