ఇండస్ట్రీలో అతడు ఓ టైంపాస్ హీరోలా!
ఓ నటుడు ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటింది. చేసిన సినిమాల సంఖ్య చూస్తే 20కి పైగానే ఉంది.
By: Srikanth Kontham | 30 Sept 2025 12:00 AM ISTఏ హీరోకైనా వెనుక విజయం ఉంటేనే కొత్త అవకాశాలు వస్తాయి. మరో నాలుగైదు అడ్వాన్సులు అందుకుంటాడు. విజయం లేకపోతే? అడ్వాన్స్ లు ఇచ్చేది ఎవరు? వారితో సినిమాలు తీసేది ఎవరు? సక్సెస్ ఒక్కటే ముందుకు నడిపిస్తుంది అన్నది అందిరికీ తెలిసిన వాస్తవం. కానీ ఓ హీరోను చూస్తుంటే? సక్సెస్ అన్నది కొందరికే నాకు కాదు. నాకేంటి సక్సస్ లేకపోయినా అవకాశాలు అందుకోగలను అన్న కాన్పిడెన్స్ తో కనిపిస్తున్నాడు. ఓ నటుడు ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు దాటింది. చేసిన సినిమాల సంఖ్య చూస్తే 20కి పైగానే ఉంది.
వాటిలో సక్సెస్ లు ఎన్ని అని వెతికితే మాత్రం మహా అయితే ఓ రెండు..మూడు కనిపిస్తాయి. మరి వాటి వైఫల్యానికి కారణం ఏంటి? అంటే కొన్ని కథలు వైఫల్యం అయితే మరికొన్ని ఆ కథల్లో ఆ నటుడు సెట్ కాకపోవడం అన్నది మరో కారణం. కానీ ఆ హీరో మాత్రం ఇవేమి పట్టకుండా పని చేసుకుంటూ వెళ్లిపోవడమే ఫలితం మాత్రం ఆశించకూడదు అన్నట్లే కనిపిస్తోంది. 15 ఏళ్ల ఆ హీరో కెరీర్ చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్దమవుతోంది. గత రెండు మూడేళ్లగా చూసుకుంటే? ఏడాదిలో రిలీజ్ చేసే సినిమాల సంఖ్య కూడా పెరిగింది.
అప్పటి వరకూ ఏడాదికి ఒక సినిమాతో మాత్రమే రిలీజ్ కు వచ్చే వాడు. కానీ ఆ తర్వాత నుంచి రెండేసి రిలీజ్ చేయడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం మరో రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఓ సినిమాకు సంబంధించి ప్రచారం కూడా జరుగుతోంది. మరి ప్లాప్ ల్లో ఉన్న కూడా అవకాశాలు ఎలా వస్తున్నాయంటే? గొప్పతనం అతడిది కాదు. ఆయనకు అవకాశాలు కల్పిస్తున్న వారిదనక తప్పదు. 15 ఏళ్ల ప్రయాణం ఇలాగే సాగింది. వైఫల్యాలు ఎదురైనా సరైనా సమీక్ష లేకుండా మరో సినిమా చేస్తున్నాడు.
అతడి కోసం నవతరం దర్శకులు అలాగే ఎగబడుతున్నారు. నిర్మాతలు అంతే చొరవతో ముందుకొస్తున్నారు. ఇలా అవకాశాలు ఎలా సాద్యమవుతున్నాయి? అన్న కిటుకు ఏంటో చెప్తే బాగుండని ఎదరు చూసే వారు లేకపోలేదు. అయితే ఆ యంగ్ హీరో బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటుడు. ఓ పెద్ద హీరోకు బంధువు అవుతాడు. ఆ అగ్ర హీరో ఛరిష్మా అతడికి కొంత వరకూ కలిసొస్తుంది. ఆ హీరోతో సినిమా తీస్తే థియేటర్లకు సమస్య ఉండదు. రిలీజ్ సులభంగా జరుగుతుంది అన్నతో ఆశతో ముందుకొచ్చే వారు ఎక్కువ. కానీ ఆ హీరో వైఫల్యాలు చూస్తుంటే? ఇండస్ట్రీలో టైంపాస్ గానే సినిమాలు చేస్తున్నాడా? అన్న డౌట్ రాక మానదు.
