అల్టిమేట్ ఫుడ్ సిటీ.. మనదేశంలో ఆ ప్రాంతానికే కిరీటం!
ప్రపంచ దేశాలలో ఎన్నో రకాల ఆహారాలు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క దేశంలో.. రాష్ట్రంలో.. ఆ దేశానికి లేదా రాష్ట్రానికి ఫేమస్ అయిన వెరైటీ వంటకాలు కూడా ఉంటాయి.
By: Madhu Reddy | 4 Dec 2025 3:16 PM ISTప్రపంచ దేశాలలో ఎన్నో రకాల ఆహారాలు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క దేశంలో.. రాష్ట్రంలో.. ఆ దేశానికి లేదా రాష్ట్రానికి ఫేమస్ అయిన వెరైటీ వంటకాలు కూడా ఉంటాయి. పైగా చాలామంది ఫుడ్ వ్లాగర్స్ కూడా వివిధ దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ.. ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుందనే విషయాన్ని రివ్యూ రూపంలో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా భారతదేశంలోని అతిపెద్ద నగరాలలో వారాల తరబడి ప్రయాణించిన స్కాటిష్ కంటెంట్ సృష్టికర్త హ్యూ తనకి ఆ సిటీలోని ఫుడ్ చాలా బాగా నచ్చింది అని రివ్యూ ఇచ్చారు.
విషయంలోకి వెళ్తే.. హ్యూ అబ్రాడ్ తాజాగా భారతదేశం లోని కొన్ని రద్దీగా ఉండే వీధుల్లో తిరిగి ఫుడ్ టేస్ట్ చేస్తూ కొన్ని వీడియోలు తీసుకున్నారు. అలా భారతదేశంలో ఢిల్లీ,ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కత్తా, చెన్నై,కొచ్చి వంటి 7 ప్రధాన నగరాలలో ఉన్న ఫుడ్.. టేస్ట్ చేయడమే కాకుండా ఆ తర్వాత పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ కూడా ఫుడ్ టేస్ట్ చేశాడు.
అయితే పాకిస్తాన్, ఇండియా రెండు దేశాలలో ఫుడ్ విషయంలో ఎక్కడి ఫుడ్ మీకు బాగా నచ్చింది అని సోషల్ మీడియాలో ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇంస్టాగ్రామ్ లో ఆయన అభిమాని అడిగిన ప్రశ్నకి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఒక అభిమాని మీకు ఎక్కువగా ఏ ప్రాంత ఫుడ్ నచ్చింది అని ప్రశ్నించగా.. హ్యూ నాకు భారతదేశంలో బెంగళూరులోని ఫుడ్ అద్భుతంగా అనిపించింది. అదే అల్టిమేట్ ఫుడ్ సిటీ అని గొప్పగా చెప్పారు. అంతేకాదు బెంగళూరు సిటీ బ్రేక్ ఫాస్ట్ కి రారాజు అంటూ ఆయన కొనియాడారు. బెంగళూరులోని దోసా,ఇడ్లీ, ఫిల్టర్ కాఫీ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా దోసెలు గాజులా చాలా క్రిస్పీగా ఉంటాయి. అంతేకాదు ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. వాటి గురించి ఆలోచిస్తే మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుంది. అంటూ తన రివ్యూ పంచుకున్నారు.
కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో బెంగళూరు రారాజు నిజమే అని ఒప్పుకుంటే మరి కొంత మంది మాత్రం ఆయన ఇచ్చిన రివ్యూ ని వ్యతిరేకించారు. కేవలం బెంగళూరులోనే కాదు బెంగళూరు కంటే అద్భుతమైన అల్పాహారాలు,భోజనాలు భారతదేశంలో ఎన్నో చోట్ల ఉన్నాయి.ముందుగా వాటిని అన్వేషించమని కోరారు. ఓ నెటిజన్ బెంగళూరులో నివసిస్తున్న ఉత్తర భారతీయుడిగా దోస,ఇడ్లీలు ఉత్తమ అల్పాహారం అని నేను ఒప్పుకుంటున్నాను.. అని చెప్పగా.. మరో నెటిజన్ దోసా, ఫిల్టర్ కాఫీ అల్పాహారం కోసం అద్భుతంగా ఉంటుంది. కానీ మీరు దేశవ్యాప్తంగా ఇతర ఆహారాలను కూడా ప్రయత్నించాలి. బ్రేక్ ఫాస్ట్ పరంగా చూసుకుంటే బెంగళూరులోని బ్రేక్ ఫాస్ట్ అద్భుతం అని చెప్పడం బాగోలేదు అన్నారు.
ఇక మరో నెటిజన్ పంజాబ్ మరియు యూపీని సందర్శించకుండా ఈ వ్యక్తి కేవలం బెంగుళూరు అల్పాహారం మాత్రమే ఉత్తమమైనది అని చెప్పడానికే కూర్చున్నాడా ఏంటి అంటూ కాస్త నెగిటివ్ కామెంట్ పెట్టాడు. ఇంకో నెటిజన్ మీరు భారతదేశం లోని ప్రధాన నగరాలను ఇప్పటివరకు సందర్శించలేదు. మీరు దేశంలోని లక్నో మరియు హైదరాబాద్ రెండు ప్రధాన నగరాలని సందర్శిస్తే అవే ఆహారానికి ప్రసద్ది చెందాయి అని మీకు తెలుస్తుంది.అలా బెంగళూరులోని అల్పాహారం అద్భుతంగా ఉంటుందని హ్యూ రివ్యూ ఇవ్వడంతో చాలామంది ఆయనకు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.
పాకిస్తాన్ దేశంలో ఎక్కడ అద్భుతమైన ఫుడ్ ఉంది అని కొంతమంది ప్రశ్నించగా..కరాచీ తన అభిమాన ఆహార నగరంగా ఎంచుకున్నాడు. ఇక హ్యూ బెంగళూరు ఫుడ్ బాగుంటుందని చెప్పినప్పటికీ ఢిల్లీలోని జిలేబి,మరియు రబ్రీ ని కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పారు.
