ఓజీలో యూట్యూబ్ స్టార్.. మీరు గమనించారా?
ఇంతకీ, ఆ నటుడు ఎవరో కాదు, తెలుగులో పలు యూట్యూబ్ ఛానెళ్లలో కనిపించే వ్యక్తే. అతడి పేరు కశ్యప్.
By: M Prashanth | 25 Sept 2025 5:08 PM ISTఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే.. అందుకే ఎవరైనా కొత్త కొత్త నటీనటులపైనే ఆడియెన్స్ దృష్టి మళ్లుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వ్యక్తులు, ఇన్ ఫ్ల్యూయెన్సర్లకు కూడా దర్శకులు అవకాశాలు కల్పిస్తున్నారు. చిన్నదో పెద్దదో పాత్రలు ఇచ్చి వాళ్లను కూడా పెద్ద తెరపై చూపిస్తున్నారు. తాజాగా రిలీజైన ఓజీలోనూ అలాంటి ఓ క్యారెక్టర్ కనిపించింది.
ప్రస్తుతం ఓజీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఎన్నో రోజుల ఎదురుచూపులు, అంచనాల మధ్య ఓజీ తాజాగా రిలీజైంది. అయితే ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ ను ప్రేక్షకులు గమనించారు. ఓ కొత్త నటుడిని సినిమాలో చూశారు. ఇందులో అనూహ్యంగా ఒక కొత్త నటుడు ఎంట్రీ ఇచ్చారు. అతడు ఎవరో సినిమా చూస్తున్నప్పుడు అందరికీ తెలియకపోయినా.. తెలిసిన వాళ్లు మాత్రం గుర్తు పట్టేశారు.
ఇంతకీ, ఆ నటుడు ఎవరో కాదు, తెలుగులో పలు యూట్యూబ్ ఛానెళ్లలో కనిపించే వ్యక్తే. అతడి పేరు కశ్యప్. ఈ కశ్యప్ ఆయా ఛానెళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యాడు. అతడు ఓ సైకాలజిస్ట్. అంతాకాకుండా కశ్యప్ తనను తాను ఓ మోటివేషనల్ స్పీకర్ గా చెప్పుకుంటాడు. ఈ సైకాలిజిస్ట్ పవన్ కళ్యాణ్ తాజా సినిమాలో విలన్ గ్యాంగ్ లో ఓ మెంబర్ గా కనిపించాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ పై కూడా కనిపించాడు.
దీంతో అతడు సోషల్ మీడియాలో మరింత ఫేమస్ అయిపోయాడు. సినిమాలో అతడికి సంబంధించి ఒకట్రెండు సీన్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఎంతైనా అతడికి సూపర్ అవకాశం దక్కిందని, సినిమాల్లోకి వెళ్లడమే కాదు, తొలి సినిమానే పవన్ కళ్యాణ్ తో నటించడం అదృష్టం అంటూ కశ్యప్ ను నెటిజన్లు పొగిడేస్తున్నారు.
కాగా కశ్యప్ కు యూట్యూబ్ లో ఓ ఛానెల్ ఉంది. ఎమ్ వీ ఎన్ కశ్యప్ ఛానెల్ పేరు. ఆయన ఛానెల్ కు 53 వేల మంది సబ్ స్క్రైబర్లు ఉండడం విశేషం. అందులో అతడు మోటివేషన్ స్పీచ్, ఇంటర్వ్యూలో అప్ లోడ్ చేస్తుంటాడు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు పదుల సంఖ్యలో అప్ లోడ్ చేశాడు.
ఇక సినిమా విషయానికొస్తే.. సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గురువారం థియేటర్లలో విడుదలైంది. ఇందులో పవన్ కు జంటగా హీరోయిన్ ప్రియాంక మోహన్ నటించింది. విలన్ గా ఇమ్రాన్ హష్మి పాత్ర పోషించారు. ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు.
