Begin typing your search above and press return to search.

పండుగ వేళ పురుషుల ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్స్ & రూల్స్

… పండుగల వేళ పురుషుల ఫ్యాషన్‌లోనూ కొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. సంప్రదాయ కుర్తా, షేర్వాణీలకు బదులుగా ఇండో-వెస్ట్రన్ ఫ్యూజన్ వేర్, వెస్ట్‌కోట్లు, స్టైలిష్ జాకెట్లు, అసమాన కట్స్ ఉన్న కుర్తాలకు యువత ప్రాధాన్యత ఇస్తోంది. మెరూన్, గోల్డ్ రంగుల స్థానంలో పాస్టెల్ షేడ్స్, ఆలివ్ గ్రీన్, ఐవరీ వంటి రంగులు ట్రెండ్ అవుతున్నాయి. లినెన్, ఆర్గానిక్ కాటన్ వంటి తేలికపాటి వస్త్రాలతో కంఫర్ట్‌తో కూడిన స్టైలిష్ లుక్‌కు ఆదరణ పెరుగుతోంది.

By:  Srikanth Kontham   |   7 Nov 2026 2:27 PM IST
పండుగ వేళ పురుషుల ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్స్ & రూల్స్
X

పండుగలు అనగానే పురుషుల ఫ్యాషన్ విషయంలో సంప్రదాయ కుర్తా-పైజామా లేదా భారీ ఎంబ్రాయిడరీ షేర్వాణీలు మాత్రమే గుర్తొచ్చే రోజులు మారిపోయాయి. మారుతున్న కాలంతో పాటు ట్రెండ్స్ కూడా వేగంగా అప్‌డేట్ అవుతున్నాయి. ప్రస్తుత పండుగల సీజన్‌లో పురుషుల ఫ్యాషన్ కేవలం రొటీన్ ఎత్నిక్ వేర్‌కే పరిమితం కాకుండా ఆధునిక శైలి .. సాంప్రదాయాల అద్భుత కలయికతో ఓ కొత్త రూపాన్ని సంతరించుకుంది.

ఇప్పటివరకు పండుగల దుస్తులంటేనే ఒంటిపై బరువైన ఎంబ్రాయిడరీ డిజైన్లు, ధరించడానికి సౌకర్యంగా లేని బట్టలు అనే భావన ఉండేది. అయితే ఇప్పుడు కంఫర్ట్ విత్ స్టైల్ అనే సరికొత్త ట్రెండ్ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతోంది. పండుగ ఆచారాలకు పరిమితమవ్వడమే కాకుండా రోజంతా తేలికగా సౌకర్యవంతంగా ఉండగలిగే దుస్తుల వైపే నేటి తరం పురుషులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.

ఈ కొత్త ఫ్యాషన్ విప్లవంలో ఫ్యూజన్ వేర్ దుస్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సాంప్రదాయ వెస్ట్రన్ సూట్‌లకు ఇండో-పాశ్చాత్య టచ్ ఇస్తూ రూపొందిస్తున్న వెస్ట్ కోట్స్, సమకాలీన స్టైల్ జాకెట్లు, కార్గో పైజామాలు , అసమాన కట్స్ ఉన్న కుర్తాలు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వెస్ట్రన్ కట్స్, బాంధేజ్ లేదా చందేరి ప్రింట్లతో కూడిన ట్రెండీ అవుట్‌ఫిట్స్ పండుగ వేడుకలకు సరికొత్త గ్లామర్‌ను తెచ్చిపెడుతున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో కలర్ ప్యాలెట్ కూడా రూపురేఖలు మార్చుకుంది. ఒకప్పుడు పండుగలంటే మెరూన్, గోల్డ్ , రాయల్ బ్లూ రంగులకే ప్రాధాన్యత ఇచ్చేవారు.

కానీ ఇప్పుడు పాస్టెల్ షేడ్స్ , మ్యూటెడ్ టోన్స్, ఆలివ్ గ్రీన్, బ్లష్ పింక్, లిలాక్ , ఐవరీ రంగులు పురుషుల ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారాయి. ఈ సాఫ్ట్ కలర్స్ వేడుకల్లో ఓ విధమైన ఎలిగెంట్, రీచ్ అండ్ క్లాసీ లుక్‌ని అంది స్తుండటంతో యువత ఎంచుకుంటోంది. ఫ్యాబ్రిక్ విషయంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పాలిస్టర్ లేదా బరువైన సిల్క్ స్థానంలో ప్యూర్ లినెన్, ఆర్గానిక్ కాటన్, వెల్వెట్ , తేలికపాటి హ్యాండ్‌లూమ్ వస్త్రాలకు డిమాండ్ పెరిగింది. పొడి వాతావరణంలో సైతం సౌకర్యవంతంగా ఉంటూ పండుగ మెరుపులను కోల్పోకుండా ఉండేలా ఫ్యాబ్రిక్స్ తో రూపొందించిన కుర్తా-స్టైల్ షర్టులు , డ్రేప్డ్ ట్యూనిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.

పండుగల ఫ్యాషన్ అనేది పురుషులకు సంబంధించి నిర్దిష్ట ఫ్రేమ్‌కే పరిమితం కాకుండా విశాలంగా మారింది. పాత విధానాల‌ను పక్కన పెట్టి సొంత శైలి..వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా దుస్తులను మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం కొత్త నియమంగా మారింది. ఈ మార్పు అన్న‌ది పండుగల కోసమే కాకుండా? వ్యక్తిత్వ వికాసానికి అద్దం పట్టే ఫ్యాషన్ విప్లవంగానూ నిలుస్తుంది.