టాక్సిక్ డీల్ పబ్లిసిటీ స్టంటా?.. దిల్ రాజు స్ట్రాంగ్ కౌంటర్
రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్.. మరికొద్ది రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.
By: M Prashanth | 12 Feb 2026 10:36 PM ISTరాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్.. మరికొద్ది రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే మంచి హైప్ క్రియేట్ అవ్వగా.. రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ అంచనాలను మరింత పెంచింది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ హక్కులకు సంబంధించి ఇటీవల భారీ డీల్ కుదిరింది.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టాక్సిక్.. తెలుగు వెర్షన్ హక్కులను సొంతం చేసుకుంది. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్, ఎస్వీసీ మధ్య దాదాపు రూ.120 కోట్ల భారీ ఒప్పందం కుదిరినట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అంతే కాదు.. ఆ డీల్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే టాక్సిక్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ.130 కోట్ల షేర్, సుమారు రూ.230 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
ఏదేమైనా అంత భారీ మొత్తంలో రైట్స్ కొనుగోలు చేయడం రిస్క్ కాదా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అదే రోజు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సీక్వెల్ ధురంధర్ ది రివెంజ్ రిలీజ్ కావడం.. టాక్సిక్ కు గట్టి పోటీ ఎదురవనుంది. అయితే దిల్ రాజు మాత్రం ఇలాంటి రిస్క్ నిర్ణయాలు తీసుకోవడంలో కొత్తేమీ కాదు. గతంలో కూడా భారీ సినిమాలతో సక్సెస్ సాధించిన ఆయన, యష్ మార్కెట్ ను నమ్ముకుని ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే డీల్ పై సోషల్ మీడియాలో పబ్లిసిటీ స్టంట్ అంటూ వస్తున్న కామెంట్లకు దిల్ రాజు రీసెంట్ గా రెస్పాండ్ అయ్యారు. ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ, "కేజీఎఫ్ మేకర్స్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన స్టేట్మెంట్ చూపిస్తే నమ్ముతారేమో" అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత "దిల్ రాజు అనాలా, డేర్ రాజు అనాలా?" అని అడిగితే, "ఏదైనా పర్వాలేదు" అంటూ నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు.
ఇప్పటికే ఎస్వీసీ కూడా డీల్ పై స్పందించింది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ కు వరల్డ్ వైడ్ గా భారీ మార్కెట్ ఏర్పడిందని, నాలుగేళ్లుగా ఆయన నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారని తెలిపింది. అందుకే ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
ఇక సినిమా విషయానికొస్తే.. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. యష్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. హీరోయిన్లుగా కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. మ్యూజిక్ ను రవి బస్రూర్ అందిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు ఇంగ్లీష్ లో కూడా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్.. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
