Begin typing your search above and press return to search.

లండ‌న్ కు వెళ్ల‌నున్న య‌ష్.. ఎందుకంటే?

కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల‌తో య‌ష్ ఎంత భారీ క్రేజ్ సంపాదించుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   19 Sept 2025 10:00 PM IST
లండ‌న్ కు వెళ్ల‌నున్న య‌ష్.. ఎందుకంటే?
X

కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల‌తో య‌ష్ ఎంత భారీ క్రేజ్ సంపాదించుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కెజిఎఫ్2 త‌ర్వాత య‌ష్ ఎవ‌రితో సినిమా చేస్తాడా అని అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూశారు. ఎన్నో ఆలోచించి య‌ష్ త‌న నెక్ట్స్ మూవీని గీతూ మోహ‌న్‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో అనౌన్స్ చేసి దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

45 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి

టాక్సిక్ కు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, రీసెంట్ గా ఈ సినిమా ముంబైలో 45 రోజుల లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసిన‌ట్టు స‌మాచారం. గ‌త 45 రోజులుగా టాక్సిక్ టీమ్ ముంబై లో షూటింగ్ జ‌రుపుతుండ‌గా, సినిమా మొత్త‌మ్మీద అత్యంత కీల‌క‌మైన షెడ్యూల్ ఇదే అని స‌న్నిహిత వ‌ర్గాలంటున్నాయి. ఈ షెడ్యూల్ షూటింగ్ ను ముంబైలోని మాధ్ ఐలాండ్ మ‌రియు ఫిల్మ్ సిటీలో చేశారు.

హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ నేతృత్వంలో భారీ యాక్ష‌న్ సీన్లు

ఈ ముంబై షెడ్యూల్ లో సినిమాలోని ప్ర‌ధాన‌మైన యాక్ష‌న్ సీన్స్ ను గీతూ మోహ‌న్‌దాస్ తెర‌కెక్కించ‌గా, ఆ యాక్ష‌న్ సీన్స్ ను హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫర్ జె.జె పెర్రీ కంపోజ్ చేశారు. ఈ షెడ్యూల్ తో సినిమాలోని మెయిన్ యాక్ష‌న్ సీన్స్ అన్నీ పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. కాగా 45 రోజుల ముంబై షెడ్యూల్ త‌ర్వాత ఇప్పుడు టాక్సిక్ చిత్ర యూనిట్ ఆఖ‌రి షెడ్యూల్ కోసం బెంగుళూరు వెళ్లిన‌ట్టు స‌మాచారం.

నెలాఖ‌రు నుంచి టాక్సిక్ ఫైన‌ల్ షెడ్యూల్

సెప్టెంబ‌ర్ లాస్ట్ వీక్ లో టాక్సిక్ ఆఖ‌రి షెడ్యూల్ మొద‌ల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. టాక్సిక్ షూటింగ్ ఈ ఏడాది ప్రారంభంలో బెంగుళూరులో మొద‌ల‌వ‌గా, తిరిగి ఆఖ‌రి షెడ్యూల్ ను కూడా బెంగుళూరులోనే చేసి షూటింగ్ ను పూర్తి చేయాల‌ని గీతూ భావిస్తున్నారట‌. అయితే టాక్సిక్ లాస్ట్ షెడ్యూల్ మొద‌లుపెట్టే లోపు య‌ష్ ఇంట‌ర్నేష‌న‌ల్ పార్టన‌ర్‌షిప్ డిస్క‌ష‌న్స్ కోసం లండ‌న్ వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది.

టాక్సిక్ లో య‌ష్ కు జోడీ కియారా అద్వానీ న‌టిస్తుండ‌గా, లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా క‌న్న‌డ‌, ఇంగ్లీష్ భాష‌ల్లో స‌మాంత‌రంగా తెర‌కెక్కుతుండ‌గా, వ‌చ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.