బ్రీజీ బీచ్ లుక్‌లో యుక్తి.. గ్లామర్‌తో టర్న్ చేసిన బ్యూటీ!
టాలెంటెడ్ హీరోయిన్ యుక్తి తరేజా తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న సన్నీ బీచ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
By: Madhu Reddy | 8 Oct 2026 10:08 AM ISTటాలెంటెడ్ హీరోయిన్ యుక్తి తరేజా తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న సన్నీ బీచ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. "షోర్ థింగ్ " అనే ఆకర్షణీయమైన క్యాప్షన్‌తో ఆమె పంచుకున్న ఈ పిక్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సముద్ర తీరంలో ఎండల వేడిని ఆస్వాదిస్తూ, చిరునవ్వులు చిందిస్తున్న ఈ సుందరి గ్లామర్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
లైట్ బ్లూ రఫిల్డ్ టాప్ అండ్ వైట్ జీన్స్ లుక్ :
తాజా బీచ్ ఫోటోషూట్ కోసం యుక్తి తరేజా లైట్ బ్లూ కలర్ రిబ్డ్-నిట్ క్రాప్ టాప్‌ను ఎంచుకుంది. లో స్క్వేర్ నెక్ లైన్, డెలికేట్ ఫ్రిల్ డిటైలింగ్ ఉన్న ఈ టాప్ ఆమె అందాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా ఫుల్-లెంత్ స్లీవ్స్ కిందకు వచ్చేసరికి డ్రామాటిక్ ఫ్లేర్డ్ బెల్ కఫ్స్‌గా మారడం ఈ ఔట్‌ఫిట్‌కు మోడర్న్ టచ్ తెచ్చింది. ఇక దీనికి మ్యాచింగ్‌గా వైట్ జీన్స్, డెలికేట్ లేస్ హెడ్‌స్కార్ఫ్, పర్ల్ నెక్లెస్ ధరించి పర్ఫెక్ట్ సమ్మర్ వైబ్స్‌లో మెరిసిపోయింది.
'లుట్ గయే' నుంచి మలయాళం, టాలీవుడ్ వరకు ప్రయాణం ఇమ్రాన్ హష్మీ సరసన 'లుట్ గయే' వైరల్ మ్యూజిక్ వీడియోతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యుక్తి, మలయాళంలో 'మార్కో' చిత్రంతో నటిగా అడుగుపెట్టింది. ఇక గత ఏడాది 'కె-ర్యాంప్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ, ఈ ఏడాది 'కింగ్ జాకీ క్వీన్' చిత్రంలో 'భర్గవి' అనే బలమైన పాత్రలో నటించి మెప్పించింది.. ప్రముఖ దర్శకుల ద్వయం రాజ్ - డీకే తెరకెక్కిస్తున్న సంచలన వెబ్ సిరీస్ 'ఫర్జీ సీజన్ 2'లో ఆమె లీడ్ రోల్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇండియన్ ఓటీటీ రంగంలో భారీ ప్రభావాన్ని చూపిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తొలి సీజన్ ఘన విజయం సాధించగా, ఇప్పుడు వస్తున్న రెండో సీజన్పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
'హై జనూన్!' వెబ్ సిరీస్ తో సందడి:
కేవలం సినిమాలే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోనూ తన సత్తా చాటుతోంది యుక్తి. 'హై జనూన్!' వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఆడియన్స్‌ను అలరించిన ఆమె, వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. ఇక రాబోయే రోజుల్లో కన్నడ చిత్రాలతో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది.
ఇక తన స్టైలిష్ లుక్స్, నేచురల్ గ్లామర్‌తో కుర్రకారును ఫిదా చేస్తున్న యుక్తి తరేజా, భవిష్యత్తులో మరిన్ని హిట్ పాత్రలతో స్టార్‌గా ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
