Begin typing your search above and press return to search.

జాంబి రెడ్డి 2.. పెద్ద ప్లానింగే..?

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జతో హనుమాన్ కన్నా ముందు చేసిన సినిమా జాంబి రెడ్డి. హాలీవుడ్ లో చాలా పాపులర్ అయిన జాంబి జోనర్ సినిమాను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు ప్రశాంత్ వర్మ.

By:  Ramesh Boddu   |   8 Sept 2025 1:42 PM IST
జాంబి రెడ్డి 2.. పెద్ద ప్లానింగే..?
X

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జతో హనుమాన్ కన్నా ముందు చేసిన సినిమా జాంబి రెడ్డి. హాలీవుడ్ లో చాలా పాపులర్ అయిన జాంబి జోనర్ సినిమాను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు ప్రశాంత్ వర్మ. జాంబి జోనర్ కి తన స్టైల్ కామెడీ యాడ్ చేసి సినిమా హిట్ అందుకున్నాడు. ఆ నెక్స్ట్ సినిమానే హనుమాన్ చేసి మరో సెన్సేషన్ అందుకున్నాడు. ప్రస్తుతం మిరాయ్ తో వస్తున్న తేజ సజ్జ జాంబి రెడ్డి 2 కూడా ఉంటుందని చెప్పాడు. ఐతే జాంబి రెడ్డి 2 సినిమాను ముందు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందని టాక్ వచ్చింది. కానీ ఆ సినిమా ఛాన్స్ ఇప్పుడు పీపుల్ మీడియానే అందుకుందని తెలుస్తుంది.

రాయలసీమ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్..

అంతేకాదు ఈ సినిమా డైరెక్టర్ కూడా మారుతున్నాడట. రానా నాయుడు సినిమాన్ము డైరెక్ట్ చేసిన సుపర్న్ వర్మ ఈ సీక్వెల్ డైరెక్ట్ చేస్తాడని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఈమధ్యనే రాయలసీమ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే క్యాప్షన్ తో ఒక ప్రీ లుక్ పోస్టర్ వదిలారు. అది జాంబి రెడ్డి 2కి సంబందించినదే అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. తేజ సజ్జతో ఆల్రెడీ మిరాయ్ సినిమా చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. మళ్లీ అతనితోనే జాంబి రెడ్డి 2 కూడా చేస్తారని తెలుస్తుంది.

ఇక తేజ సజ్జ కూడా కెరీర్ ప్లానింగ్ లో సంథింగ్ స్పెషల్ అనిపిస్తున్నాడు. తనకు వచ్చిన ఈ ఇమేజ్ కి తగిన సినిమాలతో వస్తున్నాడు. హనుమాన్ తో సూపర్ హిట్ కొట్టిన తర్వాత కూడా మిరాయ్ లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాతోనే వస్తున్నాడు. తేజ సినిమాల ఎంపిక అతనికి ప్రత్యేక గుర్తింపు తెస్తుంది. మిరాయ్ సినిమా సక్సెస్ అయితే మరోసారి తేజ పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగుతుంది.

మిరాయ్ తర్వాత తేజ సజ్జా..

తేజ సజ్జ కూడా క్రేజ్ వచ్చింది కదా అని ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేయకుండా కంటెంట్ ఉన్న కథలనే చేస్తూ వస్తున్నాడు. మిరాయ్ తర్వాత తేజ సజ్జా జాంబి రెడ్డి 2నే చేస్తాడని తెలుస్తుంది. ఇదే కాదు మరికొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాడట. మిరాయ్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. ఈగల్ తో గురి తప్పిన ఈ డైరెక్టర్ మిరాయ్ ని మాత్రం నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించాడని తెలుస్తుంది. మిరాయ్ ప్రమోషనల్ కంటెంట్ తోనే వారెవా అనిపించారు. సినిమా రిలీజైతే కానీ అసలు లెక్క తేలే ఛాన్స్ ఉంటుంది.