Begin typing your search above and press return to search.

'టాక్సిక్' ట్రైల‌ర్ లాంచ్: థియేటర్లలో మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.. య‌ష్ ఎమోష‌న‌ల్!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో అత్యంత కోలాహలంగా జరిగింది.

By:  Sivaji Kontham   |   8 Aug 2026 11:41 PM IST
టాక్సిక్ ట్రైల‌ర్ లాంచ్: థియేటర్లలో మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.. య‌ష్ ఎమోష‌న‌ల్!
X

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్` ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ వేడుకలో యష్ మాట్లాడిన పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ స్పీచ్ ఆడియన్స్‌లో పూనకాలు తెప్పించింది. ఈ చిత్రాన్ని కేవలం ఏదో ఒక భాషా చిత్రంగా చూడొద్దని.. ప్రతీ పరిశ్రమకు చెందిన అగ్ర నటీనటులు తమ స్వార్థాన్ని.. ఈగోలను పక్కనపెట్టి భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే ఒకే ఒక్క లక్ష్యంతో చేసిన పక్కా `ఇండియన్ ఫిల్మ్` అని యష్ స్పష్టం చేశారు.

సినిమా మేకింగ్ - రూమర్లపై యష్ స్పందిస్తూ.. షూటింగ్ జరుగుతున్నంత కాలం సినిమా ఆగిపోయిందంటూ వచ్చిన అనేక నెగెటివ్ వార్తలను తిప్పికొట్టారు. తాము దాదాపు 200 రోజులకు పైగా శ్రమించి రెండు వెర్షన్లలో ఈ చిత్రాన్ని అత్యంత నాణ్యతతో తెరకెక్కించామని తెలిపారు. విజయవంతమైన గత చిత్రాల రికార్డుల కంటే కూడా ఒక దర్శకుడిలోని ప్యాషన్ నే తాను నమ్ముతానని... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ వద్ద ఉన్న బర్నింగ్ ప్యాషన్, అంకితభావం చూసే ఈ ప్రయోగాత్మక చిత్రానికి ఓకే చెప్పానని అన్నారు.

ఈ చిత్రంలో నటించిన నటీనటులపై యష్ ప్రశంసల వర్షం కురిపించారు. బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ డేట్ల సమస్యలను పక్కనపెట్టి `బ్యాడ్ ఆస్` సోదరి పాత్రలో జీవించిన లేడీ సూపర్ స్టార్ నయనతారకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కియారా అద్వాణీ కష్టపడే తత్వాన్ని, అంకితభావాని అభినందిస్తూ త‌న‌ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు. తారా సుతారియా, హుమా ఖురేషీ, కన్నడ భామ రుక్మిణి వసంత్ తమ పాత్రలతో సినిమాకు మరింత ఎలిగెన్స్, డెప్త్ తీసుకొచ్చారని కొనియాడారు.

తన వ్యక్తిగత జీవితం .. భార్య రాధిక పండిట్ అందించిన మద్దతు గురించి యష్ ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. తనతో ప్రయాణించడం.. తన ఆలోచనలకు అనుగుణంగా ఉండటం ఎవరికీ సులభం కాదని.. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం తాను తీసుకున్న ప్రతీ కఠిన నిర్ణయానికి భార్య రాధిక వెన్నుదన్నుగా నిలిచిందని చెప్పారు. ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల సమయాన్ని, తన కంఫర్ట్ జోన్‌ను దాటి శ్రమించానని గుర్తు చేసుకున్నారు.

ఎల్లప్పుడూ తనకు అండగా నిలుస్తున్న మీడియాకు, అభిమానులకు యష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎటువంటి అపోహలు నమ్మవద్దని.. తమ శ్రమను.. సినిమాపై ఉన్న నమ్మకాన్ని థియేటర్లలో చూస్తారని వ్యాఖ్యానించారు. ``థియేటర్లలో ఈ సినిమా చూస్తున్నప్పుడు మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం`` అని అభిమానులకు పవర్‌ఫుల్ ప్రామిస్ చేస్తూ యష్ తన స్పీచ్‌ను ముగించారు.