యష్ 'టాక్సిక్'.. బరిలో దిగుంటే నష్టమేనా?
రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
By: M Prashanth | 8 March 2026 6:00 PM ISTరాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పై వెంకట్ కె. నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణీ వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కాగా.. మార్చి 19వ తేదీన మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అప్పుడే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. మార్చి 8న ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో అంతా వెయిట్ చేస్తుండగా.. ఇంతలో మేకర్స్ సడెన్ షాక్ ఇచ్చారు. జూన్ 4కు తేదీకి విడుదలను వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
అందుకు కారణంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితి అని మేకర్స్ తెలిపారు. దీంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేసినా.. ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎందుకంటే మార్చి 19వ తేదీకి టాక్సిక్ మూవీతో పాటు ధురంధర్: ది రివెంజ్ షెడ్యూల్ అయింది. రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పదని అంతా అనుకున్నారు.
కానీ టాక్సిక్ డ్రాప్ అయింది. అయితే దాని వెనుక రీజన్ పక్కన పెడితే.. ఆ నిర్ణయం చాలా మంచిదని ఇప్పుడు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 19న బరిలో దిగి ఉంటే కచ్చితంగా కష్టమయ్యేదని కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ధురంధర్: ది రివెంజ్.. గత ఏడాది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధురంధర్ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది.
దానికి తోడు ముందు నుంచే ధురంధర్ 2పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉండగా.. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ వాటిని ఆకాశాన్ని తాకేలా చేసింది. కచ్చితంగా మూవీ హిట్ అవుతుందని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. దాదాపు అన్ని భాషల్లో కూడా మూవీ లవర్స్.. ధురంధర్ 2 వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
పాన్ ఇండియా వైడ్ గా థియేటర్స్ పెద్ద ఎత్తున ధురంధర్ 2కే దక్కాయి. ఒకవేళ టాక్సిక్ మూవీ రిలీజ్ అయినా కూడా.. ధురంధర్: ది రివెంజ్ కు ఎక్కువగా కేటాయింపు జరుగుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఏదేమైనా ఇప్పుడు టాక్సిక్ మేకర్స్ తీసుకున్న నిర్ణయం సినిమాకు మంచి చేకూరేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ కంటెంట్ బాగున్నా కూడా ధురంధర్ 2 వల్ల నష్టం తప్పకపోయేదని అంటున్నారు. మరి జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న టాక్సిక్ మూవీ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.
