Begin typing your search above and press return to search.

అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన లేడీ డైరెక్ట‌ర్!

ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ సినిమా `జిందగీ నా మిలేగీ దొబారా` సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

By:  Srikanth Kontham   |   18 Aug 2026 1:04 PM IST
అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లిన లేడీ డైరెక్ట‌ర్!
X

ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ సినిమా `జిందగీ నా మిలేగీ దొబారా` సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడ వస్తుందా ?అని అభిమానులు ఏళ్ల తరబడి ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ విషయంలో అభిమానులు పొరపడటంతో దర్శకురాలు జోయా అక్తర్ ఊహించని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ యాడ్‌ను చూసి అసలైన సీక్వెల్ ట్రైలర్ అనుకున్న కొద్దిమంది అభిమానులు అది కేవలం ప్రకటన అని తెలిశాక తీవ్ర నిరాశ చెంది జోయాపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.

సాధారణంగా దర్శకులు .. నటులు తమ సోషల్ మీడియా ఖాతాలలో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా టీజర్‌ను పంచుకుంటే ప్రేక్షకులు వెంటనే దానిపై స్పందిస్తారు. సరిగ్గా ఇదే జూమ్ ఇన్ అయిన సందర్భంలో జోయా అక్తర్ పోస్ట్ చేసిన ఓ అడ్వర్టైజ్‌మెంట్ వీడియోను చూసి నెటిజన్లు భ్రమపడ్డారు. అందులో హృతిక్ రోషన్, అభయ్ డియోల్, ఫర్హాన్ అక్తర్ వంటి ప్రధాన తారాగణం మళ్లీ కనిపించడంతో అందరూ దీన్ని `జిందగీ నా మిలేగీ దొబారా 2` అధికారిక ప్రకటనగా భావించారు. కానీ అది కమర్షియల్ బ్రాండ్ కోసం రూపొందించిన ప్రచార చిత్రం మాత్రమేనని తేలడంతో అభిమానుల అంచనాలు తలక్రిందులయ్యాయి.

అభిమానుల నుంచి వచ్చిన నిరాశ క్రమంగా ఆగ్రహంగా మారి జోయా అక్తర్‌ను ఇబ్బందులకు గురిచేసింది. తమ అభిమాన సినిమాకు సీక్వెల్ వస్తోందని సంబరపడిన జనం, అది కేవలం ప్రకటన అని తెలుసుకున్న వెంటనే సోషల్ మీడియాలో జోయాను తీవ్ర స్థాయిలో దూషించడం మొదలుపెట్టారు. మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే మోసం చేశారంటూ కొందరు నెటిజన్లు ఆరోపించగా.. ఇలాంటి సెంటిమెంట్ ఉన్న సినిమాలతో ప్రయోగాలు చేయవద్దంటూ మరికొందరు హెచ్చరించారు. ఒక క్రియేటివ్ యాడ్ ఇచ్చిన తప్పుడు సంకేతాల వల్ల దర్శకురాలు ఊహించని విధంగా ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ సంఘటన సినిమా రంగంలో ఫ్రాంచైజీల పట్ల ప్రేక్షకుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న క్లాసిక్ చిత్రాల పట్ల ఎంతటి అప్రమత్తత అవసరమో స్పష్టం చేస్తోంది. `జిందగీ నా మిలేగీ దొబారా` సినిమా కమర్షియల్ విజయం మాత్రమే కాదు. ఎంతోమంది యువతకు స్నేహం , జీవితంపై సరికొత్త దృక్పథాన్ని ఇచ్చిన అద్భుతమైన అనుభూతి. అలాంటి ప్రాజెక్ట్ పేరుతో ఏ చిన్న ప్రచారం జరిగినా? ప్రేక్షకులు దాన్ని నిజమైన సీక్వెల్‌గా నమ్మడానికి మానసికంగా సిద్ధంగా ఉంటారనే సత్యాన్ని ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది.

దర్శకురాలిగా జోయా అక్తర్ ఎలాంటి దురుద్దేశం లేకుండానే కమర్షియల్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినా? ప్రేక్షకుల అంచనాలు తప్పుదారి పట్టడం వల్ల వివాదం తలెత్తింది. సోషల్ మీడియా యుగంలో కంటెంట్ ఏ రూపంలో బయటికి వస్తోంది అనే దానికంటే? దానిని ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారు అనేదే కొన్నిసార్లు పెద్ద సవాళ్లను సృష్టిస్తుంది. జోయా అక్త‌ర్ ఎదుర్కొన్న ఈ అనుభవం చిత్ర పరిశ్రమలో ప్రచార వ్యూహాలపై కొత్త చర్చకు దారి తీస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా మేకర్స్ మరింత స్పష్టతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.