యష్ టాక్సిక్.. ఆ మిస్టరీ బ్యూటీ ఎవరబ్బా?
స్టార్ హీరో యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ కోసం ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది.
By: M Prashanth | 21 Feb 2026 11:00 PM ISTస్టార్ హీరో యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ కోసం ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ కానుండగా.. రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కేజీఎఫ్ సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న యష్.. కొత్త లుక్, మాస్ యాక్షన్, డార్క్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలో కనిపించబోతుండటం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
టీజర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రావడం సినిమాపై ఆడియన్స్ లో క్రేజ్ ఎంత ఉందో క్లియర్ గా తెలుస్తోంది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన టీజర్ కు ఒక్క రోజులోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. యాక్షన్ సీన్స్, స్టైలిష్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే టీజర్ మొత్తం కంటే అందులో కేవలం ఒక సెకన్ మాత్రమే కనిపించిన చిన్న సీన్ హాట్ టాపిక్ గా మారింది.
ఆ సీన్ లో యశ్ ఓ అమ్మాయిని బెడ్ పైకి నెట్టే దృశ్యం కనిపిస్తుంది. ఇలా వచ్చి అలా వెళ్ళిన ఆ షాట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇది కథలో భాగమైన ఇంటెన్స్ లేదా హీట్ పుట్టించే సీన్ గా అనిపిస్తోంది. దీంతో ఆ బ్యూటీ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది. ఆ సీన్ ను స్క్రీన్ షాట్లు తీసి జూమ్ చేసి చూసి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు, సినీ ప్రియులు.
కొంతమంది ఆమె బాలీవుడ్ నటి తారా సుతారియా అని అంటుంటే, మరికొందరు కన్నడ నటి రుక్మిణి వసంత్ అయి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే మేకర్స్ మాత్రం ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో క్యూరియాసిటి పెరుగుతోంది. అయితే టాక్సిక్ లో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అలాగే హ్యూమా ఖురేషీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇంత పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ టీజర్ లో ఒక్క హీరోయిన్ ను కూడా మేకర్స్ క్లియర్ గా చూపించకపోవడం గమనార్హం. ఇది మేకర్స్ ప్లాన్ లో భాగమేనని అనేక మంది సినీ ప్రియులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కథపై సస్పెన్స్ క్రియేట్ చేయడం, హీరోయిన్ పాత్రలపై ఆసక్తి పెంచడం కోసం కావాలనే ఇలా చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది.
ఎందుకంటే టీజర్ విడుదలైనప్పటి నుంచి ఆ హీరోయిన్ ఎవరు? అనే చర్చే సోషల్ మీడియాలో జరుగుతోంది. ఏదేమైనా టాక్సిక్ టీజర్ యాక్షన్ తో పాటు ఆ ఒక్క సన్నివేశంతోనే సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది. యశ్ అభిమానులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ మిస్టరీ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలంటే ట్రైలర్ లేదా సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. సమ్మర్ స్పెషల్ గా మార్చి 19వ తేదీన వరల్డ్ వైడ్ గా టాక్సిక్ విడుదల కానుండగా.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
