Begin typing your search above and press return to search.

'టాక్సిక్' ట్రైలర్ ధమాకా: బాక్సాఫీస్ మాన్‌స్ట‌ర్ లోడింగ్.. య‌ష్ వీర‌విహారం!

''ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'' (పెద్దల కోసం ఒక మైండ్ బ్లోయింగ్ కథ) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అత్యంత డార్క్, రగ్గడ్ , వయలెంట్ షేడ్స్‌తో నిండిపోయింది.

By:  Sivaji Kontham   |   8 Aug 2026 11:36 PM IST
టాక్సిక్ ట్రైలర్ ధమాకా: బాక్సాఫీస్ మాన్‌స్ట‌ర్ లోడింగ్.. య‌ష్ వీర‌విహారం!
X

కెజిఎఫ్ (KGF) సిరీస్ సునామీ తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్` రాక కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామా టీజ‌ర్ లు విడుద‌ల‌య్యాక ఈ హైప్ మ‌రింత పీక్ కి చేరుకుంది. పోస్ట‌ర్లు, టీజ‌ర్‌లు గుబులు పెంచాయి. ఇప్పుడు అఫీషియల్ హిందీ ట్రైలర్ కేవిఎన్ ప్రొడక్షన్స్ ద్వారా సోషల్ మీడియాలో విడుదలై యూట్యూబ్‌ను కుదిపేస్తోంది. ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్, వేల సంఖ్యలో కామెంట్లతో నెట్టింట రికార్డులు సృష్టిస్తోంది.

''ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'' (పెద్దల కోసం ఒక మైండ్ బ్లోయింగ్ కథ) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అత్యంత డార్క్, రగ్గడ్ , వయలెంట్ షేడ్స్‌తో నిండిపోయింది. కేజీఎఫ్ సిరీస్‌లో రాఖీ భాయ్‌గా తల్లుల సెంటిమెంట్, పవర్ఫుల్ విలనిజంతో మెప్పించిన యష్ ఈ చిత్రంలో `రాయా` అనే పూర్తి భిన్నమైన యాంటీ-హీరో షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో అదరగొట్టారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్, గెడ్డం, చేతిలో గన్స్ - యాక్షన్ సీక్వెన్సెస్‌తో యష్ మాస్ అండ్ స్టైలిష్ ప్రెజెన్స్ ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఉందంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సినిమాలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ వంటి పాన్-ఇండియా భామలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ కల్చర్, పవర్ గేమ్‌ల నేపథ్యంలో సాగే ఈ విజువల్ వండర్‌కు పాపుల‌ర్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, విశాల్ మిశ్రా స్వరాలు అందిస్తుండగా... ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కోఆర్డినేటర్లు యాక్షన్ ఘట్టాలను డిజైన్ చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ - యష్ సొంత బ్యానర్ మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాయి.

యూట్యూబ్‌లోని ఈ ట్రైలర్ కింద నెటిజన్ల కామెంట్లు కూడా రచ్చ లేపుతున్నాయి. ''మనం ఊహించిన దానికంటే ఇది చాలా డార్క్‌గా, గ్రిట్టీగా ఉంది'', ''కేజీఎఫ్ అమ్మ ఇచ్చిన మాట అయితే...'', ''టాక్సిక్ అంటే డార్క్ ఫెయిరీ టేల్'', ''ఇండియన్ సినిమాలో యష్ వన్ అండ్ ఓన్లీ సీఈఓ'' అంటూ ఫ్యాన్స్ విపరీతంగా కామెంట్ల‌ను షేర్ చేస్తున్నారు. అలాగే ట్రైలర్‌లో యష్ మాస్ - క్లాస్ కంబైన్డ్ డైలాగ్ డెలివరీ, మీసాల లుక్ .. ఆర్మీ లుక్, గిర‌జాల లుక్ వారెవ్వా అనే రేంజులో ఉన్నాయి. అత‌డి స్టంట్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అన్ని రకాల హంగులతో విజువల్ ఫీస్ట్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఈ నెల 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రైలర్‌తోనే రికార్డుల వేట మొదలుపెట్టిన యష్ థియేటర్లలో ఏ స్థాయిలో సునామీ సృష్టిస్తాడో చూడాలని సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.