Begin typing your search above and press return to search.

ఆమె కామెడీ సవాల్‌ను దొంగలు సీరియస్‌గా తీసుకున్నారట..!

తమిళనాడు పోలీసుల కథనం ప్రకారం ఈ దొంగతనం ప్రధాన నిందితుడు ఇసక్కిపాండిగా గుర్తించారు. 30 ఏళ్ల పాండి చాలా కాలంగా యూట్యూబర్‌ మధుమితను ఫాలో అవుతున్నాడట.

By:  Ramesh Palla   |   1 Oct 2026 10:34 AM IST
ఆమె కామెడీ సవాల్‌ను దొంగలు సీరియస్‌గా తీసుకున్నారట..!
X

తమిళనాడు యూట్యూబర్‌ మధుమిత ఇంట్లో దొంగతనం జరిగిన విషయం తెల్సిందే. ఆమె తన పూజ గదిలో బంగారం, డబ్బు చూపిస్తూ చేసిన ఒక వీడియో యూట్యూబ్‌లో వైరల్‌ అయింది. ఆ వీడియో షేర్ చేసిన కొన్ని రోజులకే ఆమె ఇంట్లో దొంగలు పడి బంగారం, వజ్రాలు, నగదు ఎత్తుకు వెళ్లిన విషయం తెల్సిందే. మధుమిత ఇంట్లో దొంగలు పడ్డ తర్వాత చాలా మంది యూట్యూబ్‌లో ఆమె వీడియో షేర్‌ చేయడం వల్లే దొంగతనం జరిగిందంటూ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. దొంగలు యూట్యూబ్‌ వీడియో చూసిన తర్వాత ఆమె ఇంట్లో కి చొరబడి దొంగతనం కు పాల్పడిన ఉండవచ్చు అని అంతా భావించారు. ఆ దిశగా పోలీసులు ఎంక్వయిరీ చేశారు. మధుమిత ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతా అనుకున్నట్లుగానే దొంగలు యూట్యూబ్‌ వీడియో చూసి దొంగతనంకు పాల్పడ్డట్లుగా విచారణలో వెళ్లడించారట.

యూట్యూబర్‌ మధుమిత ఇంట్లో చోరి...

తమిళనాడు పోలీసుల కథనం ప్రకారం ఈ దొంగతనం ప్రధాన నిందితుడు ఇసక్కిపాండిగా గుర్తించారు. 30 ఏళ్ల పాండి చాలా కాలంగా యూట్యూబర్‌ మధుమితను ఫాలో అవుతున్నాడట. ఆమె వీడియోలను రెగ్యులర్‌గా చూస్తాడట. ఇటీవల ఆమె షేర్ చేసిన డబ్బు, బంగారం వీడియోను చూసిన తర్వాత పాండి దొంగతనం చేయాలని ఆలోచన చేశాడట. ఆ వీడియోలో యూట్యూబర్‌ మధుమిత తన ఇంట్లో ఎంత పెద్ద దొంగ అయినా కూడా దొంగతనం చేయలేడు అని చెప్పింది. దాన్నే సవాల్‌గా తీసుకుని పాండి మరియు అతడి టీం మెంబర్స్ దొంగతనంకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె ఇచ్చిన సవాల్‌ ను స్వీకరించి దొంగతనం చేసినట్లుగా పోలీసుల వద్ద పాండి చెప్పాడని సమాచారం అందుతోంది. పోలీసుల ముందు దొంగలు చెప్పిన ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

పోలీసుల విచారణలో...

యూట్యూబ్‌లో వ్యూస్‌ కోసం సరదాగా తన వద్ద ఉన్న బంగారం, డబ్బు, వజ్రాలు చూపించిన మధుమిత సరదాగా తన ఇంట్లో దొంగలు పడరని, నా ఇంట్లోకి చొరబడలేరు అంటూ కామెడీగా దొంగలకు సవాల్‌ విసిరింది. మధుమిత సరదాగా ఆ వ్యాఖ్యలు చేసినా దొంగలు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు. అంత డబ్బు కళ్ల ముందు కనిపిస్తుంది, అంత బంగారం ఇంట్లోనే ఉంది అన్నప్పుడు దొంగలు ప్రయత్నించకుండా ఎలా ఉంటారు. అసలే అప్పులు ఉన్న తాను ఆ దొంగతనం చేస్తే సెటిల్‌ కావచ్చు అనే ఉద్దేశంతో ఆమె ఇంటికి దొంగతనంకు వెళ్లినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నాడట. ఆమె ఇచ్చిన సవాల్‌ను సీరియస్‌గా తీసుకుని దొంగతనంకు వెళ్లినట్లుగా దొంగలు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారట. ఆమె స్వయంగా తన ఇంటికి దొంగలను ఆహ్వానించినట్లు అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌...

సోషల్‌ మీడియాలో చిన్నా పెద్దా సెలబ్రిటీలు అందరూ హోం టూర్‌ అని, ఆ టూర్‌ ఈ టూర్ అని తమ ఇంట్లో ఉన్న వస్తువులు అన్నింటిని చూపిస్తున్నారు. అంతే కాకుండా తమ ఇంటికి ఎక్కడ నుంచి రావాలి, ఎలా రావాలి, ఏ బెట్‌ రూం ఎక్కడ ఉంది అనే విషయాలు అన్నింటిని ఆ టూర్‌లో చూపించడం వల్ల దొంగలకు దొంగతనం చాలా ఈజీ అవుతుంది. మధుమిత ఉదంతం తర్వాత యూట్యూబర్స్ ఎవరూ హోం టూర్‌ చేయక పోవచ్చు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈజీగా ఇంటి వెనుక వైపు నుంచి వచ్చి మధుమిత ఇంట్లో దొంగతనం కు పాల్పడటంకు కారణం ఆమె ఇల్లు మొత్తం చూపించడమే అని కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ దొంగతనం కేసులో నిందితులను పోలీసులు పట్టుకోవడంతో మధుమిత ఊపిరి పీల్చుకుంటుంది. ఇప్పటికే ఆమె బంగారం రికవరీ అయినట్లు తెలుస్తోంది. కొంత డబ్బును దొంగలు ఖర్చు చేశారట. ఈ తన సవాల్‌ వల్లే దొంగతనం జరిగిన విషయమై మధుమిత ఎలా స్పందిస్తుందో చూడాలి.