Begin typing your search above and press return to search.

ముగింపు లేని నిరీక్షణ: రాకింగ్ స్టార్ మైండ్ బ్లోయింగ్ డైలమా!

కన్నడ పరిశ్రమ నుండి పాన్-ఇండియా రేంజ్‌కు ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ప్రస్తుతం తీవ్ర గందరగోళంలో మునిగిపోయారు.

By:  Sivaji Kontham   |   5 Jun 2026 8:00 AM IST
ముగింపు లేని నిరీక్షణ: రాకింగ్ స్టార్ మైండ్ బ్లోయింగ్ డైలమా!
X

కన్నడ పరిశ్రమ నుండి పాన్-ఇండియా రేంజ్‌కు ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ప్రస్తుతం తీవ్ర గందరగోళంలో మునిగిపోయారు. కేజీఎఫ్ 2 వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యశ్ నటిస్తున్న రెండు అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల విడుదల తేదీల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఒకవైపు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ `టాక్సిక్`, మరోవైపు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణం` వంటి రెండు భారీ ప్రాజెక్ట్‌లను రిలీజ్ ద‌శ‌కు తెస్తున్నా, ఏ ఒక్క సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో తెలియక హీరో యశ్ స్వయంగా తీవ్రమైన కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. అసలు ఈ రెండు చిత్రాల విష‌యంలో తెర‌వెనుక ఏం జరుగుతోంది? రిలీజ్ ప్లానింగ్ ఎందుకు ఇంతలా ఆలస్యమవుతోందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం `టాక్సిక్` చిత్రం ఈపాటికే ప్రేక్షకులను పలకరించాల్సి ఉంది కానీ ఈ ప్రాజెక్ట్ విడుదల ఎందుకు నిరంతరం వాయిదా పడుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షూటింగ్ ఆలస్యం కావడం లేదా పోస్ట్-ప్రొడక్షన్ పనుల వల్లే `టాక్సిక్` వాయిదాల పర్వాన్ని ఎదుర్కొంటోందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరోవైపు యశ్ రావణుడిగా నటిస్తూ సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న బాలీవుడ్ విజువల్ వండర్ `రామాయణం` పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ గతంలో హింట్ ఇచ్చినా.. ఇప్పటివరకు ఒక అధికారిక డేట్‌ను ఎందుకు ఫైనల్ చేయలేకపోయారనేది మిస్టరీగా మారింది. ఈ రెండు సినిమాల తేదీలు ఖరారు కాకపోవడంతో యశ్ కెరీర్ తదుపరి అడుగులు డైలమాలో పడ్డాయి.

సుమారు 4000 కోట్ల రూపాయల కళ్లు చెదిరే భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `రామాయణం` లాంటి సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు దక్కడం చాలా అవసరం. పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలన్నా, లాభాల బాట పట్టాలన్నా ఈ చిత్రాన్ని కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. హాలీవుడ్ రేంజ్‌లో భారీ వసూళ్లను సాధించాలంటే సినిమా విడుదలకు కనీసం కొన్ని నెలల ముందే అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ .. మార్కెటింగ్ క్యాంపెయిన్‌లను ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే విడుదల సమయం దగ్గరపడుతున్నా మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ లేదా కనీసం రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా చేయకపోవడం వెనుక ఉన్న వ్యూహం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.

ఈ రకమైన డిలేస్.. ఆఖరి నిమిషం హడావుడి వల్ల సినిమా ప్రమోషన్లకు తగినంత సమయం దొరకదని.. ఇది ఓపెనింగ్స్ స‌హా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ట్రేడ్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. రెండు అత్యంత క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉండి కూడా.. సరైన విడుదల ప్రణాళికలు లేకపోవడం వల్ల యశ్ అభిమానులలో నైరాశ్యం పెరుగుతోంది. టాక్సిక్, రామాయణం తేదీల దోబూచులాటల మధ్య రాకింగ్ స్టార్ యశ్ ఈ రిలీజ్ డేట్స్ కన్‌ఫ్యూజన్ నుండి ఎప్పుడు బయటపడతారో.. తన ఫ్యాన్స్‌కు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.