Begin typing your search above and press return to search.

ఎల్లమ్మ.. హీరో సస్పెన్స్ వీడేదెప్పుడు..?

బలగం తో సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండికి మరో భారీ ఆఫర్ ఇచ్చాడు దిల్ రాజు.

By:  Ramesh Boddu   |   28 Aug 2025 1:00 AM IST
ఎల్లమ్మ.. హీరో సస్పెన్స్ వీడేదెప్పుడు..?
X

బలగం తో సూపర్ హిట్ అందుకున్న వేణు యెల్దండికి మరో భారీ ఆఫర్ ఇచ్చాడు దిల్ రాజు. ఈసారి బడ్జెట్ విషయంలో కూడా కోరినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఎల్లమ్మ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా కన్ఫర్మ్ కాగా ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లడమే లేట్ అనేలా మూమెంట్ కనిపించింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ సినిమా హీరో మారేలా ఉన్నాడని టాక్.

తమ్ముడు సినిమా డిజాస్టర్..

నితిన్ తో దిల్ రాజు తమ్ముడు సినిమా తీసి డిజాస్టర్ మూట కట్టుకున్నాడు. ఆ సినిమా విషయంలో తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే.. నితిన్ తమ్ముడు వల్ల దిల్ రాజు భారీగా నష్టపోయారు. అంతేకాదు ఎల్లమ్మ సినిమాకు కూడా దాదాపు 70 కోట్ల పైగానే ఖర్చు వస్తుందట. అందుకే నితిన్ తో ఆ రిస్క్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడట దిల్ రాజు. నితిన్ కూడా పరిస్థితి అర్ధం చేసుకుని సైడ్ అవుతున్నాడట.

కుదిరితే శర్వానంద్ ఎల్లమ్మ సినిమాలో నటించే ఛాన్స్ ఉందట. ఒకవేళ అతను కుదరకపోతే మాత్రం తమిళ హీరోని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. తమిళ్ హీరో అది కూడా క్రేజీ హీరోకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అతనితో ఎల్లమ్మ ప్లాన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. అఫీషియల్ గా చెబితే అది తెలుస్తుంది. తమ్ముడు సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల నితిన్ కి ఒక మంచి సూపర్ హిట్ ఛాన్స్ మిస్ అవుతుంది.

మెయిన్ లీడ్ గా కీర్తి సురేష్..

వేణు కూడా దిల్ రాజు పెట్టిన ఆంక్షలకు తలొగ్గక తప్పట్లేదట. ఎల్లమ్మ సినిమాలో మెయిన్ లీడ్ గా కీర్తి సురేష్ నతిస్తుంది. ఐతే ఈ సినిమా మాత్రమే కాదు దిల్ రాజు నిర్మిస్తూన్నాడు. అమ్మడు ఈ రెండు సినిమాలకు కలిసి రెమ్యునరేషన్ అందుకుంటుందట. మొత్తానికి ఎల్లమ్మ విషయంలో హీరో సస్పెన్స్ ఎప్పుడు క్లియర్ అవుతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

సారి పక్కా కాలిక్యులేషన్స్ తో ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. వేణు యెల్దండి ఎల్లమ్మ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. నితిన్ ఉన్నాడా లేడా లాంటి విషయాలు బయటకు రావాల్సి ఉంది. నితిన్ నుంచి ఈ ప్రాజెక్ట్ వెళ్లింది కాబట్టే విక్రం కుమార్ తో సినిమా లాక్ చేసుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా అప్డేట్స్ పై దిల్ రాజు త్వరలోనే స్పందిస్తారని టాక్.