Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్ తో 'అదుర్స్ 2' సాధ్య‌మేనా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నేడు ఓ పాన్ ఇండియా స్టార్. `ఆర్ ఆర్ ఆర్`, `దేవ‌ర` లాంటి విజ‌యాల‌తో తార‌క్ పాన్ ఇండియా ఇమేజ్ ను అందుకున్నాడు.

By:  Srikanth Kontham   |   15 Feb 2026 1:59 PM IST
పాన్ ఇండియా స్టార్ తో  అదుర్స్ 2 సాధ్య‌మేనా?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నేడు ఓ పాన్ ఇండియా స్టార్. `ఆర్ ఆర్ ఆర్`, `దేవ‌ర` లాంటి విజ‌యాల‌తో తార‌క్ పాన్ ఇండియా ఇమేజ్ ను అందుకున్నాడు. త‌దుప‌రి లైన‌ప్ కూడా పాన్ ఇండియాలో అంతే స్ట్రాంగ్ గా ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అనంత‌రం స‌క్సెస్ అయితే తార‌క్ పాన్ ఇండియా ఇమేజ్ రెట్టింపు అవుతుంది. ఈ చిత్రంతో తార‌క్ సోలోగా 1000 కోట్ల క్ల‌బ్లోలోకి అడుగు పెడ‌తాడ‌ని అంచనాలు భారీగా ఉన్నాయి. త‌దుప‌రి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా డైరెక్ట‌ర్ల‌తోనే ప్లాన్ చేస్తున్నాడు.

కొరాట‌ల శివ‌తో `దేవ‌ర‌2`, నెల్స‌న్ దిలీప్ కుమార్, సందీప్ రెడ్డి వంగా, వెట్రీమార‌న్, హ‌ను రాఘ‌వ‌పూడి లాంటి సంచ‌ల‌న డైరెక్ట‌ర్లు క్యూలో ఉన్నారు. వీరంద‌రితో తార‌క్ పాన్ ఇండియా సినిమాలు చేయాల‌ని త‌హ‌త‌హ లాడు తున్నాడు. డైరెక్ట‌ర్ల‌గా వీరంతా ప్ర‌తిభావంతులే. తార‌క్ తో చేసే పాన్ ఇండియా సినిమాతో త్రివిక్ర‌మ్ ఇండియాలో పెను సంచ‌ల‌నంగా మారాల‌న్న‌ది అత‌డి ప్లాన్. దీనిలో భాగంగా ఓ మైథ‌లాజిక‌ల్ స్క్రిప్ట్ ని ఇప్ప‌టికే సిద్దం చేసి పెట్టాడు. `దేవర 2` ఫ‌లితంతో మొద‌టి భాగంపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌న్నింటిని తుడిచిపెట్టాల‌ని కొర‌టాల ఎంతో క‌సిగా ప‌ని చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రాన్ని వేస‌విలో ప‌ట్టాలెక్కిస్తున్న‌ట్లు అధికారికంగానూ ప్ర‌క‌టించారు.

వెట్రీమార‌న్ తో సినిమా చేయాల‌ని తార‌క్ అంతే ఆశ‌గా ఎదురు చూస్తున్నాడు. తానెప్పుడు కథ సిద్దం చేసుకుని వ‌చ్చినా తార‌క్ రెడీ అంటూ రంగంలోకి దూకేస్తాడు. మిగ‌తా ద‌ర్శ‌కుల విష‌యంలోనూ తార‌క్ అంతే పాజిటివ్ గా ఉన్నాడు. ఇలాంటి స‌మ‌యంలో రీజ‌న‌ల్ మార్కెట్లో తార‌క్ సినిమా చేసే ఛాన్స్ తీసుకుంటాడా? లేదా? అన్న‌ది తెలియ‌దు గానీ రైట‌ర్ బృందం మాత్రం `అదుర్స్ 2 `క‌థ రెడీ చేస్తున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే అర‌గంట సినిమా క‌థ సిద్ద‌మైంద‌ని ర‌చ‌యిత కోన వెంక‌ట్ వెల్ల‌డించారు. తార‌క్ లైన్ లో ఉన్న ప్రాజెక్ట్ లు పూర్త‌య్యే లోపు `అదుర్స్ 2` పూర్తి క‌థ‌ను సిద్దం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

వాస్త‌వానికి `అద‌ర్స్` కు సీక్వెల్ చేస్తామ‌ని చాలా కాల్ క్రిత‌మే ద‌ర్శ‌కుడు వినాయ‌క్ ప్ర‌క‌టించారు. `అదుర్స్` హిట్ అయిన నేప‌థ్యంలో ప్రేక్ష‌కాభిమానులు కూడా చాలా కాలంగా అడుగుతున్నారు. వాళ్లు అంతే పాజిటివ్ గా త‌ప్ప‌కుండా చేద్దాం అన్న‌ట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా తార‌క్ పాన్ ఇండియా స్టార్ కాక ముందు మాట‌. కొంత కాలంగా` అదుర్స్ 2` టాపిక్ ఎక్క‌డా రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా సీక్వెల్ పై కోన వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

`అదుర్స్` పూర్తిగా రీజ‌న‌ల్ మార్కెట్ ఆధారిత క‌థ‌. పాన్ ఇండియాకి ఎంత మాత్రం క‌నెక్ట్ అవ్వ‌దు. కామెడీ డ్రాప్ లో సాగే చిత్ర‌మిది. ఒక‌వేళ తార‌క్ ధైర్యం చేసి చేస్తే ప‌రిస్థితి ప్ర‌భాస్ లా అవుతుందా? అన్న సందేహం కూడా అప్పుడే వ్య‌క్త‌మ‌వుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మారుతితో `ది రాజాసాబ్` అనే చిత్రం చేసి ఎలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడో తెలిసిందే.