Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ తో ఆ లక్కీ ఛాన్స్ కోసం..!

బలగం వేణు ఎల్లమ్మ సినిమా చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు సినిమా గురించి మరింత డిస్కషన్ పాయింట్ అయ్యింది.

By:  Ramesh Boddu   |   18 Oct 2025 10:57 AM IST
కీర్తి సురేష్ తో ఆ లక్కీ ఛాన్స్ కోసం..!
X

బలగం వేణు ఎల్లమ్మ సినిమా చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు సినిమా గురించి మరింత డిస్కషన్ పాయింట్ అయ్యింది. నానితో మొదలైన ఎల్లమ్మ హీరో చర్చ నితిన్, శర్వానంద్ తో పాటు ఒక తమిళ హీరోని కూడా పరిగణలోకి తీసుకోగా ఫైనల్ గా దేవి శ్రీ ప్రసాద్ ఆ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడని తెలుస్తుంది. ఐతే డీఎస్పీని ఒప్పించేలా.. అతని తెరంగేట్రం సినిమా అయ్యేందుకు ప్రేరేపించిన అంశాలు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఎల్లమ్మ కథ మీద వేణు చాలా రోజులు వర్క్ చేశాడు. బలగం సినిమా ఎలాగైతే రూటెడ్ లో తీసుకెల్లాడో అలానే ఎల్లమ్మ కథ కూడా అలానే ఉంటుందట.

పల్లెల్లో వేడుకలా జరిగే అమ్మవారి పండగ..

గ్రామదేవతగా ఇప్పటికీ పల్లెల్లో వేడుకలా జరిగే అమ్మవారి పండగ.. దాని చుట్టూ ఉండే ప్రజల నమ్మకాలు.. ఎల్లమ్మ కథా వస్తువుగా రాసుకున్నాడట వేణు యెల్దండి. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ సెలెక్ట్ అయ్యింది. ముందు ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకోవాలని అనుకోగా ఆమె బిజీగా ఉండటం వల్ల కీర్తి సురేష్ ని లాక్ చేశారు. మహానటితో ప్రేక్షకుల మనసులు గెలిచిన కీర్తి సురేష్ ఆ తర్వాత ఆ రేంజ్ స్కోప్ ఉన్న రోల్ దక్కలేదని ఫీల్ అవుతుంది.

అందుకే ఎల్లమ్మ కథ ఆమె దగ్గరకు వచ్చినట్టు అయ్యింది. ఫైనల్ గా ఎల్లమ్మ దేవి శ్రీ ప్రసాద్, కీర్తి సురేష్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే సినిమా అవుతుంది. డైరెక్టర్ వేణు ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా ప్రత్యేకంగా ఇదివరకు ఎప్పుడు తెర మీద చూడని సన్నివేశాలు రాసుకున్నాడట. అందుకే టీం అంతా కూడా సినిమా మీద అంత నమ్మకంగా ఉన్నారు.

దేవత సినిమాతో తెరంగేట్రం..

అంతేకాదు సినిమాపై జరుగుతున్న ఈ స్పెషల్ డిస్కషన్ అంతా కూడా మంచికే అవుతుందని భావిస్తున్నారు. దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ ఎల్లమ్మ అంటే మరో దేవత సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. దాదాపు పాతికేళ్ల సంగీత దర్శకుడి ప్రయాణంలో ఎన్నోసార్లు తనకు హీరో ఆఫర్ వచ్చినా చేయని దేవి శ్రీ ప్రసాద్ ఎల్లమ్మ కోసం రెడీ అయ్యాడంటే అందరు షాక్ అవుతున్నారు.

ఎల్లమ్మ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అందిస్తాడు. సో దేవి సంగీతం పరంగా కూడా ఎల్లమ్మకు భారీ క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఎల్లమ్మతో మరోసారి అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చూస్తుంది కీర్తి సురేష్. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఎల్లమ్మ వస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ ఎల్లమ్మ మూవీలో ఎంటర్ అవ్వడంలో ఆయన పాత్ర మేజర్ గా ఉందని తెలుస్తుంది.