Begin typing your search above and press return to search.

ఆ సీక్వెల్స్ కు ఇంకా టైమ్ రాలేదా?

సెల్వ రాఘ‌వ‌న్ గ‌త కొంత కాలంగా ఫామ్ లో లేక‌పోవ‌డం కూడా ఈ ప్రాజెక్టు హోల్డ్ లో ప‌డ‌టానికి ఒక కార‌ణం.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 Feb 2026 5:00 PM IST
ఆ సీక్వెల్స్ కు ఇంకా టైమ్ రాలేదా?
X

సినీ ఇండ‌స్ట్రీలో కాలం గ‌డిచేకొద్దీ కొన్ని సినిమాల‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డుతుంది. రిలీజ్ టైమ్ లో మంచి గుర్తింపు, క్రేజ్ రాక‌పోయినా త‌ర్వాత కొంత కాలానికి ప‌లు సినిమాల‌కు మంచి డిమాండ్ వ‌చ్చిన దాఖ‌లాలున్నాయి. అలాంటి వాటిలో త‌మిళ నటుడు కార్తీ హీరోగా సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన యుగానికి ఒక్క‌డు కూడా ఒక‌టి. రిలీజ్ టైమ్ లో ఫ‌ర్వాలేద‌నిపించిన ఈ సినిమాకు త‌ర్వాత్త‌ర్వాత మంచి క‌ల్ట్ స్టేట‌స్ ఏర్ప‌డింది.

కెరీర్ స్టార్టింగ్ లోనే కార్తీ రేర్ ఫీట్

కార్తీ కెరీర్ మొద‌ట్లోనే యుగానికి ఒక్క‌డు లాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయ‌డం అంద‌రినీ ఎంత‌గానో మెప్పించింది. పైగా కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ బ‌డ్జెట్ తో, క‌ళ్లు చెదిరిపోయే విజువ‌ల్స్ తో సినిమా చేయ‌డం అంద‌రికీ కుద‌రదు. కానీ కార్తీ ఆ రేర్ ఫీట్ ను కూడా సాధించారు. అయితే కాలక్ర‌మేణా క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకున్న ఈ సినిమాకు సీక్వెల్ వ‌స్తుంద‌ని ఎప్ప‌ట్నుంచో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

ధ‌నుష్ హీరోగా సీక్వెల్ అనౌన్స్‌మెంట్

మామూలుగా ఏదైనా సినిమాకు సీక్వెల్ వ‌స్తుందంటే ఎవ‌రైనా స‌రే మొద‌టి భాగంలో న‌టించిన హీరోనే ఆ సీక్వెల్ లో న‌టిస్తాడ‌ని అనుకుంటారు. కానీ సెల్వ రాఘ‌వ‌న్ ఇంట్రెస్టింగ్ గా ఆ సీక్వెల్ ప్రాజెక్టును ధ‌నుష్ తో అనౌన్స్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. డైరెక్ట‌ర్- హీరో అన్న‌ద‌మ్ముల కావ‌డంతో ఈ ప్రాజెక్టు ఈజీగా పట్టాలెక్కుతుంద‌ని అందరూ అనుకున్నారు కానీ ఆ ప్రాజెక్టు అమల్లోకి రాలేదు.

నేను రెడీగానే ఉన్నా!

దీంతో ఈ ప్రాజెక్టు హోల్డ్ లో ప‌డింద‌ని అంద‌రూ భావిస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ సెల్వ వ‌ద్ద ప్ర‌స్తావించ‌గా, త‌ను, క‌థ రెడీగా ఉన్న‌ప్ప‌టికీ, ఒక సీక్వెల్ సినిమా చేయాల‌నుకుంటే డైరెక్ట‌ర్ ఒక్క‌డే రెడీగా ఉంటే స‌రిపోద‌ని, మిగిలిన వారు కూడా రెడీగా ఉండాల‌ని చేసిన కామెంట్స్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌కు దారి తీశాయి. ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి చూస్తుంటే ఈ సీక్వెల్ పై హీరో కార్తీ ఇంట్రెస్ట్ గా లేర‌ని అర్థ‌మ‌వుతుంది.

పెండింగ్ లోనే ఖైదీ2!

సెల్వ రాఘ‌వ‌న్ గ‌త కొంత కాలంగా ఫామ్ లో లేక‌పోవ‌డం కూడా ఈ ప్రాజెక్టు హోల్డ్ లో ప‌డ‌టానికి ఒక కార‌ణం. ఏదైనా సీక్వెల్ సినిమాకు మార్కెట్ ప‌రంగా చూసుకుంటే స్ట్రాంగ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాక‌ప్ ఎంతో అవ‌స‌రం. నిర్మాత‌లు కూడా రెడీగా లేక‌పోవ‌డంతోనే ఈ సీక్వెల్ ప్రాజెక్టు ముందుకు వెళ్ల‌డం లేద‌ని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే కార్తీ న‌టించిన సూప‌ర్ హిట్ మూవీ ఖైదీకి సీక్వెల్ గా భావిస్తున్న ఖైదీ2 విష‌యంలో కూడా క్లారిటీ రాక‌పోవ‌డంతో ఈ సీక్వెల్స్ కు ఇంకా టైమ్ రాలేదా అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.