Begin typing your search above and press return to search.

ఫినామినల్ బుకింగ్స్.. రికార్డ్ షట్టరింగ్ ఓపెనింగ్‌తో టాక్సిక్!

అదే లెక్కలో కాంతారను కూడా వెనక్కి నెట్టి కన్నడ సినిమాల నుంచి వచ్చిన మరో పెద్ద బుకింగ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

By:  M Prashanth   |   26 Aug 2026 11:39 AM IST
ఫినామినల్ బుకింగ్స్.. రికార్డ్ షట్టరింగ్ ఓపెనింగ్‌తో టాక్సిక్!
X

యశ్ టాక్సిక్ రిలీజ్‌కు ముందే మొదలైన ఫినామినల్ బుకింగ్స్ ఇప్పుడు తొలి రోజు నంబర్స్‌లో కూడా కనిపిస్తున్నాయి. బుక్‌మైషో ప్రీ సేల్స్‌లో 16.2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడంతో ధురంధర్ 2 ఫైనల్ ప్రీ సేల్స్‌ను భారీ మార్జిన్‌తో దాటేసింది. అదే లెక్కలో కాంతారను కూడా వెనక్కి నెట్టి కన్నడ సినిమాల నుంచి వచ్చిన మరో పెద్ద బుకింగ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

రిలీజ్ రోజు కూడా టికెట్ సేల్స్ స్పీడ్ తగ్గలేదు. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్స్ రెండింటిలో కలిపి మరో గంటలోనే లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తయ్యాక కూడా ఇలాంటి స్పీడ్ రావడం టాక్సిక్ ఓపెనింగ్‌కు మరింత బూస్ట్ ఇచ్చింది. చాలా సెంటర్లలో ఉదయం నుంచే షోలు మంచి ఆక్యుపెన్సీతో మొదలయ్యాయి.

ముఖ్యంగా కర్ణాటకలో యశ్‌కు ఉన్న మార్కెట్ మరోసారి పని చేసింది. కేజీఎఫ్ తర్వాత అతని నుంచి వస్తున్న సినిమా కావడంతో అక్కడ మొదటి రోజు భారీ స్థాయిలో షోలు ప్లాన్ చేశారు. బుకింగ్స్ కూడా అందుకు తగ్గట్లుగానే వచ్చాయి. దీంతో కన్నడ సినిమాల పెద్ద ఓపెనింగ్స్ లిస్టులో టాక్సిక్ మరోసారి యశ్ పేరును ముందుకు తీసుకొచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా పెద్ద ఓపెనింగ్ అందుకుంది. ఏపీ, తెలంగాణలో చివరి సమయంలో బుకింగ్స్ వేగం పెరగడంతో చాలా సెంటర్లలో మంచి షోలు పడ్డాయి. కేజీఎఫ్ 2 తర్వాత యశ్‌కు ఇక్కడ ఏర్పడిన మార్కెట్ టాక్సిక్‌కు కూడా ఉపయోగపడింది. కన్నడతో పాటు తెలుగు రాష్ట్రాలు తొలి రోజు గ్రాస్‌లో కీలకంగా నిలిచాయి.

ఇక యశ్ పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. రాయా పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ మూమెంట్స్‌ను ఫ్యాన్స్ ఎక్కువగా షేర్ చేస్తున్నారు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమాలో యశ్‌ను చూసిన ఫ్యాన్స్ నుంచి ఆయన వరకు మంచి స్పందన కనిపిస్తోంది.

ఈ ఫినామినల్ బుకింగ్స్, రికార్డ్ షట్టరింగ్ ఓపెనింగ్‌తో టాక్సిక్ తొలి రోజు వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. కాంతార బుకింగ్ రికార్డును వెనక్కి నెట్టడం ఒక న్యూ రికార్డ్. అలాగే బుక్‌మైషోలో 16.2 లక్షల ప్రీ సేల్స్, రిలీజ్ రోజు కూడా గంటలో లక్ష టికెట్ల స్పీడ్.. చూస్తుంటే క్రేజ్ మామూలుగా లేదని చెప్పవచ్చు. యశ్‌కు కేజీఎఫ్ ఫ్రాంచైజీ తో కాకుండా సోలోగా తన స్టార్ పవర్ అయితే చూపిస్తున్నాడు. ఇక టోటల్ లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.