టాక్సిక్ అసలు పరీక్ష మొదలు... ట్రైలర్‌పై భారీ బాధ్యత!
ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్, అలాగే తబాహి సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి.
By: Sravani Lakshmi Srungarapu | 18 July 2026 10:00 PM ISTభారీ సినిమాల ప్రమోషన్‌లో ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచే సాధనాలే. కానీ సినిమా సక్సెస్ ఛాన్సులపై మొదటిగా స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగించేది మాత్రం ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్. అందుకే ఇప్పుడు యష్ నటిస్తున్న టాక్సిక్ విషయంలో కూడా అందరి దృష్టి ట్రైలర్‌పైనే నిలిచింది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్, అలాగే తబాహి సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. ఇప్పుడు ఆ అంచనాలను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాల్సిన బాధ్యత ట్రైలర్‌పై పడింది.
యష్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయన ప్రతి సినిమా మామూలు రిలీజ్‌లాగా కాకుండా ఒక నేషనల్ లెవెల్ ఈవెంట్‌లా మారుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్‌లో ఆయనకు ఏర్పడిన క్రేజ్ కారణంగా ప్రతి ప్రమోషనల్ మెటీరియల్‌పై ఆడియన్స్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ కేవలం మరో ప్రమోషనల్ కంటెంట్ లాగా మాత్రమే కాకుండా సినిమా టోన్, కథా ప్రపంచం, యాక్షన్ స్థాయి, ఎమోషన్స్, టెక్నికల్ క్వాలిటీ వంటి అంశాలపై ఆడియన్స్ కు పూర్తి స్థాయి అవగాహన ఇచ్చే కీలక ఘట్టంగా మారింది.
టాక్సిక్ నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. అయితే సినమిఆపై ఉన్న ఆసక్తిని నమ్మకంగా మార్చే శక్తి ట్రైలర్‌కే ఉంటుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో ట్రైలర్ ఇంపాక్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి సోషల్ మీడియా ట్రెండ్స్ వరకు ప్రతి అంశంపైనా కనిపిస్తుంది. అందుకే ఈ దశను మేకర్స్ అత్యంత వ్యూహాత్మకంగా తీసుకుంటున్నారు. టాక్సిక్‌ను కేవలం కన్నడ ప్రేక్షకులకే పరిమితం చేయకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సహా అన్ని ప్రధాన మార్కెట్లలో ఒకేసారి స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించే సినిమాగా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. అలాంటి సమయంలో ట్రైలర్ అన్ని భాషలకు చెందిన ఆడియన్స్ ను ఒకే స్థాయిలో ఆకట్టుకునేలా ఉండాల్సిన అవసరం ఉంది. యాక్షన్‌ను ఇష్టపడే వారికి ఒక అంశం, కథకు ప్రాధాన్యం ఇచ్చే వారికి మరో అంశం, విజువల్ గ్రాండియర్ కోరుకునే వారికి ఇంకో ఆకర్షణ కనిపించేలా ట్రైలర్ చాలా బ్యాలెన్డ్స్ గా ఉండాల్సి ఉంటుంది.
గతంతో పోలిస్తే పాన్ ఇండియా స్థాయిలో పోటీ కూడా మరింత తీవ్రమైంది. అందుకే టాక్సిక్ ట్రైలర్‌కు వచ్చే రెస్పాన్స్ కేవలం సోషల్ మీడియా ట్రెండింగ్‌తో ముగిసిపోదు. సినిమా రిలీజ్ కు ముందు ఏర్పడే బజ్, వివిధ ప్రాంతాల్లో ప్రేక్షకుల అంచనాలు, ట్రేడ్ వర్గాల విశ్వాసం, బాక్సాఫీస్ ప్రారంభానికి సంబంధించిన డిస్కషన్స్ పై కూడా అది ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి వరకు హైప్‌ను నిర్మించిన ప్రతి ప్రమోషనల్ స్టెప్ ఒకవైపు అయితే, ఆగస్ట్ 8న బెంగుళూరులో రిలీజ్ కానున్న టాక్సిక్ ట్రైలర్ మరోవైపు ఉంటుంది.
