Begin typing your search above and press return to search.

సల్మాన్ ఖాన్ పై చేయి చేసుకున్న నటుడు.. దెబ్బకు అయోమయంలో కెరియర్!

ఇదిలా ఉండగా.. ఈ క్రమంలోనే ఒక జూనియర్ నటుడు ఏకంగా సల్మాన్ ఖాన్ పైనే చేయి చేసుకున్నాడు.

By:  Madhu Reddy   |   16 Aug 2025 10:34 AM IST
సల్మాన్ ఖాన్ పై చేయి చేసుకున్న నటుడు.. దెబ్బకు అయోమయంలో కెరియర్!
X

సాధారణంగా ఒక సినిమా షూటింగ్ సమయంలో నటీనటులు దర్శకులు చెప్పినట్టు కచ్చితంగా చేసి తీరాల్సిందే. ముఖ్యంగా తమ కథకు తగ్గట్టుగా అవతల ఎంత పెద్ద హీరో, హీరోయిన్ అయినా సరే దర్శకులు చెప్పినట్లు నడుచుకోవాలి. లేకపోతే అవకాశాలు రాకుండా పోతాయని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు కూడా.. అయితే ముఖ్యంగా ఇండస్ట్రీలో తమకంటే గొప్ప వాళ్ళతో చేయకూడని సన్నివేశాలు చేయాల్సి వచ్చినప్పుడు.. వీరు తమ కెరియర్ కు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ సన్నివేశాలే వారి కెరియర్ కు పునాదులు వేస్తూ ఉంటాయి అనడంలో సందేహం లేదు.

ఇదిలా ఉండగా.. ఈ క్రమంలోనే ఒక జూనియర్ నటుడు ఏకంగా సల్మాన్ ఖాన్ పైనే చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత తన కెరియర్ ఏమైపోతుందో అని టెన్షన్ పడ్డారట కూడా.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. మరి ఆ నటుడు ఎవరు ? సల్మాన్ ఖాన్ పై ఎందుకు చేయి చేసుకున్నారు? మరి ఇప్పుడు ఆయన కెరియర్ సంగతేంటి? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రఖ్యాత నటుడు జీషన్ అయూబ్ ఇటీవల కబీర్ ఖాన్ 2017 చిత్రం 'ట్యూబ్ లైట్' షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడడంపై స్పందించారు. "ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర నదిలో పడడం చూపించే సన్నివేశాన్ని ప్రదర్శించమని అడిగినప్పుడు.. మనాలీలో నా షూటింగ్ మొదటి రోజు సవాలుగా మారింది. మొదటి టేక్ బాడీ డబుల్ తో జరిగింది. కానీ క్లోజప్ లో నేను సల్మాన్ ఖాన్ తో నేరుగా నటించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ సల్మాన్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టాలని డైరెక్టర్ చెప్పినప్పుడు.. భయంతో నరకం అనుభవించాను. సల్మాన్ ఖాన్ మాత్రం నా భయాన్ని గమనించి , నా జుట్టును సరిచేసి.. ఏం పర్వాలేదు.. షార్ట్ అద్భుతంగా రావాలి అంటే నువ్వు నాపై చేయి చేసుకోవాల్సిందే అని హామీ ఇచ్చారు. ఈ సీన్ తర్వాత నా కెరియర్ పై దెబ్బ పడుతుందేమో అని నేను ఎంతో భయపడ్డాను. కానీ సల్మాన్ ఖాన్ సూచనల మేరకు సీన్ అద్భుతంగా వచ్చింది.. ఆ తర్వాత సల్మాన్ బాగా చేశావని నన్ను మెచ్చుకున్నారు. ఫలితం ఎలా ఉన్నా సరే.. ఆయన మెచ్చుకోవడం నాకు మరింత గర్వంగా అనిపించింది" అంటూ జీషన్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు అదే సంవత్సరం తనకు చాలా ప్రత్యేకమైనది అని కూడా చెప్పుకొచ్చారు జీషన్. ఎందుకంటే షారుఖ్ ఖాన్ తో రయీస్ సినిమాలో అలాగే సల్మాన్ ఖాన్ తో ట్యూబ్ లైట్ లో కలిసి పని చేయడం తనకు విశేషంగా మారింది అని తెలిపారు. ఇక ఈయన జియో హాట్ స్టార్ 'క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్' లో తన నటనతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఏది ఏమైనా స్టార్ సెలబ్రిటీలతో చేసే సన్నివేశాల కారణంగా కెరియర్ దెబ్బతింటుందని భయపడకూడదు అని.. సల్మాన్ ఖాన్ వంటి మంచి ఇమేజ్ ఉన్నవారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారితో సినిమాలు చేసేటప్పుడు నటులు కాస్త జాగ్రత్తగా ఉంటే కెరియర్ పై ఎలాంటి ప్రభావం పడదు అని తన అభిప్రాయంగా స్వీయ అనుభవంతో చెప్పుకొచ్చారు.