Begin typing your search above and press return to search.

యశ్ ఫ్యాన్స్ టెన్షన్‌.. మరీ ఇంత తక్కువనా?

కన్నడ సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా సినీ ప్రేమికులు, యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు 'టాక్సిక్‌' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

By:  Ramesh Palla   |   26 Feb 2026 2:33 PM IST
యశ్ ఫ్యాన్స్ టెన్షన్‌.. మరీ ఇంత తక్కువనా?
X

కన్నడ సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా సినీ ప్రేమికులు, యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు 'టాక్సిక్‌' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ సినిమా తర్వాత యశ్‌ నుంచి రాబోతున్న సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉంది అనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 19, 2026న భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలు అయ్యాయి. గత ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ వాయిదా పడుతూ వచ్చింది. ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కి గీతా మోహన్ దాస్‌ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. టాక్సిక్ సినిమాను అన్ని భాషల్లోనూ భారీ మొత్తానికి బయ్యర్లు కొనుగోలు చేయడం జరిగింది.

టాక్సిక్ సినిమా రన్‌ టైమ్‌..

ఇటీవలే ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలకు రెడీ అయింది. సెన్సార్‌ కాపీ నిడివి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు ముఖ్యంగా పాన్‌ ఇండియా రేంజ్ సినిమాలు మూడు గంటలకు తగ్గకుండా నిడివితో వస్తున్నాయి. ఇక మీడియం రేంజ్ సినిమాలు సైతం 2 గంటల 45 నిమిషాల నిడివితో వస్తున్నాయి. కానీ ఇంత భారీ బడ్జెట్‌ సినిమా, పాన్‌ ఇండియా సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న టాక్సిక్ సినిమా మాత్రం కేవలం 2 గంటల 20 నిమిషాల నిడివితో రాబోతున్నట్లుగా కన్నడ మీడియా సర్కిల్స్ నుంచి సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలతో పోల్చితే దాదాపు అర గంట నిడివి తక్కువతో ఈ సినిమా రాబోతుంది. దాంతో యశ్ అభిమానులు టెన్షన్‌ పడుతున్నారు. భారీ యాక్షన్‌ సినిమా అంటున్నారు, పెద్ద స్టార్‌ కాస్ట్‌ మూవీ అన్నారు, మరి ఇంత తక్కువ రన్‌ టైమ్‌ సరిపోయేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

యశ్‌ సినిమా కోసం పాన్‌ ఇండియా ప్రేక్షకులు...

సాధారణంగా ఒక సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేస్తే అప్పుడు ఈ రన్‌ టైమ్‌ తో వచ్చినా పర్వాలేదు. కానీ టాక్సిక్ సినిమా రెండు పార్ట్‌లుగా రాబోతుంది అనే విషయాన్ని ఇప్పటి వరకు మేకర్స్ ఎక్కడ కూడా చెప్పలేదు. కనుక టాక్సిక్ సింగిల్‌ పార్ట్‌ మూవీ అన్నట్లుగానే ప్రచారం జరుగుతోంది. అలాంటప్పుడు ఎలా ఈ తక్కువ నిడివితో మొత్తం కథ చెబుతారు, అందులోనూ భారీ యాక్షన్‌ సీన్స్‌ ను ఎలా పెడుతారు అంటూ ఫ్యాన్స్‌తో పాటు రెగ్యులర్‌ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అనుమానాలు ఉన్నాయి. దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ కి ఏ మేరకు యశ్‌ ను హ్యాండిల్‌ చేసే సత్తా ఉంది అనే విషయంలో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. తీరా సినిమా విడుదలకు సిద్ధం అయిన సమయంలో రన్‌ టైమ్‌ విషయంలో దర్శకురాలు అందరికి షాక్ ఇచ్చింది.

నయనతార, కియారా అద్వానీ హీరోయిన్స్‌గా...

టాక్సిక్ సినిమాలో నయనతార , కియారా అద్వానీ , హుమా ఖురేషి, తారా సుతారియా వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా కెవిఎన్ ప్రొడక్షన్స్ - మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ లో నిర్మించారు. యశ్‌ కేజీఎఫ్‌ తర్వాత చేసిన మొదటి సినిమా ఇదే కావడంతో ఇప్పటికే ప్రీ రిలీజ్‌ బిజినెస్ భారీగా జరిగింది. థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు, ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చిన మొత్తంతో నిర్మాతలు లాభాల్లో పడ్డారనే వార్తలు వస్తున్నాయి. యశ్‌ ఈ సినిమాతో తన ఖాతాలో ఏకంగా రూ.200 కోట్లు వేసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న టాక్‌. మొత్తానికి టాక్సిక్ సినిమాపై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. కానీ సినిమా రన్‌ టైమ్‌ చూస్తే మాత్రం మీడియం రేంజ్ సినిమా కంటే తక్కువ ఉంది. కథ పూర్తిగా చెప్పకుండా చివర్లో పార్ట్‌ 2 ఉందని అందరిని యశ్‌ సర్‌ప్రైజ్ చేసేనా ఏంటో అనేది చూడాలి.