ధురంధర్ ఎఫెక్ట్ బాలీవుడ్ సంస్థపై విమర్శలు
ఆదిత్యధర్..ఈ పేరు ఇప్పుడు మేకర్స్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇంత వరకు ఒకెత్తు..ఇప్పుడు ఒకెత్తు అన్నట్టుగా సినిమాల మేకింగ్ అఅన్నది మారింది.
By: Ravindar Gorantla | 4 April 2026 4:00 PM ISTఆదిత్యధర్..ఈ పేరు ఇప్పుడు మేకర్స్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇంత వరకు ఒకెత్తు..ఇప్పుడు ఒకెత్తు అన్నట్టుగా సినిమాల మేకింగ్ అఅన్నది మారింది. స్పై యాక్షన్ థ్రిల్లర్స్ అంటే గత కొంత కాలం వరకు యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌మూవీసే. కానీ `ధురంధర్` రిలీజ్ తరువాత ఆ అపోహలన్నీ పటాపంచలయ్యాయి. మూడు నెలల వ్యవధిలో ఆదిత్యధర్ రిలీజ్ చేసిన `ధురంధర్`, ధురంధర్ 2` దేశ వ్యాప్తంగా సంలచనం సృష్టించడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జియో పాలిటిక్స్ అంశంతో హాట్ టాపిక్‌గా మారింది.
రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన `ధురంధర్ ది రివేంజ్` విడుదలై 17 రోజులవుతోంది. ఇప్పటి వకు అనేక రికార్డుల్ని బద్దలు కొట్టిన ఈ మూవీ తాజాగా `బాహుబలి` రికార్డుని బ్రేక్ చేసింది. ఎన్నో ఏళ్లుగా నార్త్ అమెరికాలో `బాహుబలి` పేరిట ఉన్న రికార్డుని తాజాగా బ్రేక్ చేసి ఆశ్చర్యపరిచింది. స్పై యాక్షన్ సినిమాలకు ఇండియాలో రోల్ మోడల్‌గా నిలిచిన ఈ సినిమా స్పై యాక్షన్ చిత్రాలు చేస్తున్న మేకర్స్‌కి, డైరెక్టర్స్‌కి ఓ నైట్ మేర్‌లా మారింది. ఆదిత్యధర్ ఈ మూవీల కథ, కథనాలని నడిపించిన తీరు, మేకింగ్ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారి బాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు తెరలేపింది.
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఆదిత్యధర్ చేసిన ఈ సినిమా ఇండియాపై పాక్ జరిపిన దురాగతాలను, అక్కడి వారి కుయుక్తుల్ని ఎండగడుతూ సాగి అందరి ప్రశంసల్ని సొంతం చేసుకుంటోంది. ఇదే ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్‌పై నెట్టింట విమర్శలకు ప్రధాన ఆయుధంగా మారింది. స్పై యూనివర్స్ పేరుతో యష్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పటి వరకు ఆరు సినిమాలు చేసింది. ఏక్‌థా టైగర్ నుంచి ఆ మధ్య విడుదలై వార్ 2 వరకు చేసిన సినిమాల్లో ఇండియన్ రా ఏజెంట్‌లని విలన్స్‌గా చూపిస్తూ సినిమాలు చేసింది.
అంతే కాకుండా ఈ సినిమాలన్నీ ఇండియా - పాకిస్థాన్ నేపథ్యంలో రూపొందినవే. ఇందులో హీరో క్యారెక్టర్ రా ఏజెంట్, విలన్‌లు కూడా రా ఏజెంట్‌లే. అయితే వ్యవస్థపై విసిగిపోయిన మాజీ రా ఏజెంట్‌లని యష్ రాజ్ ఫిల్మ్స్ తమ సినిమాల్లో విలన్‌లుగా చూపిస్తూ వస్తోంది. `ధురంధర్`లో రా ఏజెంట్‌లని హీరోలుగా చూపించడం, వాస్తవంగా జరిగిన పాక్ కుట్రలని చూపించడంతో యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ పై నెట్టింట విమర్శలు పెరుగుతున్నాయి. ఎవరి ఫండింగ్‌తో ఈ సినిమాలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
అంతే కాకుండా `ధురంధర్` ప్రాపగాండ సినిమా అంటూ విమర్శిస్తూ గొంతుచించుకుంటున్న వారు ఇంత కాలం యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ పై ఎందుకు నోరు విప్పలేదని, స్పై యూనివర్స్ పేరుతో యష్ రాజ్ ఫిలింస్ ఇంత కాలం దేశ ద్రేహానికి పాల్పడుతోందనే కామెంట్‌లు నెట్టింట వినిపిస్తున్నాయి. తాజా విమర్శల నేపథ్యంలో యష్ రాజ్ సంస్థ తన తీరు మార్చుకుని స్పై యూనివర్స్‌కి గుడ్ బై చెబుతుందా? లేక ఇదే తరహాలో స్పై సినిమాలని చేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
