నాలుగేళ్ల ఏళ్ల కష్టానికి ప్రతిఫలం ఎంత...?
మార్చి 2026లో విడుదల కాబోతున్న టాక్సిక్ కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల హడావిడి మొదలైంది.
By: Ramesh Palla | 24 Feb 2026 11:17 AM IST'కేజీఎఫ్' ప్రాంచైజీతో యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. ముఖ్యంగా కేజీఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రికార్డ్‌లను సైతం బ్రేక్ చేసిన కేజీఎఫ్ 2 సినిమా తర్వాత యశ్ నుంచి రాబోతున్న సినిమా ఏంటా అని దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూశారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు హీరోల్లో ప్రభాస్, కన్నడ హీరోల్లో యశ్ అన్నట్లుగా పాన్ ఇండియా రేంజ్ లో ఊపు ఊపుతున్నారు. అయితే యశ్ కేజీఎఫ్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటికే కేజీఎఫ్ 2 వచ్చి దాదాపుగా నాలుగు ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు కూడా తన తదుపరి సినిమాను యశ్ విడుదల చేయక పోవడం పట్ల ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్..
యశ్ తదుపరి సినిమా కోసం ఏకంగా ఏడాది స్క్రిప్ట్‌లపై వర్క్ చేశాడు. చివరకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. టాక్సిక్ సినిమాను మొదట ఏడాదిలో పూర్తి చేసి, నాలుగు అయిదు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి విడుదల చేయాలి అనుకున్నారు. కానీ అనుకున్నట్లుగా జరగలేదు. కేవలం మేకింగ్‌కి రెండు ఏళ్లకు ఎక్కువగా పట్టిందని సమాచారం. యాక్షన్ సీక్వెన్స్ కోసం యశ్ చాలా కష్టపడ్డాడని, ప్రతి యాక్షన్ సీన్ కి రెండు మూడు వర్షన్‌లు తీసుకు రావాల్సి వచ్చిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అందుకే సినిమాను ఇన్నాళ్లు చేశారు. ఎట్టకేలకు యశ్ సినిమా టాక్సిక్ విడుదలకు ముస్తాబు అయింది. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు.
కేజీఎఫ్ 2 సినిమా తర్వాత యశ్...
మార్చి 2026లో విడుదల కాబోతున్న టాక్సిక్ కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల హడావిడి మొదలైంది. ఒక పెద్ద సినిమాకు పోటీగా రాబోతున్నప్పటికీ యశ్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో టాక్సిక్ కి మంచి బజ్ ఉంది. అంతే కాకుండా సినిమాకు చాలా భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం అందుతోంది. అన్ని ఏరియాల్లోనూ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. యశ్ ఈ సినిమా కోసం ఏకంగా నాలుగు ఏళ్ల పాటు కష్టపడ్డాడు. కేజీఎఫ్ 2 విడుదలైన వెంటనే కథలు వినడం మొదలు పెట్టాడు. దాదాపు ఏడాది పాటు వందల కొద్ది కథలను విన్న యశ్ చాలా కథలతో ముందుకు వెళ్లాలి అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల కథలో పాయింట్ నచ్చక పోవడం వల్ల మళ్లీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరకు టాక్సిక్ సినిమాతో యశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
టాక్సిక్ సినిమాతో యశ్ లాభం...
కేజీఎఫ్ 2 సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాంతో యశ్ కి పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ఏర్పడి, మార్కెట్ పెరిగింది. అందుకే యశ్ కి భారీ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు వచ్చాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు నిర్మాణ భాగస్వామిగా ఉండటం మనం చూస్తున్నాం. టాక్సిక్ సినిమాకు నామినల్ అమౌంట్ ను పారితోషికంగా తీసుకుని, నిర్మాణ భాగస్వామిగా, లాభాల్లో వాటాను తీసుకునే విధంగా, కొన్ని ఏరియాలకు సంబంధించిన హక్కులను తీసుకునే విధంగా యశ్ ఒప్పందం చేసుకున్నాడు అంటున్నారు. అదే కనుక నిజం అయితే ఇప్పటికే యశ్ కి వంద కోట్లకు పైగా అమౌంట్ వచ్చి ఉంటుంది. సినిమా హిట్ టాక్ దక్కించుకుని, మినిమం రూ.500 కోట్ల వసూళ్లు సాధించినా మరో రూ.100 కోట్లు పారితోషికంగా యశ్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక సినిమాకు వచ్చే ఓటీటీ అమౌంట్ లోనూ యశ్ కి వాటా ఉంటుంది. ఇతర రైట్స్ ద్వారా యశ్ కి మరో రూ.50 కోట్ల వరకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. దాంతో యశ్ మొత్తంగా ఈ నాలుగు ఏళ్ల కష్టంకు గాను దాదాపు రూ.250 కోట్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని కన్నడ వర్గాల వారు లెక్కలు వేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది సినిమా విడుదల తర్వాత యశ్ లేదా మేకర్స్ నోరు విప్పితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సినిమాకు యశ్ పడ్డ కష్టంకు భారీ మొత్తంలో పారితోషికం దక్కించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు, చివరకు చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
