Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో క్రేజీ ఛాన్సులు కొట్టేస్తున్న కొత్త భామ‌లు!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల కోసం పక్కాగా వేచి చూసే టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు సరికొత్త ముఖాలకు ప్రధాన్యత ఇస్తూ ఫ్రెష్ కాంబినేషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారు

By:  Srikanth Kontham   |   30 Oct 2026 7:00 PM IST
టాలీవుడ్‌లో క్రేజీ ఛాన్సులు కొట్టేస్తున్న కొత్త భామ‌లు!
X

తెలుగు చిత్రపరిశ్రమలో కొత్త తరం గ్లామర్ హవా నడుస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల కోసం పక్కాగా వేచి చూసే టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు సరికొత్త ముఖాలకు ప్రధాన్యత ఇస్తూ ఫ్రెష్ కాంబినేషన్లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ట్యాలెంట్.. ఫ్రెష్ లుక్స్ .. ఆన్-స్క్రీన్ ప్రజెన్స్‌తో అనస్వర రాజన్, సారా అర్జున్, రితికా నాయక్, శనయా కపూర్ లాంటి యువ భామ‌లు వరుసగా స్టార్ హీరోల ప్రాజెక్టులలో అవ‌కాశాలు అందుకుంటున్నారు.

మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనస్వర రాజన్ తెలుగులోకి అడుగుపెడుతూనే ఇక్కడ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. నేచురల్ పెర్ఫార్మెన్స్.. ఆకర్షణీయమైన రూపంతో యంగ్ హీరోల సినిమాలకు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా మారింది. `విక్రమార్కుడు`, `దైవతిరుమగల్` (నాన్న) చిత్రాలతో బాలనటిగా ఆకట్టుకున్న సారా అర్జున్ ఇప్పుడు నాయికగా ప్రమోట్ అయి ప్రశాంత్ నీల్, మణిరత్నం వంటి దిగ్గజాల దృష్టిలో పడటమే కాకుండా టాలీవుడ్‌లో సరికొత్త లీడ్ రోల్స్ దక్కించుకుంటోంది.

మరోవైపు `అశోకవనంలో అర్జున కల్యాణం` సినిమాతో వైవిధ్యమైన నటనతో హైలైట్ అయిన రితికా నాయక్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును కట్టిపడేసింది. ఈ విజయంతో అమ్మ‌డికి టాలీవుడ్‌లో ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌసెస్ నుండి వరుస అవకాశాలు అందుతున్నాయి. బాలీవుడ్ స్టార్ కిడ్ శనయా కపూర్ కూడా నేరుగా దక్షిణాది చిత్రసీమపై దృష్టి సారించి భారీ బడ్జెట్ సినిమాలతో పాన్-ఇండియా రేంజ్‌లో ఎంట్రీకి సిద్ధమై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

వీరితో పాటు `ప్రేమలు` చిత్రంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందిన మమితా బైజు, `డ్రాగన్`.. `ది ప్యారడైజ్` చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న కయాదు లోహర్ వంటి భామలు కూడా తెలుగులో భారీ ప్రాజెక్టులను దక్కించుకుంటున్నారు. అలాగే `బేబి` సినిమాతో సెన్సేషన్ సృష్టించిన వైష్ణవి చైతన్య.. `ఆయ్` మూవీతో మెప్పించిన నయన్ సారిక కూడా వరుస క్రేజీ ఛాన్సులతో తెలుగులో బిజీ హీరోయిన్లుగా మారుతున్నారు.

కొత్తదనానికి పెద్ద పీఠం వేసే తెలుగు పరిశ్రమలో యంగ్ బ్యూటీల ఎంట్రీ డిమాండ్‌ను మరింత పెంచుతుంది. అందాల‌ ప్రదర్శనకే పరిమితం కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మేకర్స్ నమ్మకాన్ని గెలుచుకుంటున్నారు. దర్శకులు కూడా పాత కాంబినేషన్లను రిపీట్ చేయకుండా కొత్త తరం కథానాయికలను ఎంచుకోవడానికి ముందుకొస్తున్నారు.

అంతిమంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయికల జోరు రాబోయే రోజుల్లో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. స‌రికొత్త గ్లామర్.. విలక్షణమైన నటనతో తెలుగు తెరపై భామ‌ల హడావుడి ప్రేక్షకులకు కూడా సరికొత్త అనుభూతిని అందిస్తోందన్న‌ది కాద‌నలేని నిజం.