గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!
డాక్టర్ పట్టా అందుకున్నా సినిమాలపై ఆసక్తితో నటిగా మారిన శ్రీలీల ప్రస్తుతం సినీ కెరీర్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన సిల్వర్ లెహంగా, ఎంబ్రాయిడరీ చోళీ ధరించి దీపావళి ప్రత్యేక ఈవెంట్లో మెరిశారు. ముత్యాల టస్సెల్స్, జరీ వర్క్‌తో కూడిన ఈ అవుట్‌ఫిట్‌లో ఆమె లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By: Madhu Reddy | 6 Nov 2026 1:21 PM ISTడాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాం అంటూ ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీలు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలోకి శ్రీ లీలా కూడా చేరారు. సెట్ లో నటిస్తూనే మరొకవైపు కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు పుస్తకాలు తిరిగేసింది.ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. డాక్టర్ పట్టా కూడా అందుకుంది. ఇటు సినిమాలలో అద్భుతమైన నటన కనబరుస్తూ.. అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. అటు తన టాలెంట్ ను కూడా ప్రూవ్ చేసుకుంది.
శ్రీ లీల విషయానికి వస్తే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ తీసిన చిత్రాలను సోషల్ మీడియాలో చూసిన డైరెక్టర్ ఏ.పీ.అర్జున్ ఈమెకు తన దర్శకత్వంలో వచ్చిన కిస్ అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు. 2019లో వచ్చిన ఈ చిత్రం ద్వారా ఈమె వెండితెరకు పరిచయమైంది. తెలుగులో మాత్రం దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ ఫిలిం పెళ్లి సందD చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈమెకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది మాత్రం రవితేజ హీరోగా నటించిన ధమాకా మూవీ.
భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం, రాబిన్ హుడ్, మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. కానీ ఈమెకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. అటు తమిళ్లో పరాశక్తి సినిమాలో కూడా నటించినా.. అది కూడా మెప్పించలేకపోయింది. కానీ పుష్ప 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ధర్మన్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న ఈమె.. మరోవైపు బాలీవుడ్ పై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ.
సినిమాల ద్వారా ఎంత బిజీగా ఉన్నా ఇటు సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది శ్రీలీల. అందులో భాగంగానే తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గార్జియస్ లుక్ లో ఉన్న ఈమె అందం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన సిల్వర్ లెహంగా సెట్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది.
ఆధునిక హంగులతో , సాంప్రదాయ శైలిని కలగలిపి డిజైన్ చేసిన ఈ సిల్వర్ లెహంగా , చోళీ ఈమె అందాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా చోళీ విషయానికి వస్తే షీర్ నెట్ బేస్ పై క్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేశారు. భుజాల భాగం నుండి కిందకు వేలాడేలా డిజైన్ చేసిన ముత్యాల టస్సెల్స్ ఈ బ్లౌజ్ కు ప్రత్యేకమైన రాయల్ లుక్ ను అందిస్తున్నాయి.ఇక లెహంగా విషయానికి వస్తే జరీ వర్క్ తో దీనిని డిజైన్ చేశారు. దీపావళి స్పెషల్ ఈవెంట్ లో భాగంగా ఈ అద్భుతమైన ఔట్ఫిట్ ధరించి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
