Begin typing your search above and press return to search.

రొమాన్స్‌.. స్టైల్.. ఫైట్స్ అటుంచితే.. మేకోవ‌ర్‌తో క‌ట్టి ప‌డేస్తున్న 'టాక్సిక్' బోయ్!

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ గ్లోబల్ యాక్ష‌న్ హీరో ప్రస్తుతం తన తదుపరి చిత్రం `టాక్సిక్` షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.

By:  Sivaji Kontham   |   9 July 2026 9:31 AM IST
రొమాన్స్‌.. స్టైల్.. ఫైట్స్ అటుంచితే.. మేకోవ‌ర్‌తో క‌ట్టి ప‌డేస్తున్న టాక్సిక్ బోయ్!
X

క‌న్నడ రాకింగ్ స్టార్ యష్ అంటేనే ఒక ట్రెండ్ సెట్టర్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ గ్లోబల్ యాక్ష‌న్ హీరో ప్రస్తుతం తన తదుపరి చిత్రం `టాక్సిక్` షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొనగా.. ఈ సినిమా కోసం యష్ మారిన తీరు చూసి ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు విస్మయానికి గురవుతున్నారు. ఒక భారీ సక్సెస్ తర్వాత మరో భారీ యాక్ష‌న్ సినిమా కావడంతో... యష్ తన లుక్ విషయంలో తీసుకున్న కేర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కేవలం యాక్షన్ డ్రామాగానే కాకుండా... ఈ సినిమాలో రొమాంటిక్ ఎలిమెంట్స్ కూడా చాలా యూనిక్‌గా అంద‌రి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్ర‌మోష‌న్స్ లో యాక్ష‌న్ కంటే రొమాన్స్ ఎక్కువ హైలైట్ అవ్వ‌డం కూడా ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. వీటన్నింటికీ తోడు ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్‌డేట్స్ కూడా శ్రోతలను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. లవ్, యాక్షన్, అద్భుతమైన సంగీతం కలగలిసిన పర్‌ఫెక్ట్ ప్యాకేజీలా `టాక్సిక్` చిత్రం రూపొందుతోందని ప్ర‌చార సామాగ్రి స్ప‌ష్ఠం చేస్తోంది.

అయితే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ హంగుల కంటే కూడా యష్ మేకోవర్ నిజంగా అందరికీ పెద్ద షాక్ ఇస్తోంది. `కేజీఎఫ్` సిరీస్‌లో లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో రాకీ భాయ్‌గా రగ్గడ్ లుక్‌లో కనిపించిన యష్.. ఇప్పుడు `టాక్సిక్` కోసం పూర్తిగా మారిపోయారు. ఆయన హెయిర్ కట్ మునుపటి కంటే చాలా డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా మారిపోయింది. దీనికి తోడు ఆయన గడ్డం స్టైల్, మీసకట్టు నిజంగా కిల్లింగ్ లుక్‌ను ఇస్తూ సరికొత్త వైబ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.

యష్ సరికొత్త హెయిర్ స్టైల్ సినిమా రిలీజ్ త‌ర్వాత‌ యూత్‌పై గట్టి ఇంపాక్ట్ చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో యువత ఈ లుక్‌ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. కేజీఎఫ్ గడ్డం ఎలాగైతే ఒకప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేసిందో.. ఇప్పుడు టాక్సిక్ హెయిర్ స్టైల్ కూడా అదే రేంజ్‌లో ట్రెండ్ అవ్వడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం క్యారెక్టర్ కోసం కాకుండా... ప్రేక్షకులు తనను సరికొత్తగా చూడాలనే ఉద్దేశంతోనే యష్ ఇంతటి క్రేజీ మేకోవర్ ట్రై చేసినట్లు స్పష్టమవుతోంది.

ఇటీవలి కాలంలో మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు తమ సినిమాల్లోని లుక్స్‌పై చూపిస్తున్న శ్రద్ధ నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకప్పుడు ఒకే రకమైన గెటప్‌తో సినిమాలు చేసిన నటులు... ఇప్పుడు ప్రతి కథకు భిన్నమైన రూపంలో కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం యష్ మాత్రమే కాదు.., `డ్రాగన్` సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఎవరూ ఊహించని విభిన్నమైన లుక్‌ను ట్రై చేస్తుండటం ప్రస్తుతం అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. మన హీరోల ఈ సరికొత్త మేకోవర్ ట్రెండ్.. సినిమాలపై హైప్‌ను మరింతగా పెంచేస్తోందనడంలో సందేహం లేదు.