Begin typing your search above and press return to search.

టాక్సిక్ ప్రమోషన్స్ కోసం యశ్ కొత్త స్ట్రాటజీ!

రాకింగ్ స్టార్ యశ్ `కేజీఎఫ్` ఫ్రాంచైజీతో పాన్-ఇండియా స్థాయిలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Srikanth Kontham   |   19 Aug 2026 2:00 PM IST
టాక్సిక్ ప్రమోషన్స్ కోసం యశ్ కొత్త స్ట్రాటజీ!
X

రాకింగ్ స్టార్ యశ్ `కేజీఎఫ్` ఫ్రాంచైజీతో పాన్-ఇండియా స్థాయిలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడాయ‌న న‌టిస్తోన్న‌ మోస్ట్ అవేటెడ్ మూవీ `టాక్సిక్` విషయంలో యశ్ త‌న ప్రమోషన్ స్ట్రాటజీని పూర్తిగా మార్చేశారు. మాస్ ఆడియన్స్‌ను మాత్రమే కాకుండా కార్పొరేట్ , అర్బన్ క్లాస్ ప్రేక్షకులను ప్రధానంగా టార్గెట్ చేస్తూ అనుసరిస్తున్న వ్యూహం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ చిత్ర కథాంశం డ్రగ్ మాఫియా, డార్క్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్‌తో కూడిన విభిన్న ప్రపంచంలో సాగుతుం డటంతో సాధారణ మాస్ ప్రమోషన్లకు బదులు వినూత్నమైన మార్కెటింగ్ పద్ధతులను ఎంచుకున్నారు. `ఏ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్ అప్స్` అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న సినిమాను కమర్షియల్ హంగులకే పరిమితం చేయకుండా అర్బన్ మల్టీప్లెక్స్ క్రౌడ్‌కు లోతుగా కనెక్ట్ అయ్యేలా మేకర్స్ డిజైన్ చేస్తున్నారు.

ఈ కొత్త వ్యూహంలో భాగంగా ప్రచార పద్ధతుల్లోనూ ట్రెడిషనల్ వేను పక్కన పెట్టారు. సాధారణంగా భారీ సినిమాలంటే కటౌట్లు, మాస్ ఈవెంట్లతో హడావిడి చేయడం చూస్తుంటాం. కానీ `టాక్సిక్` కోసం మాత్రం మెట్రో నగరాలు, పెద్ద పెద్ద మాల్స్, మల్టీప్లెక్స్‌లు , మెట్రో స్టేషన్లను వేదికలుగా ఎంచుకుంటున్నారు. అక్కడ భారీ హోల్డింగ్స్, అత్యంత స్టైలిష్ పోస్టర్లతో సరికొత్త తరహా ప్రచారాన్ని ప్లాన్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ హబ్స్, బిజీ అర్బన్ కారిడార్లను టార్గెట్ చేస్తూ ప్రీమియం ఆడియన్స్‌లోకి సినిమాను బలంగా తీసుకువెళ్తున్నారు.

మాస్ ప్రేక్షకులను డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా హోల్డ్ చేస్తూనే, గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్లను మాత్రం పూర్తిగా అర్బన్ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా నడిపిస్తున్నారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే డార్క్ అండ్ బోల్డ్ కథకు మల్టీప్లెక్స్ ప్రేక్షకులు .. కార్పొరేట్ ఉద్యోగులే ప్రధాన బలంగా నిలవనున్నారని యూనిట్ భావిస్తోంది. అందుకే ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నారు.

యశ్ కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటికీ భిన్నంగా టాక్సిక్ ఉండబోతుందనే సంకేతాలు ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ద్వారా స్పష్టమవుతున్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న హీరో అయినప్పటికీ కంటెంట్‌కు తగినట్లుగా మార్కెటింగ్ రూట్‌ను మార్చుకోవడం య‌శ్ వ్యాపార పరిజ్ఞానానికి అద్దం పడుతోంది. ఈ వినూత్న ప్రచార శైలి సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్తున్నాయి.

`టాక్సిక్` కోసం య‌శ్ అనుసరిస్తున్న కార్పొరేట్ - అర్బన్ ప్రమోషన్ స్ట్రాటజీ ఇండియన్ సినిమా రంగంలో కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. కేవలం మాస్ ఇమేజ్‌పైనే కాకుండా? క్లాస్ ఆడియన్స్‌ను సైతం థియేటర్లకు రప్పించేలా ప్లాన్ చేస్తున్న‌ వ్యూహం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.