Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన యంగ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

అందులో భాగంగానే పెళ్లికి వారం రోజులు ముందుగానే తమ పెళ్లి పనులకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

By:  Madhu Reddy   |   18 Oct 2025 11:52 AM IST
ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కిన యంగ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

పెళ్లి.. మూడు ముళ్ళు.. ఏడడుగులు.. ఇద్దరి వ్యక్తుల మనసుల కలయిక.. జీవితంలో ఒకసారి చేసుకునే అత్యంత పవిత్రమైన ఈ పెళ్లి.. జీవితాంతం గుర్తుండి పోవాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. అందులో ప్రత్యేకించి సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ కొంతమంది సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడాన్ని చాలా థ్రిల్ ఫీల్ అవుతూ ఉంటారు. అందులో భాగంగానే పెళ్లికి వారం రోజులు ముందుగానే తమ పెళ్లి పనులకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

కానీ కొంతమంది సెలబ్రిటీలు సైలెంట్ గా వివాహం చేసుకొని ఆ తర్వాత అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక యంగ్ బ్యూటీ.. అది కూడా అత్యంత సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఆమె ఎవరో కాదు అమీర్ ఖాన్ లీడ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దంగల్. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కు రెండవ కూతురిగా నటించిన జైరా వాసిం. తాజాగా ఈమె పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ పెళ్లి జరిగినట్లు రెండు ఫోటోలను పంచుకుంది. ఒకటి రిజిస్టర్ పై సంతకం చేస్తున్నట్టు.. మరొక ఫోటోలో ముఖం చూపించకుండా అటు తిరిగి భర్తతో కలిసి..నెలవంకను చూస్తున్నట్లు ఆ ఫోటోలను షేర్ చేసింది. దీనితో సెలబ్రిటీలు, అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ ఫోటోలలో తన ముఖం కానీ తన భర్త ముఖం కానీ చూపించకుండా.. ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు అతడు ఎవరు? ఎలా ఉంటాడు? అని తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.

జైరా వాసిం కెరియర్ విషయానికి వస్తే.. 16 ఏళ్ల ప్రాయంలోనే అమీర్ ఖాన్ హీరోగా నటించిన దంగల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. దాదాపు 2000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా రికార్డ్స్ ను బ్రేక్ చేయడానికి ఎన్ని సినిమాలు ప్రయత్నం చేస్తున్నా.. కుదరడం లేదు అని చెప్పవచ్చు. అలాంటి ఈ సినిమాలో చిన్నప్పటి గీత ఫోగట్ పాత్రలో నటించిన ఈమెకు.. జాతీయస్థాయిలో ఉత్తమ సహాయనటి అవార్డు కూడా లభించింది..

ఆ తర్వాత సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో కూడా నటించింది ఈ చిన్నది. ఈ చిత్రానికి కూడా నేషనల్ అవార్డు లభించడం గమనార్హం. ఈమె నటించిన మూడవ చిత్రం ద స్కై ఈజ్ పింక్. ఇదే ఆమె చివరి చిత్రం కూడా. అలా 2019లో ఇండస్ట్రీకి దూరమైన ఈమె సోషల్ మీడియా నుండి తన ఫోటోలను కూడా డిలీట్ చేసింది. అప్పటి నుంచి ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు సడన్గా పెళ్లి చేసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచింది.