Begin typing your search above and press return to search.

యష్ 'టాక్సిక్'.. మేకర్స్ ఇప్పుడు చేయాల్సిందేమిటి?

కేజీఎఫ్ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

By:  M Prashanth   |   4 Jun 2026 12:10 PM IST
యష్ టాక్సిక్.. మేకర్స్ ఇప్పుడు చేయాల్సిందేమిటి?
X

కేజీఎఫ్ సిరీస్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్ తెరకెక్కిస్తున్న ఆ చిత్రం మొదటి నుంచి హాట్ టాపిక్ గానే ఉంది. హాలీవుడ్ రేంజ్ మేకింగ్, భారీ బడ్జెట్, యష్ స్టైలిష్ లుక్ కారణంగా మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ విడుదల తేదీల విషయంలో వరుసగా నిరాశ ఎదురవుతోంది.

ఇప్పటికే అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ ప్రకారం, ముందు సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఆ తర్వాత జూన్ 4న విడుదల ఉంటుందంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ తేదీ కూడా దాటిపోవడంతో టాక్సిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ప్రశ్న మళ్లీ చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఇటీవల సినిమా రీషూట్లు జరుగుతున్నాయని, యష్ ఫైనల్ అవుట్‌ పుట్‌ పై అసంతృప్తిగా ఉన్నారని పలు రూమర్లు వైరల్ అయ్యాయి.

అయితే ఆ రూమర్లకు మూవీ టీమ్ ఇప్పుడు చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. రీషూట్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసిందని సమాచారం. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిగా ముగిశాయని, ప్రస్తుతం నాన్ థియేట్రికల్ బిజినెస్‌ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కు సంబంధించిన ఒప్పందాల ప్రక్రియ కొనసాగుతోందని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తుందని వినికిడి.

ఇక సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా ఇప్పటికే ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. మెలిస్సా పాత్రలో రుక్మిణి వసంత్, గంగా పాత్రలో నయనతార, నదియా పాత్రలో కియారా అద్వానీ, ఎలిజబెత్‌ గా హ్యూమా ఖురేషి, రెబెకాగా తారా సుతారియా నటిస్తున్నారు. ఒకే హీరోయిన్‌ కు పరిమితం కాకుండా ఐదు ఉమెన్ రోల్స్ ఉండటంతో సినిమా కథపై మరింత ఆసక్తి పెరిగింది.

అయితే ప్రస్తుతం మేకర్స్ ముందున్న అసలు సవాలు రూమర్లను ఆపడం. సినిమా షూటింగ్ పూర్తైందని, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ముగిసిందని చెబుతున్న నేపథ్యంలో విడుదల తేదీ ప్రకటించకపోవడం వల్ల అనుమానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారీ పాన్ ఇండియా చిత్రాలకు ఓటీటీ, శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కీలకమైనప్పటికీ.. అభిమానులు మాత్రం రిలీజ్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారు.

నిజానికి టాక్సిక్ వంటి భారీ ప్రాజెక్టుకు వరల్డ్ వైడ్ రిలీజ్ ప్లాన్ అవసరమే కావచ్చు. హాలీవుడ్ మార్కెట్‌ ను కూడా టార్గెట్ గా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే నాన్-థియేట్రికల్ బిజినెస్ పూర్తయ్యే వరకు మేకర్స్ వేచి చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఎంతటి ప్లాన్ ఉన్నా అభిమానుల్లో డౌట్స్ కు ముగింపు పలకాలంటే కొత్త విడుదల తేదీని ప్రకటించడం అవసరం. ప్రస్తుతం టాక్సిక్ మూవీ విషయంలో ఉన్న అతిపెద్ద ప్రశ్న సినిమా కంటెంట్ గురించి కాదు, విడుదల గురించి మాత్రమే. అందుకే ఇక మేకర్స్ చేయాల్సింది ఒక్కటే.. అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అభిమానుల్లో నెలకొన్న కన్ఫ్యూజన్ ను క్లియర్ చేయడం!