Begin typing your search above and press return to search.

యష్ టాక్సిక్.. ఫ్యాన్స్ టెన్షన్ కి మాస్ స్టఫ్ ఎప్పుడు..?

కె.జి.ఎఫ్ 2 సెన్సేషనల్ హిట్ తర్వాత యష్ టాక్సిక్ అంటూ ఒక సినిమా చేస్తున్నాడని తెలిసిందే.

By:  Ramesh Boddu   |   26 Oct 2025 6:00 PM IST
యష్ టాక్సిక్.. ఫ్యాన్స్ టెన్షన్ కి మాస్ స్టఫ్ ఎప్పుడు..?
X

కె.జి.ఎఫ్ 2 సెన్సేషనల్ హిట్ తర్వాత యష్ టాక్సిక్ అంటూ ఒక సినిమా చేస్తున్నాడని తెలిసిందే. గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. సినిమా గురించి అప్పట్లో ఒక గ్లింప్స్ వచ్చి అంచనాలు పెంచింది ఆ తర్వాత మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు. ఓ పక్క టాక్సిక్ పై రకరకాల వార్తలు యష్ ఫ్యాన్స్ ని టెన్షన్ లో పడేస్తుంది. డైరెక్టర్, హీరో మధ్య డిస్టన్స్ వచ్చిందని.. సినిమా అనుకున్న విధంగా అవుట్ పుట్ రావట్లేదని రకరకాల వార్తలు వస్తున్నాయి.

యష్ ఫ్యాన్స్ మళ్లీ పండగ..

ఐతే వీటిపై మేకర్స్ చాలా సైలెంట్ గా ఉన్నారు. ఎందుకంటే భారీ బడ్జెట్ తో వస్తున్న టాక్సిక్ పై కావాలనే ఇలాంటి నెగిటివిటీ చేస్తున్నారని వారు అంటున్నారు. సినిమా నెక్స్ట్ లెవెల్ మాస్ స్టఫ్ తో వస్తుందని యష్ ఫ్యాన్స్ అయితే మళ్లీ పండగ చేసుకుంటారని అంటున్నారు. ఐతే గీతు మోహన్ దాస్ టాక్సిక్ మొదలు పెట్టడానికి ముందే ఇలాంటి నెగిటివిటీ వస్తుందని గెస్ చేసింది. అందుకే సినిమా పూర్తయ్యే వరకు ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు.

సినిమా మొదలైన టైం లో గ్లింప్స్ వదిలిన చిత్ర యూనిట్ నెక్స్ట్ అప్డేట్స్ కి టైం తీసుకుంది. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో నయనతార కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాను 2026 ఫిబ్రవరి రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా క్వాలిటీ పరంగా ది బెస్ట్ అనిపించాలని సమ్మర్ కి షిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. K.G.F 1 అండ్ 2 సినిమాలతో పాన్ ఇండియా హిట్ అందుకున్న యష్ టాక్సిక్ పై ఈ లో బజ్ ఫ్యాన్స్ ని కాస్త టెన్ష పడేలా చేస్తున్నా వన్స్ సినిమా పూర్తై రిలీజ్ కి రెడీ అనుకున్న టైం లో భారీ ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు.

K.G.F మొదటి రెండు భాగాలు సూపర్ హిట్..

ఈ సినిమాతో యష్ మరోసారి నేషనల్ లెవెల్ ఆడియన్స్ కు తన మాస్ హీరోయిజం చూపించబోతున్నాడు. ఈ సినిమా అత్యధిక భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. K.G.F మొదటి రెండు భాగాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి యష్ టాక్సిక్ మీద తెలుగు ఆడియన్స్ కూడా మంచి అంచనాలు ఏర్పరచుకున్నారు.

టాక్సిక్ ఇండియన్ స్క్రీన్ మీద మరోసారి అసలు సిసలు గ్యాంగ్ స్టర్ మాస్ మూవీ చూపించాలని చూస్తున్నాడు యష్. సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని టాక్. టాక్సిక్ తో పాటు యష్ రామాయణ్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో రావణుడిగా యష్ కనిపించనున్నాడు.