Begin typing your search above and press return to search.

ఆ వీడియో కేవ‌లం ప్ర‌మోష‌న్స్ కోస‌మేనా?

టాక్సిక్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా య‌ష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ టీజ‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

By:  Sravani Lakshmi Srungarapu   |   12 Jan 2026 8:00 PM IST
ఆ వీడియో కేవ‌లం ప్ర‌మోష‌న్స్ కోస‌మేనా?
X

కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల‌తో దేశ వ్యాప్తంగా విప‌రీత‌మైన క్రేజ్ ను తెచ్చుకున్నారు క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్. కెజిఎఫ్2 త‌ర్వాత య‌ష్ ఎవ‌రితో సినిమా చేస్తారా అని అనుకోగా, అందరికీ షాకిస్తూ య‌ష్, లేడీ డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను ఓకే చేశారు. టాక్సిక్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా య‌ష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ టీజ‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.

టాక్సిక్ వీడియోపై డిస్క‌ష‌న్స్

రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ కు చాలా మంది ఆడియ‌న్స్ నుంచి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. చాలా మంది ప్రేక్ష‌కులు అస‌లు అలాంటి ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియో అవ‌స‌ర‌మా అని, ఇలాంటి వీడియోలు సినిమాపై ఉన్న దృష్టిని కూడా మారుస్తాయ‌ని అంటున్నారు. దీంతో ఈ విష‌యం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీసింది. ఇదే సినిమాను ఎవ‌రైనా మేల్ డైరెక్ట‌ర్ కానీ తీసి, ఇలాంటి వీడియోనే రిలీజ్ చేసి ఉంటే ఏ ర‌క‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చి ఉండేవ‌నే దాని గురించి కూడా చ‌ర్చిస్తున్నారు.

టాక్సిక్ సినిమాకు గీతూ మోహ‌న్‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం వ‌ల్ల ఆ నెగిటివిటీ బ‌య‌ట‌పడ‌టానికి కొంచెం టైమ్ ప‌ట్టింది. భారీ బ‌డ్జెట్ సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో ఒక హీరో క్యారెక్ట‌ర్ ను ప‌రిచ‌యం చేసే వీడియో ఇలా ఉండ‌టం ఏ మాత్రం బాలేద‌ని కొంద‌రు పెద‌వి విరుస్తూ దాన్ని విమ‌ర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంద‌రు మాత్రం ఈ వీడియో కేవ‌లం ప్ర‌మోష‌న్ కోసం మాత్ర‌మే తీశార‌ని, ఈ వీడియోలోని అభ్యంత‌ర‌కర సీన్స్ సినిమాలో భాగ‌మై ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అని డిస్క‌స్ చేస్తున్నారు.

అయితే సినిమా మొత్తం పూర్త‌య్యాక ఫైన‌ల్ ఎడిటింగ్ లో ఒక‌వేళ ఇలాంటి సీన్స్ ఉన్నప్ప‌టికీ దాన్ని క‌ట్ చేస్తేనే బావుంటుంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలా కాకుండా అవే సీన్స్ సినిమాలో కూడా ఉంటే బిగ్ స్క్రీన్ పై అవి ఇబ్బందిగా, అతిగా అనిపించే అవ‌కాశముందుని చెప్తున్నారు. అయితే ఈ వీడియో విష‌యంలో కొంద‌రు ఆడియ‌న్స్ బోల్డ్ కంటెంట్ ను మెచ్చుకుంటుంటే, మ‌రికొంద‌రు మాత్రం మార్చి 19న రిలీజయ్యే టాక్సిక్ కు బ‌దులు దురంధ‌ర్2 చూడ్డానికే ఆస‌క్తి చూపుతార‌ని అంటున్నారు. మ‌రి సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ ఈ విష‌యంలో ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారో తెలియాల్సి ఉంది.