Begin typing your search above and press return to search.

ఫ్యామిలీమ్యానా? టాక్సిక్ మ్యానా? య‌ష్‌పై కామెంట్లు!

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న `టాక్సిక్` టీజర్ వెబ్ లో సునామీ సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   12 Jan 2026 9:05 AM IST
ఫ్యామిలీమ్యానా? టాక్సిక్ మ్యానా? య‌ష్‌పై కామెంట్లు!
X

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న `టాక్సిక్` టీజర్ వెబ్ లో సునామీ సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిమిషాల్లోనే మిలియ‌న్ల‌లో ఈ టీజ‌ర్ ని వీక్షించి ఫిదా అయిపోయారు. భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో నెవ్వ‌ర్ బిఫోర్ అనే రేంజు టీజ‌ర్ ఇద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఒకే ఒక్క టీజ‌ర్ తో ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్ త‌న రేంజ్ ఏమిటో ప్ర‌పంచానికి ఆవిష్క‌రించార‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. టీజ‌ర్ విడుదలైనప్పటి నుండి చిత్ర క‌థానాయ‌కుడు య‌ష్ గురించి ఒక సెక్ష‌న్ విప‌రీతమైన గుస‌గుస‌ల‌ను తెర‌పైకి తెచ్చింది. యశ్ వ్యక్తిగత కుటుంబ విలువలకు భిన్నంగా ఆ టీజర్‌లో క‌నిపించాడ‌ని, ఆ వీడియోలో చూపించిన `టాక్సిక్` అంశాలకు దూరంగా ఉండే కుర్రాడు! అంటూ వైరుధ్యంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నిజ జీవితంలో యశ్ ఒక పక్కా ఫ్యామిలీ మ్యాన్. తన భార్య రాధికా పండిట్, పిల్లలతో ఆయన గడిపే స‌మ‌యం గొప్ప‌ది. అత‌డు ఫ్యామిలీతో పండగలు జరుపుకునే విధానం అంద‌రికీ న‌చ్చుతుంది. అయితే టీజర్‌లో యశ్ నోట్లో సిగరెట్ పెట్టుకుని, చేతిలో గన్‌తో చాలా వయొలెంట్‌గా కనిపించారు. ఈ టైటిల్, దాంతో పాటే ఆ విజువల్స్ చూసి కొందరు నెటిజన్లు కుటుంబ విలువలను గౌరవించే యశ్, ఇలాంటి హింసాత్మక టైటిల్‌తో సినిమా చేయడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ ప్ర‌శ్న‌కు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు. దీనికి ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన‌ప్స్` అనే ట్యాగ్‌లైన్ ఉంది. అంటే ఇందులో ఒక బలమైన ఎమోషన్, సామాజిక సందేశం ఉంటుంద‌ని అన్నారు. యశ్ తన ఫ్యామిలీ ఇమేజ్‌ను దెబ్బతీయని విధంగానే ఈ కథను ఎంచుకున్నారని, కేవలం టీజర్‌లోని వయొలెన్స్‌ను చూసి సినిమాను జడ్జ్ చేయవద్దని చిత్ర యూనిట్ కోరుతోంది.

నిజానికి సినిమా పేరు `టాక్సిక్` అయినా, క‌థాంశంలో మాత్రం మానవీయ సంబంధాల గురించిన విజువ‌ల్స్ ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని, యశ్ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నారట. కేజీఎఫ్ లో తల్లి సెంటిమెంట్‌ను ఎలాగైతే పండించారో, ఇందులో కూడా అంతకు మించిన ఎమోషన్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.