Begin typing your search above and press return to search.

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల హవా!

మ్యూజిక్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సీనియర్ సంగీత దర్శకుల హవా నడిచిన చోట నేడు పూర్తిగా యువ సంగీత దర్శకులదే పైచేయి అవుతోంది.

By:  Srikanth Kontham   |   27 Aug 2026 10:00 PM IST
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల హవా!
X

మ్యూజిక్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సీనియర్ సంగీత దర్శకుల హవా నడిచిన చోట నేడు పూర్తిగా యువ సంగీత దర్శకులదే పైచేయి అవుతోంది. ముఖ్యంగా సౌత్ సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీలో అనిరుధ్ రవిచందర్, జి.వి. ప్రకాష్ కుమార్, సాయి అభ్యంకర్, ర‌వి బ‌స్రూర్ వంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు పాన్ ఇండియా లెవెల్‌లో అగ్రస్థానంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ ట్రెండ్‌లో ముందు వరుసలో ఉన్న అనిరుధ్ రవిచందర్ తనదైన మాస్ బీట్స్, హై-ఓల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దేశవ్యాప్తంగా యూత్ ను ఉర్రూతలూగిస్తున్నారు.

అగ్ర హీరోల సినిమాలకు ఆయన అందించే సంగీతం సినిమా ఫలితాన్నే పూర్తిగా మార్చేస్తోంది. పాటలే కాకుండా సన్నివేశాలకు ఆయన ఇచ్చే ఆర్కెస్ట్రా రేంజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటోంది. అందుకే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు దర్శక నిర్మాతలు అనిరుధ్ వైపే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. క‌థ బ‌ల‌హీనంగా ఉన్నా నేప‌థ్య సంగీతంతో మ్యానేజ్ చేయ‌డంలో అనిరుద్ స్పెష‌లిస్ట్ గా మారిపోయాడు. అనిరుద్ బిజీఎం కోస‌మైనా ఓసారి థియేట‌ర్ కి వెళ్లి సినిమా చూడొచ్చు అన్న పాజిటివ్ ఇంప్రెష‌న్ ప్రేక్ష‌కుల్లో క‌నిపిస్తోంది.

సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి హీరోగానూ, నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాణిస్తున్న జి.వి. ప్రకాష్ కుమార్ సత్తా చాటుతున్నారు. విభిన్నమైన జానర్లు, భావోద్వేగాలతో కూడిన మెలోడీలు ఇస్తూనే మరోవైపు పవర్‌ఫుల్ యాక్షన్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. అనుభవం, సృజనాత్మకత రెండింటిని సమపాళ్లలో మిళితం చేస్తూ ప్ర‌కాష్ ట్రెండ్‌లో నిలుస్తున్నారు.

అలాగే ఇటీవలి కాలంలో సంచలన విజయాలతో దూసుకుపోతున్న సాయి అభ్యంకర్ ప్రత్యేక శైలితో సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా యూత్ ఆశించే రిథమ్స్‌ను అందిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల సరసన నిలిచారు. విభిన్న జానర్ల భారీ ప్రాజెక్టులకు సంగీతం అందిస్తూ సినిమాల సక్సెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లందరూ సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

పాటల హిట్టే కాకుండా.. థియేటర్లలో ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో అద్భుతాలు చేస్తున్నారు. సినిమా ఎంత గొప్పగా ఉన్నా? సంగీతం సరిగ్గా లేకపోతే ఆదరణ కష్టమనే రోజుల్లో తమ మ్యూజిక్‌తో సినిమాలను బ్లాక్‌బస్టర్‌లుగా మారుస్తున్నారు. అలాగే `కేజీఎఫ్` తో సంచ‌ల‌న‌మైన ర‌వి బ‌స్రూర్ కూడా వ‌య‌సులో పెద్ద‌వాడైనా ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ లో మారుమ్రోగిపోతున్న పేరు. భారీ యాక్ష‌న్ చిత్రాల‌కు సంగీతం అందించాలంటే ర‌వినే ఎంచుకుంటున్నారు. పాన్ ఇండియా క‌థ‌ల‌కు ఆ రేంజ్ డైరెక్ట‌ర్ కావాలంటూ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ తీసుకుంటున్నారు.

మొత్తానికి సౌత్ సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్న యంగ్ సెన్సేషన్స్ ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్తున్నారు. అప్ క‌మింగ్ ప్రాజెక్స్ట్ తో మ‌రిన్ని వైవిధ్యమైన ట్యూన్స్ సంగీత ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయం.