దిశా పటానీతో చాహల్ ప్రేమాయణం.. అదీ అసలు సంగతి!
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం చుట్టూ తిరిగే రూమర్లు.. సోషల్ మీడియాలో సాగుతున్న రచ్చను పరిశీలిస్తే.. నేటి కాలంలో సెలబ్రిటీలపై ఏ స్థాయిలో నిఘా ఉందో అర్థమవుతుంది.
By: Sivaji Kontham | 17 Aug 2026 10:00 PM ISTభారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం చుట్టూ తిరిగే రూమర్లు.. సోషల్ మీడియాలో సాగుతున్న రచ్చను పరిశీలిస్తే.. నేటి కాలంలో సెలబ్రిటీలపై ఏ స్థాయిలో నిఘా ఉందో అర్థమవుతుంది. గతంలో భార్య ధనశ్రీ వర్మతో విడాకుల వార్తలు వచ్చిన సమయంలో ఆర్జే మహ్వాష్‌తో చాహల్ డేటింగ్ చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత తేలిపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీతో చాహల్ ప్రేమలో ఉన్నాడంటూ మరొక కొత్త పుకారు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.
ఇలాంటి ఆధారం లేని గాసిప్స్ సోషల్ మీడియాలో అనూహ్యమైన వేగంతో వ్యాపిస్తుంటాయి. ఫ్యాన్ అకౌంట్లు, లైక్స్ కోసం పాకులాడే నెటిజన్లు.. అల్గారిథమ్స్ కలిసి ఈ పుకార్లను క్షణాల్లో వైరల్ చేసేస్తుంటాయి. ఏది నిజం? ఏది అబద్ధం? అని నిజానిజాలు తెలుసుకోకుండానే చాలామంది నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తుంటారు. సలహాలు ఇవ్వడం.. నైతిక విమర్శలు చేయడం.. వ్యక్తిగత జీవితంపై లేనిపోని కామెంట్లు చేయడం ద్వారా ఒక వ్యక్తి ఇమేజ్‌ను ఎంత తేలికగా మార్చేస్తారో ఈ నెటిజన్ల కామెంట్లు నిరూపిస్తున్నాయి.
మరోవైపు ఇలాంటి రూమర్లను అందరూ బ్లైండ్‌గా నమ్మేయడం లేదు. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వార్తలను కేవలం వినోదంగా.. కాసేపు సరదాగా నవ్వుకునేందుకు మాత్రమే చూస్తున్నారు. ఈ వార్తలు చూసి చాహల్ స్వయంగా ఆశ్చర్యపోతాడు! అంటూ కామెంట్లు చేస్తూ వీటిని ఒక మీమ్‌లాగా ఆస్వాధిస్తున్నారు. డిజిటల్ యుగంలో వస్తున్న ఇటువంటి క్లిక్‌బైట్ వార్తలపై ప్రజల్లోనూ ఒక రకమైన అవగాహన.. అనుమానం పెరిగాయని ఇది స్పష్టం చేస్తోంది.
ఈ ప్రచారం వెనుక ఉన్న అసలు నిజాన్ని విశ్లేషిస్తే... సెలబ్రిటీల విషయంలో అభిమానులకు ఉన్న విపరీతమైన ఆసక్తి స్పష్టంగా కనిపిస్తుంది. మైదానంలో ఆడే ఆట కంటే కూడా వారి వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలమే ఇటువంటి పుకార్లకు ప్రధాన కారణం. క్రీడా ప్రపంచం, సినిమా రంగం , సోషల్ మీడియా మీమ్ కల్చర్ కలిసిపోవడంతో ఒక అబద్ధం కూడా క్షణాల్లో పెద్ద వార్తగా మారిపోతోంది.
సింపుల్ గా చెప్పాలంటే.. నేటి డిజిటల్ సమాజంలో సెలబ్రిటీగా ఉండటం ఒక పెద్ద సవాలుగా మారింది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరయ్యే అవకాశం ఉన్నా.. అంతే స్థాయిలో బాధ్యతారాహిత్యమైన కామెంట్లకు, విమర్శలకు గురికాక తప్పడం లేదు. క్రీడాకారులు తమ కెరీర్‌పై దృష్టి పెడుతుంటే... వారి చుట్టూ తిరిగే గాసిప్స్ మాత్రం వారిని వదలకుండా వెంటాడుతూనే ఉన్నాయి. బాలీవుడ్ అందగత్తె దిశా పటానీతో చాహల్ ప్రేమాయణం అనే గాసిప్ పూర్తిగా విశ్వసించలేనిదిగా ఉండటంతో అందరూ షాక్ కి గురవుతున్నారు. చాహల్ ప్రస్తుతం ఆటపై దృష్టి సారించగా, అతడిని డైవర్ట్ చేసే ప్రయత్నమే ఇది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
