Begin typing your search above and press return to search.

యంగ్ హీరోల పక్కా ప్లాన్.. లేకుంటే కష్టం కదా!

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అందులో కొందరు మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్‌ డమ్ దిశగా దూసుకుపోతారు.

By:  M Prashanth   |   30 March 2026 7:00 AM IST
యంగ్ హీరోల పక్కా ప్లాన్.. లేకుంటే కష్టం కదా!
X

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అందులో కొందరు మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్‌ డమ్ దిశగా దూసుకుపోతారు. మరికొందరు మాత్రం కాస్త సమయం తీసుకుని తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. ఇంకొందరు అనూహ్యంగా ఒక్కసారిగా లైమ్‌ లైట్‌ లోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తారు.

అయితే, ఇటీవల యంగ్ హీరోల విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం హీరోలు కేవలం అవకాశాలు రావడం కోసం ఎదురుచూడకుండా, ముందుగానే పక్కా ప్లాన్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే కథ, దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా కీలక పాత్ర పోషిస్తారనే అవగాహన వారికి పెరిగింది.

దీంతో ప్రాజెక్ట్ ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇంతకుముందు కొత్త హీరోలు అవకాశాల కోసం నిర్మాతల దగ్గరకు వెళ్లి సినిమాలు చేయడానికి త్వరపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యంగ్ హీరోలు నిర్మాతల బ్యాక్‌ గ్రౌండ్‌ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సినిమా కమిట్ అయ్యే ముందు ఆ నిర్మాత ఎవరు, వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, గతంలో చేసిన సినిమాలు ఎలా ప్రదర్శించాయి వంటి అంశాలను పరిశీలిస్తున్నారట.

ముఖ్యంగా ప్రాజెక్ట్‌ను మధ్యలో ఆపకుండా పూర్తి చేసే సామర్థ్యం ఉందా లేదా అన్నది ఇప్పుడు హీరోలు ఎక్కువగా గమనిస్తున్న అంశంగా తెలుస్తోంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఫైనాన్స్ సమస్యల వల్ల సినిమాలు నిలిచిపోవడం లేదా ఆలస్యమవడం జరుగుతోంది. దీనివల్ల హీరోల కెరీర్‌ పై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. పలు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, యంగ్ హీరోలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అంతేకాకుండా, సినిమా పూర్తి అయిన తర్వాత సరైన రీతిలో విడుదల చేయగల సామర్థ్యం కూడా నిర్మాత వద్ద ఉందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రిలీజ్ ప్లానింగ్, ప్రమోషన్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌ వర్క్ వంటి అంశాలు కూడా ఇప్పుడు హీరోల నిర్ణయంలో కీలకంగా మారాయి. మంచి కథ ఉన్నా, సరైన విడుదల లేకపోతే సినిమా ప్రేక్షకుల వరకు చేరకపోవచ్చు అనే అవగాహన వారికి ఉంది.

మొత్తానికి, యంగ్ హీరోలు ఇప్పుడు కెరీర్‌ను చాలా సీరియస్‌ గా తీసుకుంటూ, ప్రతి అడుగులో కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని చెప్పాలి. సరైన ప్రణాళిక, జాగ్రత్తలు లేకపోతే ఇండస్ట్రీలో నిలబడటం కష్టమనే విషయం వారికి బాగా అర్థమైందేమో. ఈ మార్పు ఫ్యూచర్ లో మంచి కంటెంట్‌ తో కూడిన సినిమాలకు దారితీస్తుందని అనేక మంది సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.