యశ్ ‘టాక్సిక్’ టీజర్.. ఈసారి కూడా అదే ఊచకోత
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యశ్ గత సినిమాల కంటే కాస్త భిన్నంగా, మరింత వైలెంట్ గా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
By: M Prashanth | 20 Feb 2026 10:34 AM ISTచాలా కాలంగా ఎదురుచూస్తున్న రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్ వచ్చేసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యశ్ గత సినిమాల కంటే కాస్త భిన్నంగా, మరింత వైలెంట్ గా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. టీజర్ లోని విజువల్స్ చూస్తుంటే ఒక రకమైన డార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను చూపించనున్నట్లు అర్థమవుతోంది.
టీజర్ లో యశ్ ఎంట్రీ సీన్ చాలా స్టైలిష్ గా ప్లాన్ చేశారు. ముఖ్యంగా చేతిలో సిగరెట్ పట్టుకుని, గంభీరమైన వాయిస్ తో ఆయన చెప్పిన “వెన్ ఐ సే.. ఇట్స్ ఓవర్” అనే డైలాగ్ ఫ్యాన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, క్యారెక్టర్ లోని డెప్త్ ని చూపించేందుకు యశ్ బాడీ లాంగ్వేజ్ ను చక్కగా వాడుకున్నారు. ఒక బాత్ టబ్ లో కూర్చుని బ్యాక్ సైడ్ నుండి కనిపించే విజువల్స్, అతని కళ్లలోని ఎరుపుదనం సినిమాలో డోస్ గట్టిగానే ఉంటుందని చెబుతున్నాయి.
టీజర్ లోని యాక్షన్ సీక్వెన్స్, డార్క్ సెట్టింగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ముఖ్యంగా సర్కస్ టెంట్ లో జరిగే ఫైట్ సీన్స్, గొడ్డలితో చేసే విధ్వంసం వంటివి విజువల్ గా చాలా రా గా ఉన్నాయి. ఒక సీన్ లో కిల్లర్ క్లౌన్ మాస్క్ వేసుకున్న వ్యక్తి తల నరికే విజువల్ చూస్తుంటే, గీతూ మోహన్ దాస్ ఈసారి వైలెన్స్ విషయంలో ఎక్కడా తగ్గలేదనిపిస్తోంది. అయితే ఇది కేవలం మాస్ ఆడియన్స్ కే కాకుండా, స్టైలిష్ యాక్షన్ ఇష్టపడే వారికి కూడా నచ్చేలా ఉంది.
రవి బస్రూర్ తనదైన మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ ను మరో లెవల్ కి తీసుకెళ్లారు. డైలాగ్స్ లో యశ్ వాయిస్ బేస్ సినిమా మూడ్ ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. చివర్లో “ఐ యామ్ హోమ్.. డాడీ” అని చెప్పే డైలాగ్ వెనుక ఏదో పెద్ద ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉందనే ఆసక్తిని కలిగించింది. ఇది కేవలం ఒక రివెంజ్ డ్రామా మాత్రమే కాకుండా, డెప్త్ కథాంశం ఉంటుందనే నమ్మకాన్ని ఇస్తోంది.
టీజర్ లోని కొన్ని సీన్స్ చూస్తుంటే ఇది కేవలం లోకల్ కథ మాత్రమే కాకుండా, విదేశీ నేపథ్యంలో సాగే క్రైమ్ నెట్‌వర్క్ అనిపిస్తోంది. చైనీస్ ల్యాంతర్లు, డిఫరెంట్ లొకేషన్స్ సినిమా గ్రాండియర్ ను చూపిస్తున్నాయి. అయితే ‘KGF’ తో యశ్ కు వచ్చిన క్రేజ్ ను ఈ సినిమా ఎంతవరకు మ్యాచ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. టీజర్ లో చూపించిన మేకింగ్ వాల్యూస్ మాత్రం వరల్డ్ క్లాస్ రేంజ్ లో ఉన్నాయి.
‘టాక్సిక్’ టీజర్ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ ని కంటిన్యూ చేయడంలో సక్సెస్ అయింది. మార్చి 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రణవీర్ సింగ్ ‘ధురందర్ 2’ తో క్లాష్ ఉన్నా, యశ్ టీజర్ లోని కాన్ఫిడెన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. మరి ఈ ‘టాక్సిక్’ మ్యాజిక్ థియేటర్లలో ఏ రేంజ్ లో వర్కవుట్ అవుతుందో చూడాలి.
