న్యూ 'వైరల్' గర్ల్.. ఎక్కడ చూసినా ఆమె ఫోటోలే!
ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతుండటం విశేషం.
By: M Prashanth | 6 April 2026 1:29 AM ISTసోషల్ మీడియాలో తరచుగా సెలబ్రిటీల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సినిమా ఈవెంట్స్ లో గ్లామర్ గా కనిపిస్తే.. వారి ఫోటోలు నెట్టింట ఓ రేంజ్ లో స్ప్రెడ్ అవుతాయి. ఆ పిక్స్ నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వెళ్తాయి. తాజాగా అలాంటి వైరల్ ఫినామినాగా నిలిచింది జైన్ మేరీ ఖాన్.
బాలీవుడ్ కు చెందిన ఆ యంగ్ బ్యూటీ ఇటీవల ఒక్కసారిగా నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. బీటౌన్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుటుంబానికి చెందిన జైన్ మేరీ ఖాన్, దర్శకుడు మన్సూర్ ఖాన్ కుమార్తె. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతుండటం విశేషం.
అయితే జైన్ మేరీ ఖాన్ ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. మిసెస్ సీరియల్ కిల్లర్, మోనికా: ఓ మై డార్లింగ్ వంటి పలు చిత్రాల్లో కనిపించి తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొన్ని వెబ్ సిరీస్‌ల్లో కూడా కనిపించి తన టాలెంట్ ను కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండటం ప్రత్యేకంగా మారింది.
తెలుగులో జైన్ మేరీ ఖాన్ నటిస్తున్న తొలి చిత్రం డెకాయిట్. టాలెంటెడ్ క్యాస్టింగ్ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమాలో ఆమె జానకి అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె నటనకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపించింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ఇటీవల డెకాయిట్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. ఆ కార్యక్రమానికి జైన్ మేరీ ఖాన్ హాజరైన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. చీరకట్టులో ఆమె కనిపించిన విధానం, గ్లామరస్ స్టైలింగ్, ప్రత్యేకంగా లో-నెక్ డిజైన్ తో డ్రెస్సింగ్.. అన్నీ కలిపి ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిపాయి. ఆమె లుక్ కు అక్కడికక్కడే మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, వెంటనే సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ఆ ఈవెంట్ తర్వాత జైన్ మేరీ ఖాన్ పేరు నెట్టింట మారుమోగుతోంది. ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే ప్రశ్నలతో నెటిజన్లు భారీగా సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు కనిపిస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు ఆమెను యమా గ్లామరస్ బ్యూటీగా కొనియాడుతున్నారు. వైరల్ గర్ల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి తెలుగు డెబ్యూతో ఆమె ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
