ఎవరు ఈ టెన్నిస్ బంతుల పాప?
సైలెంట్ గా ఒక్కో సినిమాతో దూసుకెళ్లిపోతోంది ఉత్తరాది భామ యుక్తి తరెజా
By: Sivaji Kontham | 14 Dec 2025 6:00 AM ISTసైలెంట్ గా ఒక్కో సినిమాతో దూసుకెళ్లిపోతోంది ఉత్తరాది భామ యుక్తి తరెజా. 2019లో ఎంటీవీ సూపర్‌మోడల్ ఆఫ్ ది ఇయర్ అనే రియాలిటీ షోలో పాల్గొంది. ఆ తర్వాత రంగబలి (2023) నటిగా ఆరంగేట్రం చేసింది. నాగశౌర్య `రంగబలి` నటిగా గుర్తింపునిచ్చింది. ఈ సినిమాలో డాక్టర్ సహజా రెడ్డి అనే పాత్రలో నటించింది. అటుపై ఉన్ని ముకుందన్ సరసన `మార్కో`(2024) బిగ్ బ్రేక్ నిచ్చింది. మార్కో బ్యూటీగా యుక్తికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.

ఢిల్లీలోని శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో తన గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే `ఒప్పో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 2017`తో తన మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. హరియాణా నుంచి ఇప్పుడు హైదరాబాద్ వరకూ ఈ బ్యూటీ హవా నడుస్తోంది.

నిజానికి `లుట్ గయే` అనే పాటలో ఇమ్రాన్ హష్మీ సరసన యుక్తి తరెజా అందరి దృష్టిని ఆకర్షించింది. 2021లో జుబిన్ నౌటియల్ పాడిన టి-సిరీస్ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌లో 1.1 బిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. నాగశౌర్య సరసన రంగబలిలో నాయికగా ఎంట్రీ ఇచ్చాక, అదే సంవత్సరం నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించిన `డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్` చిత్రానికి కథానాయికగా ఎంపికైంది. కానీ ఆ తర్వాత యుక్తి స్థానంలోకి సంయుక్త మీనన్ వచ్చింది.

2024లో ఉన్ని ముకుందన్ `మార్కో` బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో యుక్తి మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఇది యంగ్ బ్యూటీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 2025లో జియోహాట్‌స్టార్ మ్యూజికల్ డ్రామా సిరీస్ `హై జునూన్! డ్రీమ్. డేర్. డామినేట్`లో కనిపించింది.

అదే ఏడాదిలో కిరణ్ అబ్బవరం సరసన `కె-రాంప్` అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో కిరణ్‌తో యుక్తి రొమాన్స్ ఒక రేంజులో వర్కవుటైంది. దీక్షిత్ శెట్టి సరసన `కింగ్ జాకీ క్వీన్`లో నటించింది. నిఖిల్ కుమారస్వామి సరసన కన్నడ చిత్రంలోను ఈ బ్యూటీ నటించనుంది.
యుక్తి సోషల్ మీడియాల్లోను ఎంతో యాక్టివ్ గా ఉంది. తాజాగా ఇన్ స్టాలో టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేసింది. యుక్తి కొత్త లుక్ యూత్ కి కిక్కిస్తోంది. హుషారుగా అలా బ్యాట్ ఝలిపిస్తూ టెన్నిస్ ఆడుతున్న ఫోజులు చూడగానే, ఎవరు ఈ టెన్నిస్ బంతుల పాప! అంటూ యూత్ లో ఎవరికి వారు ఆరాలు తీస్తున్నారు. యుక్తి రకరకాల భంగిమల్లో కెమెరాకు ఫోజులిచ్చింది. టెన్నిస్ ఆడే స్థలంలోనే రిలాక్స్ డ్ గా కూచుని ఫోజులిచ్చింది. ఇవన్నీ ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. నిజానికి యుక్తి ఇప్పటివరకూ పెద్ద హీరోలతో నటించలేదు. నాగశౌర్య, కిరణ్ అబ్బవరం లాంటి యంగ్ ట్యాలెంట్ అవకాశాల్ని కల్పించారు. మునుముందు తన స్టార్ డమ్ ని పెంచుకునేందుకు యుక్తి ఎలాంటి ప్రణాళికల్ని సిద్ధం చేస్తుందో వేచి చూడాలి.
