Begin typing your search above and press return to search.

ఆ పండగ బరిలో క్రేజీ 'జాంబీలు'

తేజ సజ్జా ప్రస్తుతం అంతా సీక్వెల్స్ మోడ్‌లోనే ఉన్నాడు. 'జాంబీ రెడ్డి 2' పూర్తి చేసిన వెంటనే 'మిరాయ్ 2' షూటింగ్‌లో జాయిన్ అవుతాడు.

By:  M Prashanth   |   21 Jan 2026 11:43 PM IST
ఆ పండగ బరిలో క్రేజీ జాంబీలు
X

హనుమాన్, మిరాయ్ సినిమాలతో వరుస హిట్లు కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న యంగ్ హీరో తేజ సజ్జా, ఇప్పుడు తన లైనప్‌ను మరింత క్రేజీగా మార్చేస్తున్నాడు. తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన 'జాంబీ రెడ్డి'కి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న ఒక షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే, ఈ పార్ట్ 2ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయడం లేదు. 'జై హనుమాన్' పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన ఈ బాధ్యతను బాలీవుడ్ డైరెక్టర్‌కు అప్పగించారు.

బాలీవుడ్‌లో పాపులర్ అయిన 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ కో రైటర్, 'హక్' డైరెక్టర్ సుపర్ణ్ వర్మ ఈ 'జాంబీ రెడ్డి 2'ను తెరకెక్కించబోతున్నారు. సుపర్ణ్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ మేకింగ్ స్టైల్ తో మన ఊరి జాంబీలను ఈసారి మరింత భయంకరంగా, ఫన్నీగా చూపించబోతున్నారని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే, ఈ సినిమాను 2027 సంక్రాంతి బరిలో దించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాల రద్దీ కనిపిస్తున్నా, తేజ సజ్జా మాత్రం తన ఫేవరెట్ సీజన్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ చేసి, శరవేగంగా పూర్తి చేసి పండగ కానుకగా రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. జాంబీ కాన్సెప్ట్ కు పండగ సెలవులు తోడైతే బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు.

తేజ సజ్జా ప్రస్తుతం అంతా సీక్వెల్స్ మోడ్‌లోనే ఉన్నాడు. 'జాంబీ రెడ్డి 2' పూర్తి చేసిన వెంటనే 'మిరాయ్ 2' షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. మిరాయ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దాని సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తేజ తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన జాంబీ రెడ్డికి ఈ సీక్వెల్ ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.

2027 సంక్రాంతి రేసు అప్పుడే మొదలైపోయింది. వెంకటేష్ 'దృశ్యం 3' వంటి సినిమాలతో పాటు మరికొన్ని వచ్చే సంక్రాంతిని ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పుడు తేజ సజ్జా 'జాంబీ రెడ్డి 2' కూడా ఈ రేసులోకి చేరిపోయింది. బాలీవుడ్ డైరెక్టర్ మేకింగ్‌లో జాంబీలు ఈసారి ఎలాంటి రచ్చ చేస్తారో వేచి చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది.