Begin typing your search above and press return to search.

రాజమౌళికి పోటీగా యువ జట్టు..?

రాజమౌళి ఒక సినిమాకు 3, 4 ఏళ్లు టైం తీసుకుని ప్రతి ఫ్రేం ప్రతి యాస్పెక్ట్ అదిరిపోయేలా చేస్తాడు.

By:  Ramesh Boddu   |   15 Sept 2025 9:00 PM IST
రాజమౌళికి పోటీగా యువ జట్టు..?
X

తీస్తే రాజమౌళిలా సినిమా తీయాలని మగధీర వచ్చినప్పుడు అనుకున్నారు.. అదే బాహుబలి వచ్చాక రాజమౌళిలా మనమెందుకు తీయకూడదు అనే ఆలోచన కలిగేలా చేశాడు. అలా బాహుబలి తర్వాత రాజమౌళిలా కాదు ఆయనకు పోటీ వచ్చేలా సినిమాలు తీద్దామని జట్టు కట్టారు. అఫ్కోర్స్ అదంతా తెలుగు సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగమే అని చెప్పాలి. రాజమౌళి ఒక సినిమాకు 3, 4 ఏళ్లు టైం తీసుకుని ప్రతి ఫ్రేం ప్రతి యాస్పెక్ట్ అదిరిపోయేలా చేస్తాడు.

బడ్జెట్ లో క్వాలిటీ పిక్చర్స్..

ఐతే యువ దర్శకులు అంత టైం కూడా తీసుకోకుండానే ఔరా అనిపిస్తున్నారు. ముఖ్యంగా లో బడ్జెట్ లో ఆ క్వాలిటీ పిక్చర్స్ తీయడం చూసి ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. రాజమౌళి తర్వాత తెలుగులో అంత పెద్ద భారీ కాన్వాస్ ని చూపించిన మరో దర్శకుడు నాగ్ అశ్విన్. ఐతే ఈయన కూడా రాజమౌళిలానే భారీ బడ్జెట్ తో 3 ఏళ్లు టైం తీసుకుని కల్కి 2898 AD చేశాడు. ఆ సినిమా హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తక్కువ కాదన్నట్టు ఉంది. కానీ దానికి బడ్జెట్ కూడా అంతే అయ్యింది.

ఐతే రాజమౌళి, నాగ్ అశ్విన్ లా కాదు తమకు ఇచ్చిన తక్కువ బడ్జెట్ లోనే బెస్ట్ క్వాలిటీ సినిమా ఇస్తున్నారు యువ దర్శకులు. అందులో ప్రశాంత్ వర్మ, కార్తీక్ ఘట్టమనేని వస్తారు. ప్రశాంత్ వర్మ చేసే ప్రతి సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేస్తూ వచ్చింది. హనుమాన్ తో ఆయన చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల దాకా కలెక్ట్ చేసి సెన్సేషన్ అనిపించుకుంది.

టాప్ క్లాస్ విజువల్ ట్రీట్..

ఇక నెక్స్ట్ ఈమధ్యనే వచ్చిన మిరాయ్ సినిమా కూడా టాప్ క్లాస్ విజువల్ ట్రీట్ అందిస్తుంది. సినిమా చూసిన ఆడియన్స్ విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. కార్తీక్ మాత్రమే కాదు శ్రీకాంత్ ఓదెల దసరాతో సత్తా చాటాడు. ఇప్పుడు ది ప్యారడైజ్ అంటూ మరో కొత్త సంచలనం సృష్టించబోతున్నాడు.

రాజమౌళి కి పోటీగా ఈ యువ జట్టు అదరగొట్టేస్తుంది. అఫ్కోర్స్ ఎవరు ఎన్ని చేసినా రాజమౌళి బ్రాండ్ కి ఉన్న డిమాండ్ వేరు.. ఆ సినిమాల లెక్క వేరు. కానీ తాము కూడా రాజమౌళికి ఏమాత్రం తీసిపోం అనేలా తమ సినిమాలతో ప్రూవ్ చేసుకుంటున్నారు యువ దర్శకులు. ఐతే రాజమౌళిలా కాన్ స్టంట్ హిట్లు కొడతారా లేదా అన్నది తెలియదు కానీ ఆయన రేంజ్ సినిమాలైతే అందిస్తారని చెప్పడంలో సందేహం లేదు. యంగ్ డైరెక్టర్స్ నుంచి వస్తున్న ఈ పోటీని అంతే ఆరోగ్యదాయకంగా తీసుకుని వాళ్లకి మరింత టఫ్ ఫైట్ ఇవ్వాలని సినీ ప్రియులు ఆశిస్తున్నారు.