టాక్సిక్ డైరెక్టర్ మారారా?
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న టాక్సిక్ నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చింది కేవలం టీజర్ మాత్రమే. ఎన్నో అంచనాలతో వచ్చిన టాక్సిక్ టీజర్ అంచనాలను అందుకోలేకపోయింది.
By: Sravani Lakshmi Srungarapu | 22 Oct 2025 4:00 AM ISTఒక్కోసారి ఓవర్ హైప్ కూడా సినిమాలను చంపేస్తుంటుంది. సినిమాల విషయంలోనే కాదు, నటీనటుల విషయంలో కూడా అంతే. వివిధ కారణాల వల్లనో లేక సదరు హీరో, హీరోయిన్ లేదా డైరెక్టర్ పై అతి నమ్మకం వల్లనో వారు చేసే ప్రాజెక్టులపై విపరీతమైన బజ్ ఏర్పడుతుంది. ఆ టైమ్ లో సినిమా నుంచి యావరేజ్ కంటెంట్ వచ్చినా అది అంచనాలను అందుకోలేదు. దీంతో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి.
కెజిఎఫ్ తో నేషనల్ వైడ్ పాపులారిటీ
ఇప్పుడు కన్నడ రాక్ స్టార్ యష్ చేస్తున్న టాక్సిక్ సినిమా పరిస్థితి అలానే తయారైంది. కెజిఎఫ్ సినిమా ముందు వరకు కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిచయమున్న యష్, ఆ సినిమా తర్వాత నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. కెజిఎఫ్ కు సీక్వెల్ గా వచ్చిన కెజిఎఫ్2 మరింత పెద్ద హిట్ గా నిలవడంతో యష్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే యష్ తర్వాతి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
లేడీ డైరెక్టర్ తో టాక్సిక్
కెజిఎఫ్, కెజిఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత యష్ ఎంత పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తారో అనుకుంటే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆయన, లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చారు. బడ్జెట్ పరంగా, క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే టాక్సిక్ కూడా కెజిఎఫ్ స్థాయి సినిమానే. కానీ యష్ ఫ్యాన్స్ టాక్సిక్ విషయంలో నిరాశ చెందుతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు.
అంచనాలను అందుకోలేకపోయిన టాక్సిక్ చిన్న టీజర్
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న టాక్సిక్ నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చింది కేవలం టీజర్ మాత్రమే. ఎన్నో అంచనాలతో వచ్చిన టాక్సిక్ టీజర్ అంచనాలను అందుకోలేకపోయింది. టీజర్ లాగానే సినిమా కూడా ఉంటే అనవసరంగా యష్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఎంతోమంది కామెంట్స్ చేయడంతో పాటూ, యష్ లాంటి స్టార్ ను లేడీ డైరెక్టర్ అయిన గీతూ హ్యాండిల్ చేయగలదా అని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
టాక్సిక్ కు రీషూట్లు
దీంతో సినిమాకు రీషూట్లు ఎక్కువయ్యాయని, కొంత మేర షూటింగ్ అయ్యాక డైరెక్టర్ పనితనంతో అసంతృప్తిగా ఉన్న యష్ స్వయంగా తానే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, మూవీ షూటింగ్ లేటవడం వల్ల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిందని వార్తలొస్తున్నాయి. దానికి తోడు టాక్సిక్ నుంచి టీజర్ తర్వాత మరో అప్డేట్ వచ్చింది లేదు. కాబట్టి మేకర్స్ ఇప్పటికైనా ఈ విషయంలో ఏదొకటి రియాక్ట్ అయి, వీలైనంత త్వరగా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే కంటెంట్ ను రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే సినిమాపై ఉన్న హైప్ తగ్గి, మెల్లిగా అది నెగిటివ్ గా మారే అవకాశముంది. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, వచ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
