Begin typing your search above and press return to search.

ఆ యంగ్ హీరో ఇంట శుభ‌వార్త‌?

నిజానికి ఆ యంగ్ హీరో వివాహం ప్రేక్ష‌కాభిమానుల‌కు ఓ షాకింగ్ లాంటిందే. సాధార‌ణంగా హీరోలంతా బాగా స్థిర‌ప‌డే వ‌ర‌కూ పెళ్లిళ్లు చేసుకోరు.

By:  Srikanth Kontham   |   23 Oct 2025 8:00 PM IST
ఆ యంగ్ హీరో ఇంట శుభ‌వార్త‌?
X

ఈ మ‌ధ్య కాలంలో వివాహాల‌తో టాలీవుడ్ క‌ళ‌క‌ళ‌లాడుతోన్న సంగ‌తి తెలిసిందే. వివాహాల విష‌యంలో హీరోలు పెద్ద‌గా ఆల‌స్యం చేయ‌డం లేదు. ఏ వ‌య‌సులో చేయాల్సిన ప‌నులు ఆ వ‌య‌సులో చేయాలంటూ ప్ర‌ణాళిక‌తో కెరీర్ ని ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో వివాహం విష‌యంలో కూడా కొంత మంది తార‌లు ఎంత మాత్రం ఆల‌స్యం చేయ‌డం లేదు. ఇటీవ‌లే అలా ఓ పేరున్న కుటుంబంలో ఓయువ న‌టుడు పెళ్లి చేసుకున్నాడు. ఎంతో వైభ‌వంగా ఆ వివాహం జ‌రిగింది. టాలీవుడ్ అంతా అత‌డి కోసం క‌దిలి వ‌చ్చింది. నూత‌న వ‌ధువ‌రూల‌ను ఆశీర్వ‌దించారు.

వివాహ‌మే ఓ షాకింగ్:

నిజానికి ఆ యంగ్ హీరో వివాహం ప్రేక్ష‌కాభిమానుల‌కు ఓ షాకింగ్ లాంటిందే. సాధార‌ణంగా హీరోలంతా బాగా స్థిర‌ప‌డే వ‌ర‌కూ పెళ్లిళ్లు చేసుకోరు. జీవితాన్ని కాస్త ఆస్వాదించాల‌నే ఆలోచ‌న‌తో ఉంటారు. కానీ భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆ న‌టుడు మాత్రం అలాంటి ఆలోచ‌న లేకుండా నేరుగా పెళ్లితో స‌ర్ ప్రైజ్ చేయ‌డం విశేషం. తాజాగా ఆ జంట గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఇప్పుడా జోడీ త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. ఆ యువ హీరో భార్య ఇటీవ‌లే గ‌ర్భం దాల్చింద‌న్న టాక్ న‌డుస్తోంది.

ఓపెన్ గా విష‌యం చెప్పే కుటుంబం:

మ‌రి ఈ ప్ర‌చారంలో నిజాలు అనేవి అధికారికంగా వెల్ల‌డించే వ‌ర‌కూ గానీ క్లారిటీ రావు. సాధార‌ణంగా ఇలాంటి విష యాలు టాలీవుడ్ సెల‌బ్రిటీలు ఓపెన్ అవ్వ‌రు. వీలైనంత వ‌ర‌కూ ర‌హ‌స్యంగా ఉంచ‌డానికే ప్ర‌య‌త్నిస్తుంటారు. అతికొద్ది మంది మాత్ర‌మే ఓపెన్ గా చెబుతుంటారు. అయితే ఈ యువ జంట హిస్ట‌రీలోకి వెళ్తే మాత్రం ఆ కుటుంబం ఇలాంటి విష‌యాల్లో ఓపెన్ గానే ఉంటుంది. అభిమానులుకు ఏదైనా విష‌యం చెప్ప‌డంలో ఎలాంటి దాప‌రికాలు లేకుండానే వ్య‌వ‌హ‌రిస్తుంది. సెల‌బ్రిటీ లైఫ్ కూడా సాధార‌ణ‌మై జీవితం లాంటిదే.

పాత ప‌ద్ద‌తినే ఫాలో అవుతారా?

ఇలాంటి విష‌యాలు వారికి తెలియడం వ‌ల్ల జ‌రిగే న‌ష్ట‌మేముంటుంది? న‌లుగురు ఆశీర్వ‌దిస్తారు? అనే కోణంలోనే ఆ కుటుంబం ఆలోచిస్తుంది. మ‌రి కుమారుడి విష‌యంలో ఆ తల్లిదండ్రుల ఆలోచ‌న‌లు ఏవైనా మారాయా? పాత సంప్ర‌దాయాన్నే పాటిస్తారా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం ఆ యువ హీరో తెలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న స‌తీమ‌ణి మాత్రం బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. ఇద్ద‌రి వృత్తులు వేర్వేరు అయినా? సంపాద‌న మాత్రం భారీగానే ఉంది.