యంగ్ బ్యూటీ.. ఆ ఒక్క నిర్ణయంతో కెరీర్ గాడిలో పడుతుందా?
సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉన్నా, సరైన కథలు ఎంచుకోకపోతే ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా వెనుకబడిపోవాల్సిందే.
By: M Prashanth | 6 May 2026 2:32 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉన్నా, సరైన కథలు ఎంచుకోకపోతే ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా వెనుకబడిపోవాల్సిందే. ఒకప్పుడు కేవలం గ్లామర్ పాత్రలతో నెట్టుకొచ్చిన రోజులు పోయాయి, ఇప్పుడు ఆడియన్స్ కంటెంట్ ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. ఈ విషయాన్ని లేటుగానైనా పక్కాగా అర్థం చేసుకుంది ఒక పాపులర్ యంగ్ హీరోయిన్. ఇన్నాళ్లూ తన కెరీర్ విషయంలో సొంత మనుషులపై, తన సన్నిహితుల జడ్జిమెంట్‌పై ఆధారపడిన ఈ బ్యూటీ, ఇప్పుడు తన పద్ధతిని పూర్తిగా మార్చేసింది.
వరుసగా ఎదురైన కొన్ని పరాజయాలు ఆమెను ఆలోచనలో పడేయడమే కాకుండా, తన టీమ్‌ను రీస్ట్రక్చర్ చేసుకునేలా చేశాయి. గతంలో ఈ హీరోయిన్ తన వద్దకు వచ్చే సినిమాలను కేవలం రెమ్యునరేషన్ లేదా బడ్జెట్ వంటి కమర్షియల్ లెక్కల ఆధారంగానే ఓకే చేసేదనే టాక్ ఉండేది. ప్రాజెక్ట్ సైజు పెద్దగా ఉంటే చాలు, కథలో బలం లేకపోయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేది. కానీ ఈ పద్ధతి వల్ల ఆమెకు విజయాల కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి.
అందుకే ఇప్పుడు ఆ పాత పద్ధతికి గుడ్ బై చెప్పేసి, కేవలం కంటెంట్ తో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. దీనికోసం ఆమె ఏకంగా ఒక ప్రొఫెషనల్ టీమ్‌ను సెట్ చేసుకున్నట్లు సమాచారం. తన వద్దకు వచ్చే కథలను వడకట్టడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఆమె నియమించుకున్నారట. స్క్రిప్ట్ లోని లోతుపాతులను, తన పాత్రకు ఉండే ప్రాధాన్యతను జాగ్రత్తగా పరిశీలించే బాధ్యతను ఆ పర్సన్‌కు అప్పగించింది.
గతంలోలాగా కేవలం అడ్వాన్స్ అమౌంట్ చూసి కాకుండా, ఆ కథకు ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సత్తా ఉందా లేదా అని ఆ కన్సల్టెంట్ నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి ఇచ్చే ఫీడ్‌బ్యాక్ తో పాటు తన సన్నిహితులతో కూడా చర్చించి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటుందట. అంటే ఇప్పటివరకు తన కెరీర్‌ను నడిపించిన ఆప్తులకు ఇప్పుడు కేవలం డేట్స్, ఫైనాన్షియల్ డీల్స్ చూసుకునే బాధ్యతను మాత్రమే పరిమితం చేసినట్లు సమాచారం.
కెరీర్ ట్రాక్ మిస్ అయినప్పుడు కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తప్పవు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కేవలం కమర్షియల్ లెక్కల మీద కాకుండా, క్రియేటివ్ వైపు ఫోకస్ పెట్టడం అనేది తెలివైన నిర్ణయం. దీనివల్ల ఆమెకు పారితోషికం పరంగా కొన్ని పెద్ద ఆఫర్లు మిస్ అవ్వొచ్చు కానీ, లాంగ్ రన్‌లో మాత్రం మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది.
ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ త్రిష, నయనతార, ప్రియమణి లాంటి వారికి ఇంకా డిమాండ్ ఉంది అంటే వారు గతంలో తెచ్చుకున్న గుర్తింపే. కంటెంట్ తో నటిగా ఆడియెన్స్ లో ఓ క్రేజ్ అందుకుంటేనే లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇక ప్రస్తుతం సదరు హీరోయిన్ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ కొత్త ఫిల్టరింగ్ ప్రాసెస్ తర్వాతే ఓకే అయినవని తెలుస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ కథలు, ప్రయోగాత్మక చిత్రాలపై ఆమె ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. మరి రాబోయే సినిమాలు అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.
