Begin typing your search above and press return to search.

వార్ ఎఫెక్ట్‌: టాక్సిక్ రిలీజ్ డేట్ మారింది!

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `టాక్సిక్‌`. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని లేడీ డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ రూపొందించింది.

By:  Ravindar Gorantla   |   4 March 2026 12:02 PM IST
వార్ ఎఫెక్ట్‌: టాక్సిక్ రిలీజ్ డేట్ మారింది!
X

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `టాక్సిక్‌`. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని లేడీ డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ రూపొందించింది. క‌న్న‌డ‌లో భారీ చిత్రాల నిర్మాణంతో ప్రొడ‌క్ష‌న్ రంగంలోకి ప్ర‌వేశించిన కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మించింది. ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ క్రేజీ స్టార్‌లుగా పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోయిన్‌లు న‌య‌న‌తార‌. కియారా అద్వానీ, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.




మార్చి 19న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా రాకెట్ స్పీడుతో చేయ‌డం మొద‌లు పెట్టారు. గ్లింప్స్‌, టీజ‌ర్‌ల‌తో ర‌చ్చ చేసిన `టాక్సిక్‌`దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి భారీ బ‌జ్‌ని క్రియేట్ చేసింది. బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జ‌ర‌గ‌డంతో మేక‌ర్స్ చాలా హ్యాపీగా ఫీల‌వుతూ రిలీజ్‌కు యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాట్టు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ట్రైల‌ర్ రిలీజ్ చేస్తార‌ని ఎదురు చూస్తున్న అభిమానుల‌కు షాక్ ఇచ్చారు.

సినిమా రిలీజ్‌ని వాయిదా వేస్తున్నామ‌ని, మార్చి 19న `టాక్సిక్‌` రిలీజ్ కావ‌డం లేద‌ని, జూన్ 4కు పోస్ట్ పోన్ చేశామ‌ని చెప్పి షాక్ ఇచ్చారు. ఇరాన్ - ఇజ్రాయెల్ మ‌ధ్య వార్ మొద‌లై ఇరాన్ సుప్రీమ్ లీడ‌ర్ ఆయుతుల్లా ఖ‌మేనీ మృతి చెంద‌డంతో యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఖ‌మేనీ మ‌ర‌ణంతో ఇరాన్ వ‌ర్గాలు గ‌ల్ఫ్ కంట్రీస్ అయిన దుబాయ్‌, అబుదాబి, క‌తార్‌, బ‌హ్రెయిన్‌, కువైట్ వంతి త‌దిత‌ర దేశాల్లో మార‌ణ‌హోమం సృష్టిస్తోంది. ఆయాదేశాల్లోని అమెరికన్ ఎంబ‌సీలపై ఇరాన్ వ‌రుగా దాడులు చేస్తోంది. తాజా ప‌రిస్థితుల కార‌ణంగా `టాక్సిక్‌` మూవీని మేక‌ర్స్ వాయిదా వేశారు.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేక‌ర్స్ మీడియా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గ్లోబ‌ల్ ఆడియ‌న్స్‌కి సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్‌ని అందించాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ ప్రియుల్ని ఎంట‌ర్‌టైన్ చేయాల‌నే అక్ష్యంతో క‌న్న‌డ‌, ఇంగ్లీష్ వెర్ష‌న్‌ల‌లో దీన్ని నిర్మించాం. కొన్నేళ్లు టెక్నిషియ‌న్స్ అంతా క‌ష్ట‌ప‌డి చేసిన ఈ సినిమాని మార్చి 19న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశాం. అయితే మిడిల్ ఈస్ట్‌లో ఏర్పిడిన ప‌రిస్థితులు మా సినిమా గ్లోబ‌ల్ రీచ్‌పై భారీ ప్ర‌భావాన్ని చూపించే ప్ర‌మాదం ఉంది. అయితే ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల కార‌ణంగా సినిమాని వాయివా వేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం.

జూన్ 4న ప్ర‌పంచ వ్యాప్తంగా ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నాం. మీరు మా ప‌రిస్థిత‌ని అర్థం చేసుకుని మాకు స‌హ‌ర‌రిస్తార‌ని, మీ ప్రేమ‌ను, స‌పోర్ట్‌ని అంతిస్తార‌ని ఆశిస్తున్నాం` అన్నారు. దీంతో యుద్దం కార‌ణంగా సినిమా రిలీజ్ వాయిదా ప‌డ‌టంతో య‌ష్ అభిమానులు కాస్త నిరాశ‌కు గుర‌వుతున్నారు. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితుల దృష్టిలో పెట్టుకుని సినిమా రిలీజ్ వాయిదా వేయ‌డం మంచిదేన‌ని, జాన్‌లో రిలీజ్ అయితే బాక్సాఫీస్ లెక్క‌లు మార్చే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.