సెన్సార్ బోర్డును క్లారిటీ ఇమ్మంటూ బాంబో కోర్టు ఆదేశాలు!
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవిత కథ ఆధారగా రూపొందిన మూవీ అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి. ప్రస్తుతం ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 1 Aug 2025 3:31 PM ISTఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవిత కథ ఆధారగా రూపొందిన మూవీ అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి. ప్రస్తుతం ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. బయోపిక్ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు కోర్టును ఆశ్రయించారు.
కోర్టుని ఆశ్రయించిన దర్శకనిర్మాతలు
రీసెంట్ గా ఈ సినిమా సెన్సారుకు వెళ్లగా, సెన్సార్ బోర్డు సినిమా చూశాక సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో దీన్ని వ్యతిరేకిస్తూ చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన కోర్టు సెన్సార్ బోర్డును పలు ప్రశ్నలతో సంధించింది. ఈ సినిమాను గత 8 సంవత్సరాలుగా ఎంతో ఆదరణ పొందుతున్న ఓ నవల ఆధారంగా రూపొందించినట్టు దర్శకనిర్మాతల తరపు లాయర్ కోర్టులో వాదించారు.
సెన్సార్ రిజెక్ట్ చేయడానికి కారణాలేంటి?
అంతటి ప్రజాదరణ ఉన్న పుస్తకంపై రాని అభ్యంతరాలు, ఆ బుక్ ఆధారంగా రూపొందించిన సినిమాకు ఎందుకొస్తుందని అడుగుతూ, అసలు సినిమాకు సెన్సార్ ను ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా తెలిపాలని కోరు సెన్సార్ బోర్డును ఆదేశించింది. బుక్ వల్ల ఎలాంటి ఇబ్బంది, వ్యతిరేకత రానప్పుడు, సినిమా సమాజాన్ని ఎలా తప్పుదోవ పట్టిస్తుందో క్లారిటీ ఇవ్వాలని ఆదేశిస్తూ సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది.
కీలక పాత్రలో పరేష్ రావల్
వాదనల్లో భాగంగా చిత్ర నిర్మాతల తరపు న్యాయవాదులు, బోర్డు సభ్యులు సినిమా మొత్తం చూడకుండా కేవలం ట్రైలర్ ను బేస్ చేసుకుని సర్టిపికెట్ ను నిరాకరించారని, అది కరెక్ట్ కాదని, సినిమా మొత్తాన్ని చూడాలని కోరారు. కాగా ఈ సినిమా లో అజయ్ మోహన్‌సింగ్ గా అనంత్ జోషి నటించగా, రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించారు. యోగి ఆదిత్యనాథ్ గురువు మహంత్ గా పరేష్ రావల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
